తిరుమల పరకామణి కేసు విషయంలో బీజేపీ నేతలు డీజీపీ ద్వారకా తిరుమల రావు ను శనివారం బీజేపీ నేతలు పాతూరి నాగభూషణం, తిరుపతి పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ తదితరులు కలిసి, విచారణ చేయాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం, టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో పరకమణి కేసులో రవి కుమార్ అనే వ్యక్తి దొంగతనంలో పట్టుబడ్డాడు. అయితే, డబ్బు రికవరీ చేయకుండా కొందరు బోర్డు సభ్యులు, పోలీసులు అతన్ని కాపాడారని ఆరోపించారు. టీటీడీపై ఒత్తిడి తెచ్చిన పోలీస్ అధికారి ఎవరో చెప్పాలని అడిగారు. ఈ కేసులో రూ.100 కోట్ల దోపిడీ జరిగిందని, క్లర్క్ స్థాయి వ్యక్తికి ఎలా కోట్ల ఆస్తులు వచ్చాయన్న అంశంపై నిలదీశారు. స్వామి వారి సొత్తు దోచిన వారిని కక్కిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో టీటీడీ ఈవో విజిలెన్స్ విచారణ చేపట్టింది. వైసీపీపై విమర్శలు చేస్తూ, దేవాలయాలను దోచుకున్నారని, పోలీస్ మరియు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులను వైసీపీ సర్వీసుగా మార్చినట్టు ఆరోపించారు.

