Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

తెలంగాణలో మొదలైన ‘పంచాయితీ’!?|EDITORIAL

పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పంచాయతీ ఎన్నికలే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఇందిరమ్మ చీరల పంపిణీని మొదలు పెట్టింది. మంగళవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 3.5లక్షల మంది మహిళలకు రూ.300.4 కోట్ల వడ్డీరహిత రుణాలిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు ప్రగతిలో ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం బాగానే ప్రిపేర్ అయింది.
కానీ, బీసీ రిజర్వేషన్లనే వెనక్కి నెట్టేసింది. బీసీలకు రిజర్వేషన్లు సాధించి తీరుతామని ఊదరగొట్టి, చివరకు పార్టీ పరంగా 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల హామీని కాంగ్రెస్‌ ఇచ్చింది. దాని అమలు పేరుతో నానా ఫీట్లు చేసి, చివరకు కోర్టుల్లో ఫట్ మనిపించింది. నెపం కేంద్రం మీద, బీజేపీ, బీఆర్ఎస్ ల మీదకు నెట్టారు. రిజర్వేషన్లపై 50శాతం సీలింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయినా, సాధించేస్తామని బీరాలు పలికి, లాయర్ల ఫీజుల కింద కోట్లు తగలేశారు. ఫైనాన్స్ కమిషన్ నిధులు వెనక్కి వెళ్ళకుండా అన్న సాకుతో ఎన్నికలకు సిద్ధ పడింది. బీసీ రిజర్వేషన్ల పేరిట నానా హంగామా చేసి, మళ్లీ పాతపద్ధతిలోనే పంచాయతీ ఎన్నికలకు సిద్ధమయ్యారు.
‘1948 చట్టం’ ప్రకారం జన,కులగణన చేపట్టే అధికారం కేంద్రానికి మాత్రమే ఉన్నది. రాష్ట్రాలకు లేదు. ఒకవేళ చేసినా ఆ గణాంకాలకు చట్టబద్ధత ఉండదు. అమలు చేసే అవకాశం లేదు. పైగా కేంద్ర ప్రభుత్వమే ‘గణాంకాల సేకరణ చట్టం-2008’ ద్వారా రాష్ట్రాలకు డాటా సేకరణకు పరిమిత అధికారాలను బదలాయించింది. ఒకవేళ జన, కుల గణనను రాష్ట్రం నిర్వహించాలని భావించినా, అందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అంతేకాదు, సేకరించిన డాటా వెల్లడిపై కూడా అనేక ఆంక్షలు ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఇంటింటి సర్వే పేరుతో జన, కుల గణన చేశామని అందరినీ మభ్యపెట్టిందనేది విపక్షాల ఆరోపణలు. కుల గణనకు కేంద్రం పూనుకోవడంతో అదీ తమ ఘనతేనని చెప్పు కున్నది. కేంద్రం మెడలు వంచామని బుకాయించారు.

ఇక పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌, వార్డుల రిజర్వేషన్ల ఖరారులో గందరగోళం నెలకొంది. సర్కారు మార్గదర్శ కాలకు విరుద్ధంగా జిల్లాల్లో అధికారులు రిజర్వేషన్లను ఇష్టారీతిన ఖరారు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ప్రభుత్వం జీవో 46ను విడుదల చేసింది. తదనుగుణంగా సర్పంచ్‌ స్థానాలకు ఆర్డీవోలు, వార్డు మెంబర్ల స్థానాలకు ఎంపీడీవోలు రిజర్వేషన్లను ఖరారు చేశారు. జనాభా దామాషా ప్రకారం తొలుత ఎస్టీ, ఎస్సీ, బీసీ, తదుపరి మహిళా స్థానాలను ఖరారు చేశారు. గ్రామం, మండలం, జిల్లా, ఆపై రాష్ట్రం యూనిట్‌గా నిర్దేశిత కోటా ప్రకారం స్థానాలను రిజర్వ్‌ చేశారు.

ఇదిలాఉంటే వార్డు సభ్యుల స్థానాలకు ఇంటింటి సర్వే 2024 లెక్కలను, సర్పంచ్‌ స్థానాలకు 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. బీసీ రిజర్వేషన్లకు ఇంటింటి సర్వే 2024 లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం వివాదంగా మారింది. రిజర్వేషన్లలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతున్నదని బీసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బీసీ కోటాను తగ్గించి జనరల్‌ కోటను పెంచారని బీసీ సంఘాలు చెప్తున్నాయి. రొటేషన్‌ ముసుగులో బీసీలకు రావాల్సిన సర్పంచ్‌ స్థానాలను అగ్రకులాలకు కట్టబెడుతున్నారని మండిపడుతున్నాయి.

ఇప్పటికైనా బీసీ సంఘాల ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రిజర్వేషన్ల అమలు, ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా జరగాలి.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News