ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు. ఫలం లేదు. ఫేస్బుక్ లు, ఇన్స్టాలు, సోషల్ మీడియాల సూసి కూడా పెండ్లిల్లు సేసుకోబట్టిరి. అడ్డు అదుపు లేకుండ పాయె! ఇగ అయ్యా అవ్వలు ఆగమాగం కాబట్టిరి. ఇగ గిదంత పని కాదని గా ఊర్లే గీ పేమ పెండ్లిల్లనే నిషేధించి0డ్రు.

గా వూరు ఆర్య నగర్. హర్యానా రాష్ట్రం హిసార్ జిల్లల ఉంటది. గా ఊర్లే గ్రామ పెద్దలంతా కూసున్నరు. పంచాయతీ చేసిండ్రు. ఇగ ఊళ్లే ఎవలన్నా పేమ పెండ్లిల్లు సేసుకుంటే గా కుటుంబాలను పంచాయతీ గ్రామ బహిష్కారం చేస్తుందన్నరు. ఇక గిదే తీర్మానాన్ని గ్రామపంచాయతీ చేత చేపిచ్చిండ్రు. ఊర్లో ఉన్నోళ్లంతా అన్నదమ్ములు, అక్క సెల్లెల్ల లెక్క కలిసి మెలసి ఉండాలని తీర్పు ఇచ్చిండ్రు. గిదంతా ఎందుకు చేస్తాండ్రు అంటే.. గా ఊర్లే గీ మద్దెల ముగ్గురు పోరగా0డ్లు పేమ పెండ్లిల్లు సేసుకున్నరట!? గంతే!

