జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో ఆర్మీ వాహనం 350 అడుగుల లోయలో పడ్డ సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది . ఈ వాహనం 11 Madras Light Infantry (11 MLI) కు చెందినదిగా అధికారులు గుర్తించారు. ఈ వాహనంలో 18 మంది జవాన్లు ఉన్నట్టుగా సమాచారం. వారు నీలం హెడ్ క్వార్టర్స్ నుండి బల్నోయి ఘోర పోస్టుకు బయలుదేరగా మార్గం మధ్యలో ఈ విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. వాహనం లోయలో పడిన విషయం తెలుసుకున్న ప్రెస్ క్లబ్ బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.ఈ సంఘటనలో ఐదుగురు సైనికులు మరణించగా, మరో ఐదుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో చనిపోయిన జవాన్ కుటుంబాలకు White Knight Corps తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై 11 MLI బృందం, ఆర్మీ అధికారులు విచారణ ప్రారంభించారు.

