Thursday, September 24, 2026
22.2 C
Hyderabad

‘నీట్‌’గా నిర్వహించలేమా?!|EDITORIAL

లక్ష్యం ఎంత గొప్పదైనా, దాన్ని అమలు చేసే వ్యవస్థ సమర్థంగా, విశ్వసనీయంగా లేకపోతే నమ్మకం దెబ్బతింటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ ‘నీట్’ లోపాలను సరిదిద్దాలి. లేకపోతే ప్రతి ఏటా పరీక్షల కంటే వివాదాలే ఎక్కువగా వార్తల్లో నిలిచే పరిస్థితి కొనసాగుతుంది. యూజీసీ తరహాలో ‘నీట్’ని నీట్ గా నిర్వహించలేమా?

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

భారతదేశంలో వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఒకే జాతీయ ప్రమాణాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో నీట్ పరీక్షను 2013లో ప్రారంభించినప్పటికీ, రాష్ట్రాల వ్యతిరేకతల మధ్య 2017 నుంచి పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా సమాన అవకాశాలు కల్పించడం, మెడికల్ సీట్ల కేటాయింపులో పారదర్శకత పెంచడం, కోచింగ్ మాఫియా ప్రభావాన్ని తగ్గించడం వంటి లక్ష్యాలు దీనికి మూలం. అయితే ఆశించిన ఫలితాల కంటే వివాదాలు, పేపర్ లీకులు, పరీక్షల రద్దులు, రీ-ఎగ్జామ్స్, సాంకేతిక లోపాలు ఎక్కువగా నీట్ ని నీట్ గా చుట్టుముట్టాయి. ఫలితంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది.

ప్రస్తుతం దేశంలో వైద్య విద్యకు పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. ప్రతి ఏడాది 20 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్-యూజీ పరీక్షకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణలో చిన్న పొరపాటు కూడా లక్షలాది కుటుంబాలపై ప్రభావం చూపుతుంది. కానీ ఇటీవలి సంవత్సరాల్లో నీట్ నిర్వహణ విషయంలో వరుసగా వివాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పేపర్ లీకేజీల ఆరోపణలు, పరీక్షా కేంద్రాల నిర్వహణలో లోపాలు, ఫలితాలపై వివాదాలు, కోర్టు కేసులు సాధారణమైపోయాయి.

ఇటీవల రీ-ఎగ్జామ్ నిర్వహణ నిర్ణయం మరోసారి నీట్ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. ఇప్పటికే పరీక్ష రాసిన విద్యార్థులు మళ్లీ సన్నద్ధం కావాల్సి రావడం మానసికంగా వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నెలల తరబడి శ్రమించి పరీక్ష పూర్తి చేసిన తర్వాత మళ్లీ అదే ప్రక్రియను ఎదుర్కోవాల్సి రావడం వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులపై కూడా ఆర్థిక, మానసిక భారం పెరుగుతోంది.

గతంలో రాష్ట్రాల వారీగా నిర్వహించిన ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఈ స్థాయిలో జాతీయ వివాదాలు అరుదుగా కనిపించేవి. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక యంత్రాంగం సమన్వయంతో పరీక్షలను నిర్వహించేవి. మెడికల్ అడ్మిషన్లు కూడా నిర్దిష్ట కాలపట్టిక ప్రకారం పూర్తయ్యేవి. కానీ కేంద్ర స్థాయిలో నిర్వహిస్తున్న నీట్‌లో ప్రతి సంవత్సరం ఏదో ఒక వివాదం తలెత్తడం వ్యవస్థాపరమైన లోపాలకు సంకేతంగా కనిపిస్తోంది.

పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-ఎన్‌టీఏ పనితీరుపై ఇప్పటికే అనేక విమర్శలు వచ్చాయి. పరీక్షల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు, ప్రశ్నపత్రాల తయారీదారులను రహస్య ప్రాంతాల్లో ఉంచడం, సీఆర్‌పీఎఫ్ భద్రత, ఉన్నతస్థాయి పర్యవేక్షణ వంటి చర్యలు తీసుకోవడం పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిందో తెలియజేస్తోంది. ఒక ప్రవేశ పరీక్ష నిర్వహణకు హెలికాప్టర్లు, భారీ భద్రతా బలగాలు అవసరమయ్యే పరిస్థితి ఏర్పడితే అది విజయానికి కాకుండా వ్యవస్థ వైఫల్యానికే సూచనగా పరిగణించాల్సి ఉంటుంది.

అదే సమయంలో సాంకేతిక సమస్యలు కూడా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ సమయంలో వెబ్‌సైట్ నిలిచిపోవడం, టైమ్‌అవుట్ సమస్యలు, ఫీజు రిఫండ్ ప్రక్రియలో గందరగోళం వంటి అంశాలు పరీక్షా సంస్థ సామర్థ్యంపై సందేహాలు కలిగిస్తున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు ఒకేసారి పోర్టల్‌ను వినియోగిస్తారని ముందుగానే తెలిసినప్పటికీ, తగిన సాంకేతిక మౌలిక సదుపాయాలు కల్పించడంలో లోపాలు కనిపించాయి.

ఇక సైబర్ నేరాలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. రిఫండ్ మొత్తాలను అక్రమంగా ఇతర ఖాతాలకు మళ్లించడం, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నపత్రాలు అమ్ముతామంటూ మోసాలు జరగడం విద్యార్థుల ఆందోళనను పెంచుతోంది. పరీక్షా వ్యవస్థలో భద్రతా ప్రమాణాలు ఎంత బలహీనంగా ఉన్నాయో ఈ ఘటనలు సూచిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, వైఫల్యాలకు బాధ్యులైన వ్యవస్థలపై చర్యలు పరిమితంగానే ఉండగా, దాని భారం మాత్రం విద్యార్థులే మోయాల్సి వస్తోంది. పరీక్ష రద్దు అయితే మళ్లీ చదవాల్సింది విద్యార్థులే! అడ్మిషన్లు ఆలస్యం అయితే భవిష్యత్తు అనిశ్చితిలో పడేది కూడా వారిదే. కానీ, నిర్వాహక వ్యవస్థలో జవాబుదారీతనం కనిపించడం లేదు.

దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక పరీక్షలలో ఒకటైన యూపీఎస్సీ నిర్వహణను పరిశీలిస్తే క్రమశిక్షణ, భద్రత, పారదర్శకతకు ప్రాధాన్యం కనిపిస్తుంది. అదే స్థాయి ప్రమాణాలను నీట్ నిర్వహణలో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రశ్నపత్రాల భద్రత, డిజిటల్ మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రత, పరీక్షా కేంద్రాల పర్యవేక్షణ, ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి.

నీట్ లక్ష్యం సరైనదే కావచ్చు. దేశవ్యాప్తంగా ఒకే ప్రమాణంతో వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించాలనే ఉద్దేశాన్ని ఎవరూ వ్యతిరేకించరు. కానీ లక్ష్యం ఎంత గొప్పదైనా, దాన్ని అమలు చేసే వ్యవస్థ విశ్వసనీయంగా లేకపోతే ప్రజల నమ్మకం దెబ్బతింటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ సమగ్ర సమీక్ష చేపట్టి లోపాలను సరిదిద్దాలి. లేకపోతే ప్రతి సంవత్సరం పరీక్షల కంటే వివాదాలే ఎక్కువగా వార్తల్లో నిలిచే పరిస్థితి కొనసాగుతుంది. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగాలు చేసే వ్యవస్థకు సంస్కరణలు అత్యవసరం. నీట్‌ను కాపాడాలంటే ముందు విద్యార్థుల నమ్మకాన్ని కాపాడాలి.

Latest News

యికటి0చిన ముద్దు కటకాలు సూపింది!?|ADUGU TRENDS

ము ము ముద్దంటే చేదా?! ఆ ఉద్దేశ్యం లేదా? అన్నరు. ముద్దంటే ఎవరికి చేదు చెప్పండి. ఆ ఉద్దేశ్యం ఉందో? లేదో తెలుసుకోకపోతే, ముద్దూ, ముచ్చటా యికటిత్తయి. కటకాలు కూడా సూపిత్తయి. ముద్దుకైన, ముచ్చటకైన...

ఊగిసలాటకు ఊతం భద్రతే!|EDITORIAL

చమురు ధరల ఊగిసలాటకు తాత్కాలిక దౌత్య పరిణామాలు మాత్రమే కాకుండా యుద్ధం, రవాణా అంతరాయాలు, ఉత్పత్తి సామర్థ్యం, భద్రతా ముప్పులు కారణమవుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొని, అంతర్జాతీయ నౌకా రవాణా సాధారణ స్థితికి...

సెప్టెంబర్ 24, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 09.33 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ధనిష్ఠ ఉదయం 09.58 వరకు ఉపరి శతభిషం యోగం ధృతి సాయంత్రం 04.34 వరకు ఉపరి శూల కరణం కౌలవ ఉదయం 09.08...

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News