భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. శ్రీహరికోట షార్ కేంద్రంలో నుంచి రేపు ఉదయం 6:23 గంటలకు వందో ప్రయోగాన్ని చేపట్టనుంది. GSLV-F15 రాకెట్ ద్వారా 2,250 కిలోల బరువున్న NVS-02 ఉపగ్రహాన్ని 36,000 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహం దేశ నావిగేషన్ వ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రయోగాన్ని ఇస్రో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉదయం 5:50 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించవచ్చు.

