అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థల పరిరక్షణ కోసం లక్ష సంతకాల సేకరణలో భాగంగా గురువారం అఖిల పక్షం సారథ్యంలో లక్ష్మీపురంలోని వరంగల్ కూరగాయల మార్కెట్లో సంతకాల సేకరణ కార్యక్రమం జోరుగా సాగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తక్కెళ్లపల్లి రాజేశ్వర రావు, మిల్లు, వివిధ కార్మిక, ప్రజా సంఘాల నేతలు, కార్మికులు పాల్గొన్నారు. నేరుగా కూరగాయలు అమ్ముతున్న, ఇతర కార్మికుల వద్దకు వెళ్ళ విషయం చెప్పి, సంతకాలు సేకరించారు. ఇప్పటికే లక్ష సంతకాల సేకరణ ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో వరంగల్ కూరగాయల మార్కెట్లో చేపట్టే కార్యక్రమం మిల్లు కార్మిక భవన స్థల పరిరక్షణ ఉద్యమానికి మరింత బలాన్ని చేకూర్చింది.

