పన్నీర్.. కూరగాయల భోజనాలోల్లకు శాపలు, మటన్, శికెన్ల కంటె ఎక్కువ. పనీర్ మసాలా, పాలక్ పనీర్, పనీర్ బిర్యానీ వంటి పన్నీర్ తో చేసే వంటకాలను నాలికె చప్పరించుకుంట తింటరు. టిక్కా, బర్గర్లు, స్పీట్లల్ల కూడా దీన్ని వాడుతరు. ప్రోటీన్, కాల్షియం, భాస్వరం, విటమిన్ ఎ,డి లు గీ పన్నీర్ల మస్తుగుంటయి.

అయితే, గీ మద్దెల నకిలీ పన్నీర్ను బాగా తయారు సేస్తాండ్లు. యూరియా, బిటుమెన్ కలర్, డిటర్జెంట్, సుసెలెరిక్ యాసిడ్ రసాయనాలను, పాలకు బదుల్ గా మైదా పిండిని ఆడుతాండ్లు. గీ నకిలీని తింటే పానం తీసే రోగాలొత్తానయి.
మరి గీ పన్నీర్ల అసల్, నకిలీని ఎట్ల గుర్తు పట్టాలె? పన్నీర్ ముక్కను తీసుకోవాలె. గదాన్ని ఓ శిన్న గిన్నెలేసి, గండ్ల గది మునిటేట్లు యేడి నీల్లు పోయాలె. కొద్దిసేపైనంక గది శిన్న శిన్న ముక్కలుగ ఇరిగిపోయి, కరిగిపోతే గది నకిలీది. ఇరిగిపోకుండ, మెత్తగ ఉంటే గది అసల్ ది అన్నట్లు!

