Tuesday, July 28, 2026
28.4 C
Hyderabad

వంట గ్యాస్ సమస్య తాత్కాలికమా? దీర్ఘకాలికమా?|EDITORIAL

అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సహా, సాధారణ కుటుంబాల వంటింటినీ ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్‌–అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరిగిన ఘర్షణల కారణంగా ప్రపంచంలోని అత్యంత కీలక సముద్ర మార్గాలలో ఒకటైన హార్మూజ్ జలసంధి సందిగ్ధంలో పడింది. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో ప్రధాన పాత్ర పోషించే ఈ మార్గం అడ్డంకులకు గురికావడంతో భారతదేశంలో వంట గ్యాస్ సరఫరా, ధరలపై ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.

ప్రపంచ చమురు రవాణాలో 20% ఈ జలసంధి ద్వారానే సాగుతుంది. రోజుకు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు, భారీ ఎత్తున ఎల్ఎన్జీ గ్యాస్ ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు చేరుతుంది. అందువల్ల ఇక్కడ ఏ చిన్న ఉద్రిక్తత వచ్చినా అది గ్లోబల్ మార్కెట్లను కుదిపేస్తుంది. ప్రస్తుతం యుద్ధం కారణంగా నౌకాయాన రాకపోకలు ఆగిపోయాయి. కొన్ని రోజులపాటు నౌకల రాకపోకలు దాదాపు నిలిచిపోయిన సందర్భాలూ ఉన్నాయి.

భారతదేశం ఇంధన అవసరాలలో పెద్ద భాగాన్ని దిగుమతులపై ఆధారపడి ఉంటుంది. దేశం వినియోగించే చమురులో 85% విదేశాల నుంచే వస్తుంది. అందులో పెద్ద భాగం గల్ఫ్ ప్రాంతం నుంచి వస్తుంది. ముఖ్యంగా వంట గ్యాస్ విషయంలో పరిస్థితి మరింత క్లిష్టం. భారతదేశం ఉపయోగించే ఎల్పీజీలో 60% దిగుమతి, అందులో 90% వరకు హార్మూజ్ మార్గం ద్వారానే వస్తుంది.

ఈ నేపథ్యంలో యుద్ధ ప్రభావం నేరుగా వంట గ్యాస్ సరఫరాపై పడుతోంది. ఇటీవలే భారతదేశంలో ఎల్పీజీ వినియోగం 17.3 శాతానికి పడిపోయింది. గత నెలతో పోలిస్తే 26.3% తగ్గుదల నమోదైంది. దీనికి ప్రధాన కారణం హార్మూజ్ ప్రాంతంలో నౌకాయానంలో ఏర్పడిన యుద్ధం.

భారతదేశానికి వచ్చే కొన్ని గ్యాస్ ట్యాంకర్లు అక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం 22 నౌకలు, అంటే వాటిలో ఎల్పీజీ, ఎలెన్జీ, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయిన కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

ప్రకృతి వాయువు రంగంలో కూడా ప్రభావం కనిపిస్తోంది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల భారతదేశానికి వచ్చే ప్రకృతివాయువు దిగుమతుల్లో 25% ప్రభావితమయ్యాయి. దేశం రోజుకు సుమారు 189 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ వినియోగిస్తుండగా, అందులో కొంత భాగం సరఫరా సమస్యలు ఎదుర్కొంటోంది.

అయితే, పరిస్థితి నియంత్రణలోనే ఉందని ప్రభుత్వం చెబుతోంది. గ్యాస్ కొరత ఎక్కువగా గృహ వినియోగంపై కాకుండా పరిశ్రమలపై పడేలా ప్రాధాన్యత క్రమాన్ని అమలు చేస్తున్నారు. హాస్పిటల్స్, విద్యాసంస్థలు, గృహ వినియోగం వంటి కీలక రంగాలకు ముందుగా సరఫరా చేస్తున్నారు.

ప్రస్తుతం భారతదేశం 40 దేశాల నుంచి చమురు దిగుమతి చేస్తోంది. హార్మూజ్ మీద ఆధారాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వచ్చే దిగుమతులను 55% నుంచి 70%నికి పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది.

అయినా గ్యాస్ సంక్షోభం త్వరలోనే సమసిపోతుందని చెప్పడం కష్టం. విశ్లేషకుల అంచనాల ప్రకారం, హార్మూజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగితే దక్షిణాసియాలో ఎలన్జీ సరఫరా త్రైమాసికానికి 2–3 మిలియన్ టన్నులు తగ్గే అవకాశం ఉంది.

ఇది జరిగితే.. పరిశ్రమల ఉత్పత్తి తగ్గడం, ఎరువుల ధరలు పెరగడం, చివరకు ఆహార ధరలు కూడా పెరగడం వంటి ప్రభావాల పరంపర ప్రమాదం ఉంది. ఇంధన వ్యయాలు పెరగడం వల్ల జీవన వ్యయం పెరుగుతుంది.

అయితే, ఆశాజనక అంశాలు కూడా ఉన్నాయి. భారతదేశం వద్ద కొన్ని వారాలపాటు సరిపడే వ్యూహాత్మక నిల్వలు ఉన్నాయి. అవసరమైతే ఇండియన్ నేవీ సహాయంతో నౌకలకు రక్షణ కల్పించే ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నారు. అయినా, ప్రస్తుతం కనిపిస్తున్న వంట గ్యాస్ కష్టాలు పూర్తిగా తాత్కాలికమేనని చెప్పలేం. అలాగని, దీర్ఘకాల సంక్షోభంగా మారే అవకాశమూ తక్కువే. యుద్ధ పరిస్థితులు తగ్గితే సరఫరా త్వరగా సాధారణ స్థితికి రావచ్చు. కానీ ఉద్రిక్తతలు కొనసాగితే మరికొన్ని నెలలు గ్యాస్ సరఫరాలో ఒత్తిడి ఉండకతప్పదు.

హార్మూజ్ జలసంధి సంక్షోభం ఒక పెద్ద పాఠం చెబుతోంది. ఇంధన భద్రత కోసం దేశం దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకుని, ప్రత్యామ్నాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వంట గ్యాస్ సమస్య తాత్కాలికంగా కనిపిస్తున్నా, ఆ సమస్య పరిష్కారం మాత్రం చాలా దీర్ఘకాలికం.

Latest News

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

జూలై 27, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి త్రయోదశి మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం మూల ఉదయం 11.00 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం వైధృతి రాత్రి 12.18 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి...

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News