Wednesday, September 23, 2026
24.7 C
Hyderabad

భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం|EDITORIAL

పొట్టి ప్రపంచ కప్ క్రికెట్ లో తిరుగులేని విజేతగా నిలవడం భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం. ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ సాధన మాత్రమే కాదు. గత విశ్వకప్ ఆటల అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాల సమాహారం. కలిసికట్టుగా జట్టు ప్రదర్శించిన ప్రతిభాపాఠవం, నైపుణ్యం, ధైర్యం, వ్యూహం, సమిష్టి కృషికి ప్రతి రూపం. ఆశేష భారత ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆత్మగౌరవానికి ఈ విజయం ప్రతీక. క్రికెట్ విశ్వవిను వీధుల్లో విజయాల విజేత సగర్వ పతాక!

భారత క్రికెట్‌కు ప్రపంచ కప్ విజయాలు కొత్తవి కావు. పైగా గెలుపులు అలవాటైపోతున్న ఆటలు. 1983లో ప్రపంచ కప్ గెలవడం ద్వారా భారత జట్టు ప్రపంచ క్రికెట్‌లో తన స్థానాన్ని నిరూపించుకుంది. 2007లో జరిగిన తొలి ఐసీసీ మెన్స్ వాల్డ్ కప్ లో యువ జట్టుతో విజయం సాధించడం భారత క్రికెట్‌కు ఒక కొత్త దిశను ఇచ్చింది. 2024లో విజేలవడం, మెన్నీమధ్యే మహిళా జట్టు కూడా విశ్వవిజేతగా నిలవడం ఈ ఆట ఆదరణ రీత్యా అదరగొట్టే గెలుపులే. భావి భారత క్రికెట్ కు కీలక మలుపులే. అయితే ఆ తర్వాత జరిగిన పలు టీ20 ప్రపంచ కప్‌లలో భారత్ మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ, తుది విజయాన్ని అందుకోవడంలో తరచూ తడబడుతూ వచ్చింది. సెమీ ఫైనల్స్, ఫైనల్స్ దాకా రావడం, కీలక మ్యాచ్‌లలో జరిగిన చిన్న చిన్న తప్పిదాలు జట్టును, భారతావనిని నిరాశ పరిచేవి. కానీ, ఈ సారి ఆ బలహీనతను బలంగా మార్చుకుని గెలవడం భారత్ ఆటగాళ్ళ అత్యంత ప్రతిభకు నిదర్శనం.

ఈ అనుభవాల నేపథ్యంలో తాజా విజయం ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. గత దశాబ్దంలో భారత జట్టు లీగ్ దశలో అద్భుతంగా ఆడినా, నాకౌట్ దశలో ఒత్తిడికి లోనవుతూ పరాజయాలను ఎదుర్కొంది. ఈ సమస్యను అధిగమించడం కోసం జట్టు మానసిక ధైర్యాన్ని పెంచుకోవడం, వ్యూహాత్మక మార్పులు చేయడం అవసరమైంది. ఈసారి ఆ ఎత్తులు, మార్పులన్నీ వర్కౌట్ అయ్యాయి.

ఈ విజయానికి కారణమైన ఆటగాళ్ళ ప్రతిభతోపాటు, నాయకత్వ పటిమ ఎంతో కీలక పాత్ర పోషించింది. జట్టు కెప్టెన్లుగా గతంలో వ్యవహరించిన కపిల్ దేవ్, ధోనీ, రోహిత్ శర్మ లాంటి సాహసోపేత నిర్ణయాలు, ఆటగాళ్లపై ఉంచిన విశ్వాసం, కీలక సమయంలో దూకుడైన వ్యూహాలు జట్టును విజయపథంలో నడిపించాయి. గౌతం గంభీర్ పర్యవేక్షణలో, సూర్య నాయకత్వంలో జట్టు పరిస్థితులకు అనుగుణంగా ఆడే సామర్థ్యాన్ని కూడా సముపార్జించుకుంది.

అలాగే బ్యాటింగ్‌లో సచిన్, విరాట్ లాంటి దిగ్గజాలు విశేష అనుభవజ్ఞులు కీలక మ్యాచ్‌లలో గతంలో బాధ్యతాయుతంగా ఆడటం తాజా జట్టుకు బలాన్ని ఇచ్చింది. గతంలో కొన్ని టోర్నమెంట్‌లలో భారత బ్యాటింగ్ ఒకరు లేదా ఇద్దరి ఆటగాళ్లపై ఆధారపడే సందర్భాలే కనిపించేవి. అయితే ఈసారి అన్ని స్థానాల్లో ఉన్న వాళ్ళంతా సందర్భాలను బట్టి వాళ్ళ వాళ్ళ పాత్రలను స్థిరంగా పోశించడం, రాణించడం, ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది.

బౌలింగ్ విభాగంలో కూడా భారత్ విశేష పురోగతి సాధించింది. వేగం, క్రమశిక్షణ, వ్యూహాత్మక మార్పులతో ప్రత్యర్థులను కట్టడి చేయగల సామర్థ్యం జట్టులో బాగా పెరిగింది. కీలక సమయాల్లో వికెట్లు సాధించడం ద్వారా మెరుపులతో, మ్యాచ్‌లను మలుపులు తిప్పగల బౌలర్లు జట్టుకు గొప్ప ఆస్తిగా మారారు. ఇది గత విశ్వకప్‌లతో పోలిస్తే విశేషమైన మార్పుగా కనిపిస్తుంది.

భారత జట్టు రక్షణాత్మక ధోరణిని ప్రదర్శిస్తూనే, తాజా టీ20 ప్రపంచ కప్‌లో ధైర్యంగా, దూకుడుగా ఆడింది. పవర్‌ప్లేలో వేగంగా పరుగులు చేయడం, మధ్య ఓవర్లలో స్మార్ట్ స్ట్రైక్ రొటేషన్, చివరి ఓవర్లలో భారీ షాట్లతో స్కోరు పెంచడం వంటి అంశాలు జట్టు వ్యూహంలో భాగమయ్యాయి.

ఈ విజయం భారత క్రికెట్ వ్యవస్థలో జరిగిన మార్పులకు ప్రతిబింబం కూడా. దేశవ్యాప్తంగా ఉన్న యువ ప్రతిభను గుర్తించి వారికి అవకాశాలు ఇవ్వడం, ఫిట్‌నెస్, ప్రొఫెషనల్ దృక్పథాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలు జట్టును మరింత బలంగా తీర్చిదిద్దాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తీసుకున్న నిర్ణయాలు కూడా కీలక పాత్ర పోషించాయి.

ఈ విజయం భారత క్రికెట్‌కు ఒక కొత్త ప్రారంభం. ప్రపంచ క్రికెట్‌లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. కాబట్టి ఈ విజయంతో తృప్తి చెందకుండా, అదే స్థాయిలో స్థిరత్వాన్ని కొనసాగించడం అవసరం. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం, జట్టులో సమతుల్యతను కొనసాగించడం భవిష్యత్ విజయాలకు మార్గం చూపుతుంది. ఇదే ధోరణి కొనసాగితే భారత క్రికెట్ ప్రపంచ వేదికపై మరిన్ని విజయాలు సాధించడం ఖాయం.

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News