Wednesday, April 15, 2026
38.2 C
Hyderabad

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు నేర్పాయి.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ నాయకత్వంలో ఇరాన్ పై జరిపిన యుద్ధోన్మాద సైనిక చర్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపాయి.

ఇరాన్‌పై దాడుల ద్వారా వ్యూహాత్మక విజయాన్ని సాధించాలని ప్రయత్నించిన అమెరికా-ఇజ్రాయిల్ కూటమి ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఇరాన్‌పై ఒత్తిడి తీసుకురావాలని భావించినా, పరిస్థితి మరింత సంక్లిష్టమైంది. హార్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ కుదేలైంది. ఈ మార్గం అంతరాయం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు 10 నుండి 25 శాతం వరకు పెరిగినట్లు అంచనాలు సూచిస్తున్నాయి.

చమురు ధరల పెరుగుదల కేవలం ఇంధన రంగానికే పరిమితం కాలేదు. రవాణా ఖర్చులు పెరగడం వల్ల విమాన ప్రయాణాలు గణనీయంగా తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో టికెట్ ధరలు 30 నుండి 40 శాతం వరకు పెరిగాయి. అదే సమయంలో ఎరువుల తయారీ ఖర్చులు పెరగడంతో వ్యవసాయ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఎరువుల ఉత్పత్తి 15 శాతం వరకు తగ్గినట్లు అంతర్జాతీయ సంస్థల అంచనాలు చెబుతున్నాయి. ఈ ప్రభావంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పడిపోయి, ధరలు పెరిగే ప్రమాదం ఉంది.

ఈ పరిణామాల పర్యవసాల ఫలితంగా ప్రపంచ ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ద్రవ్యోల్బణం 8 నుండి 12 శాతం మధ్య ఊగిసలాడుతుండగా, కొన్ని దేశాల్లో ఇది ఇంకా అధికంగా నమోదవుతోంది. కరెన్సీ విలువలు పడిపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో స్థానిక కరెన్సీలు డాలర్‌తో పోలిస్తే 5 నుండి 15 శాతం వరకు విలువ కోల్పోయాయి. ఈ పరిణామం దిగుమతులపై ఆధారపడే దేశాలకు మరింత భారంగా మారింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రభావాన్ని అర్థం చేసుకోవాలంటే చమురు ప్రాధాన్యతను గుర్తించాల్సిందే. చమురు కేవలం ఒక ఇంధన వనరు మాత్రమే కాదు. అది ప్రపంచ వాణిజ్యానికి కేంద్రబిందువు. ఉత్పత్తి, రవాణా, వ్యవసాయం, పరిశ్రమలు సహా అన్ని రంగాలు చమురుపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే చమురు ధరల్లో చిన్న మార్పు కూడా విస్తృతమైన విపరీత ప్రభావాన్ని చూపుతుంది. ముడి చమురు ధరలో 10 శాతం పెరుగుదల ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిపై 0.5 నుండి 1 శాతం వరకు ప్రభావం చూపగలదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఈ సంక్షోభం మరో కీలక అంశాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. అది డాలర్ ఆధిపత్యం. ప్రపంచ చమురు వ్యాపారం మొత్తం డాలర్లలోనే జరుగుతుంది. అందువల్ల డాలర్ విలువ స్థిరత్వం చమురు మార్కెట్‌తో ముడిపడి ఉంటుంది. డాలర్ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు అమెరికా తీసుకుంటున్న రాజకీయ, సైనిక చర్యలు కూడా ఈ యుద్ధాలకు కారణం. ఈ నేపథ్యంలో చమురు వనరులపై నియంత్రణ కోసం జరుగుతున్న పోరాటాన్ని కేవలం భద్రతా సమస్యగా కాకుండా ఆర్థిక ఆధిపత్య పోరాటంగా కూడా చూడాల్సిన అవసరం ఉంది.

అయితే, ఈ యుద్ధం అమెరికా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఇరాన్‌పై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమవడంతో పాటు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిర సంక్షోభంలోకి నెట్టాయి. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఆహార భద్రత, ఉపాధి, జీవన వ్యయం, చివరకు దేశ భద్రత దాకా అన్నీ యుద్ధం కారణంగా విపరీత ప్రభావానికి లోనయ్యాయి.

మరైతే ఈ యుద్ధాల వల్ల నిజంగా ఎవరు లాభపడ్డారు? అగ్ర రాజ్యాల యుద్ధోన్మాదం మిగిల్చింది విషాదమే. నష్టపోయింది ప్రపంచ ప్రజలే. ఎప్పటికైనా ఈ యుద్ధాల విరామాలు కాదు విరమణలు కావాలి. సమత, మమత, శాశ్వత శాంతిని నెలకొల్పాలి.

ప్రపంచ నాయకత్వం ఇప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయం ఇది. యుద్ధోన్మాదాన్ని విడనాడి, చర్చలు, దౌత్యపరమైన పరిష్కారాల ద్వారా సమస్యలను పరిష్కరించాలి. ఇరాన్ సహా ప్రభావిత దేశాల పునర్నిర్మాణానికి అంతర్జాతీయ సహకారం అవసరం. లేకపోతే ఈ సంక్షోభం మరింత లోతుగా మారి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దీర్ఘకాలిక మాంద్యంలోకి నెట్టే ప్రమాదం ఉంది.

మొత్తానికి, ప్రస్తుత పరిణామాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. అంతిమంగానైనా సరే, యుద్ధం ఎప్పుడూ పరిష్కారం కాదు. యుద్ధాన్ని మొదలు పెట్టడం సులువు. కానీ, దాన్ని విరమించడం చాలా కష్టం. అది మానవత్వాన్ని తుంచి, సమస్యలను మరింత పెంచుతుంది. శాంతి, సహకారం, సమాన అభివృద్ధి ఇవే ప్రపంచ భవిష్యత్తును రక్షించే మార్గాలు.

Latest News

వాడి పడేసిన డబ్బల్ని వాడే ఇకమతు!?|ADUGU TRENDS

ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! ఉపాయం ఉంటే ఊరేగొచ్చట!! వాడి పడేసే డబ్బాల్ని గిట్ల వాడే ఇకమతు శేస్తున్న గీ అక్క ఉపాయం సూత్తే మీరే పరేషాన్ అయితరు! మనం పండ్లు కొంటే గ...

శాంతి చర్చలు-సజీవంగా ఆశలు!?|EDITORIAL

ప్రపంచంలో యుద్ధోన్మాద ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్నాయి. పశ్చిమాసియా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య చర్చలు విఫలమవడం, ఇజ్రాయెల్ పాత్ర, చమురు సరఫరాలో ప్రతిష్టంభన, అంతరాయం ప్రపంచాన్ని అస్థిరత వైపు నెడుతున్నాయి. శాంతి...

15-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ త్రయోదశి రాత్రి 08.17 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం పూర్వాభాద్ర మధ్యాహ్నం 01.10 వరకు ఉత్తరాభాద్ర యోగం బ్రహ్మ ఉదయం 11.27 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం 08.41 వరకు ఉపరి...

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News