Thursday, September 24, 2026
22.2 C
Hyderabad

ఈవీలేవీ? ఈవీలపై క్లారిటీలేవీ?|EV|TELANGANA|CM|GOVERNMENT

మొన్న సీఎం|CM|REVANTH REDDY, నిన్న డిప్యూటీ సీఎం|DEPUTY CM|BHATTI VIKRAMARKA MALLU
ప్రకటనల సారాంశమేంటి?|SUMMARY
ప్రస్తుత వాహనాలనేం చేస్తారు?|OLD VEHICLES
కొత్తవి సరే, పాతవాటి పరిస్థితేంటి?
ఇప్పటికే తుప్పుపట్టిన వాహనాల సంగతేంటి?
ఇం‘ధన’ ఖర్చు తగ్గించడానికి వేల కోట్ల వ్యయమా?
ఉన్న నాలుకకు మందేస్తే కొండనాలుక ఊడినట్లేనా?
రాజకీయ ప్రకటనా? విధాన నిర్ణయమా?|POLITICAL|GOVERNMENT
ప్రకటనలకే పరిమితమా? ప్రణాళికలేమైనా ఉన్నాయా?
ఇది సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణేనా?
ఈ ఆర్థిక భారం యథాలాప వృథా ప్రయాసా?

అధికారులు ఎలక్ట్రిక్ వాహనాలనే వినియోగించాలని, దశల వారీగా అమలు చేస్తామని, మొన్నామధ్య ఒక శాఖ సమీక్షలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిన్న బడ్జెట్ సన్నాహక సమీక్షలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క కూడా ఇదే ప్రకటన చేశారు. ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన పెట్రో, డీజిల్ కొరత కారణంగా ఇం‘ధన’ వ్యయాన్ని తగ్గించుకోవడానికి, ఆదా చేయడానికి, పర్యావరణ హితానికి అనుగుణంగా వారీ ప్రకటన చేసి ఉంటారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే, దశలవారీగా నైనా సరే, కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఖర్చు ఎంతవుతుంది? అన్ని ఈవీలు అందుబాటులో ఉన్నాయా? ఇప్పటికే సర్కారు వారి ఆయా కార్యాలయాల్లో తుప్పుపట్టి పోతున్న వాహనాలకే దిక్కులేదు. మరి, ప్రస్తుతం ఉన్న పాత వాహనాల పరిస్థితేంటి? ఉన్న నాలుకకు మందేస్తే, కొండనాలుక ఊడినట్లేనా? ఇది రాజకీయ ప్రకటనా? విధాన నిర్ణయమా? కేవలం ప్రకటనలకే పరిమితమా? నిజంగానే ప్రభుత్వం దగ్గర ప్రణాళికలేమైనా ఉన్నాయా? ఇదే నిజమైతే, ఈవీల కొనుగోలు సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణేనా? ఈ ఆర్థిక భారం యథాలాప వ్రుథా ప్రయాస కానుందా? అసలు ప్రభుత్వ వాహనాలెన్ని? వాటిలోనూ అవుట్ సోర్సింగ్, హైరింగ్ వాహనాలెన్ని? ఆర్టీసీవెన్ని? ఈ మొత్తంలో అసలు ఈవీలపై క్లారిటీలేవీ? అనే అనేకానే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ప్రభుత్వ పెట్రో, డీజిల్ వాహనాలకు బదులు దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలనే వాడాలని వేర్వేరుగా జరిగిన శాఖల సమీక్షల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇం‘ధన’ వ్యయం తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ అనే కోణంలో ఇది ముందుచూపుతో కూడిన నిర్ణయంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కూడా ఇదే దిశగా అడుగులు వేస్తున్నాయి. సరే, ఈవీలతో ప్రభుత్వంపై పడే పెను భారం పెను సమస్యగా పరిణమించనుంది. ఈవీలపై ప్రభుత్వ దగ్గర స్పష్టమైన లెక్కలు, ప్రణాళికలేమైనా ఉన్నాయా? లేక ఇది మరో ఆకర్షణీయమైన అనాలోచిత ప్రభుత్వ నిర్ణయంగా మారుతుందా? ప్రకటనకే పరిమితమవుతుందా? అసలే ఆదాయ, ఆర్థిక లేమి, అప్పులు, అప్పులకు వడ్డీలు, సంక్షేమ పథకాలు, ఉచితాలు, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీలు, ప్రభుత్వ, అధికారుల నిర్వహణా ఖర్చులు.. వీటన్నింటనీ చూస్తే, ఈ ప్రకటన ప్రభుత్వాన్ని మరింత అప్పుల్లోకి నెట్టే ఆనాలోచిత నిర్ణయంగానే మిగులుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రపంచం సహా, తెలంగాణలో వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రతి రోజు వేల సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఫలితంగా పట్టణాల్లో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులు ఇచ్చి వాటిని ప్రోత్సాహిస్తోంది.

రాష్ట్రంలో వాహనాలు
2025, ఆగస్టు నాటికి తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య 1.77 కోట్లు. 15 ఏళ్ల పైన వయస్సు ఉన్న పాత వాహనాలు 41.86 లక్షలు.

రాష్ట్రంలో ప్రభుత్వ వాహనాలు ఎన్ని?
ప్రభుత్వం వాహనాలు, అవుట్సోర్సింగ్, హైర్ పద్ధతిలో ఉపయోగించే వాహనాలు. పోలీస్, రెవెన్యూ, ఆరోగ్య శాఖ, అటవీ, మున్సిపల్, విద్యుత్ వంటి శాఖలు, వాటి అనుబంధ విభాగాలు పెద్ద సంఖ్యలో వాహనాలను వినియోగిస్తున్నాయి. కానీ ప్రభుత్వం దగ్గర ఈ సమగ్ర లెక్కలు ఇప్పటికీ లేవు. అయితే అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పోలీస్ శాఖలోనే పట్రోలింగ్, జీపులు, బైక్‌లు 10వేలకు పైగా ఉన్నాయి. ఆర్టీసీలో 9,400లకు పైగా బస్సులు ఉన్నాయి.3 వేల నుండి 4వేల వరకు హైర్ బస్సులు ఉన్నాయి. 300ల ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా, కొత్తగా వెయ్యికి పైగా ఈవీ బస్సులను ప్రవేశపెట్టే ప్రక్రియ కొనసాగుతోంది. మున్సిపల్ శాఖ 6వేలకు పైగా వాహనాలను వినియోగిస్తోంది. రెవిన్యూ, ఆరోగ్య, పంచాయతీరాజ్, టూరిజం.. ఇలా అన్నిశాఖలు కలిపి అదనంగా మరో 40వేల నుంచి 50 వేల వాహనాలను వాడుతున్నాయి. సీఎం కాన్వాయ్, సిబ్బంది వగైరాలు వందకు పైగా వాహనాలను వినియోగిస్తున్నారు. మంత్రులు ఒక్కొక్కరు 5 నుంచి 10 వాహనాలు, వారి సిబ్బందీ ఎఎస్డీలు, పీఎస్ లు, కలిపి ఒక్కోశాఖలో మరో 10 వాహనాలు వాడుతున్నారు. ఇవీ గాక, సెక్రటేరియట్ అధికారులు 600 నుంచి వెయ్యి వాహనాలను వినియోగిస్తున్నారు. ఐఎఎస్ లు, వారి సిబ్బంది, కార్యదర్శులు, ఇతర అధికారులు కలిపి మరో వెయ్యి వాహనాలను వినియోగిస్తున్నారు. ఇక మంత్రులు, ఉన్నతాధికారుల మౌఖికంగా ఇచ్చే ఆదేశాలతో నడిచే వాహనాలతో ఇలా లెక్కలు వేస్తూ పోతే, తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం వాహనాల్లో ఐదు పదివేలు తక్కువ సగం వాహనాలు ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో ప్రభుత్వానివే ఉన్నట్లుగా లెక్కలు తేలుస్తున్నాయి. ఇంత భారీ మొత్తంలో వాహనాలు వినియోగిస్తున్న ప్రభుత్వం అన్ని వాహనాలను దశల వారీగా ఏ మేరకు ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చగలదు?

వేల కోట్ల ప్రాజెక్టుగా..
సాధారణంగా ప్రభుత్వ విభాగాలు ఉపయోగించే ఒక ఎస్ యూవీ లేదా యుటిలిటీ వాహనం ధర రూ.10 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఉంటుంది. తమ జేబులోంచి పెట్టే డబ్బు కాకపోవడంతో అధికారులు సాధారణంగా హై ఎండ్ వాహనాలనే కొంటారు. సగటు ధరను ₹12 లక్షలుగా తీసుకుంటే, రాష్ట్రంలో కనీసం 50వేల ప్రభుత్వ వాహనాలు ఉన్నాయని అనుకుంటే వాటి మొత్తం విలువ సుమారు రూ. 6వేల కోట్లు అవుతుంది.

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఒక మంచి ఎలక్ట్రిక్ కార్ ధర రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. సగటు ధరను రూ.18 లక్షలుగా తీసుకుంటే, 50,000 వాహనాలకు రూ.9 వేలకోట్లు అవుతుంది.

నిర్వహణా ఖర్చులు అదనం
ఇది కేవలం వాహనాల కొనుగోలు ఖర్చు మాత్రమే. దీనికి తోడు చార్జింగ్ మౌలిక సదుపాయాలు, నిర్వహణ వ్యవస్థలు, బ్యాటరీ మార్పిడి ఖర్చులు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కేంద్రాలు, పోలీస్ స్టేషన్లు వంటి అనేక చోట్ల చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ఖర్చులను కలిపితే మొత్తం ప్రాజెక్ట్ రూ.10వేల కోట్లయినా ఆశ్చర్యం లేదు.

పాత వాహనాల పరిస్థితేంటి?
ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న పాత ప్రభుత్వ వాహనాల పరిస్థితి ఏమిటి? సాధారణంగా ప్రభుత్వ వాహనాల జీవితకాలం 10 నుంచి 15 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత వాటిని ప్రభుత్వ వేలం ద్వారా విక్రయించడం లేదా స్క్రాప్ చేయడం జరుగుతుంది. కానీ వాస్తవ పరిస్థితుల్లో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో పాత వాహనాలు సంవత్సరాల తరబడి ఉపయోగించకుండా గ్యారేజీలలో నిల్వ ఉండటం కూడా సాధారణమే. తుప్పు పట్టిన అలాంటి వాహనాల స్క్రాప్ విలువ చలా తక్కువేననే సంగతి తెలిసిందే.

అధికారులు వాడే వాహనాలపై ఆడిట్ ఉందా?
ఈ నేపథ్యంలో ప్రభుత్వ వాహనాల ఎలక్ట్రిఫికేషన్ వంటి పెద్ద నిర్ణయాన్ని అమలు చేయాలంటే ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ వాహనాలు ఎన్ని? శాఖల వారీగా ఎన్ని? వాటిలో ఎన్ని పాతవి? ఎన్ని కొత్తవి? వాటి వేలం ద్వారా వచ్చే ఆదాయం ఎంత? ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు దశల ప్రణాళిక ఏమిటి? ఇవన్నింటిలోనూ స్పష్టత అవసరం.

అంచనా, ప్రణాళిక ముఖ్యం
ప్రభుత్వం నిజంగా పర్యావరణ హిత విధానాన్ని అమలు చేయాలనుకుంటే పాత వాహనాల స్క్రాపింగ్ పాలసీ, కొత్త వాహనాల కొనుగోలు దశల ప్రణాళిక, మొత్తం ఖర్చు వివరాలను అంచనా వేయాలి. అలాగే ప్రభుత్వ వాహనాలు, అధికారులు వాడుతున్నవి, నియమనిబంధనలు, వాడే వారి అర్హతలు, వాటి వినియోగం ఆధారంగా సమీక్షించి, మదింపు చేయాలి. అలా చేస్తేనే ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది.

భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలే వినియోగించాలనే విషయంలో సందేహం లేదు. కానీ ప్రజల డబ్బుతో అమలు చేసే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రకటనలతో కాకుండా లెక్కలు, పారదర్శకత, స్పష్టమైన ప్రణాళిక ఆధారంగా జరగాలి. లేకపోతే అది మరో ఖరీదైన ప్రభుత్వ ప్రయోగంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

Latest News

యికటి0చిన ముద్దు కటకాలు సూపింది!?|ADUGU TRENDS

ము ము ముద్దంటే చేదా?! ఆ ఉద్దేశ్యం లేదా? అన్నరు. ముద్దంటే ఎవరికి చేదు చెప్పండి. ఆ ఉద్దేశ్యం ఉందో? లేదో తెలుసుకోకపోతే, ముద్దూ, ముచ్చటా యికటిత్తయి. కటకాలు కూడా సూపిత్తయి. ముద్దుకైన, ముచ్చటకైన...

ఊగిసలాటకు ఊతం భద్రతే!|EDITORIAL

చమురు ధరల ఊగిసలాటకు తాత్కాలిక దౌత్య పరిణామాలు మాత్రమే కాకుండా యుద్ధం, రవాణా అంతరాయాలు, ఉత్పత్తి సామర్థ్యం, భద్రతా ముప్పులు కారణమవుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొని, అంతర్జాతీయ నౌకా రవాణా సాధారణ స్థితికి...

సెప్టెంబర్ 24, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 09.33 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ధనిష్ఠ ఉదయం 09.58 వరకు ఉపరి శతభిషం యోగం ధృతి సాయంత్రం 04.34 వరకు ఉపరి శూల కరణం కౌలవ ఉదయం 09.08...

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News