Wednesday, June 24, 2026
25.2 C
Hyderabad

మాసిపోయె బండికి పురుగుల మందు మెరుపులు!|ADUGU TRENDS

యేలకు యేలు పెట్టి, బండ్లు కొంటం. కొత్త మురిపెంల బండి మీద ఈగ వాలనియ్యం. ఎవ్వనికన్న ఇయ్యమన్నా ఇయ్యం. కాళ్ళు సెప్పులు గూడా కడుక్కొనె ఎక్కుతం. గంతేనా, అద్దం లెక్క మెరిపిస్తం. ఇగ రోజులు పోతాంటే. గా బండిని కడగం, తుడవం మానెస్తం. గత దుమ్ము దుమ్మైతది. తుడిసినట్లు సేస్తే సేస్తం లేకపోతే లేదు. కడిగినా కాసిన్న నీళ్లు బండి ముకాన కొడతం. అది ఎట్లుంటే గట్ల అని సర్దుకు పోతం. కానీ, ఇప్పుడీ బండ్లు కడుక్కోనీకే ఒకడు మంచి ఇకమతు కనిపెట్టిండు.
గదేందంటె దుమ్ము పట్టిన బండికి దోస్తాన్ల మనం తాగే పురుగుల మందు గదే గా తమ్సప్ సీస తీసుకోవాలె. అండ్ల మనం పండ్లు తోముకొనే పేస్టు నేసి కలపాలే.. బాగ గిలకొట్టాలె. దాన్ని బండికి రుద్ది, నీళ్ళతో లేదంటే గదె తమ్సప్ తో కడగాలే గంతే… ఇగ సూసుక్కో. గా బండి సిన్మాలల్ల ఈరోయిన్ మెరిసినట్లు నిగ నిగ లాడుతదట. గీ ఇకమతు తోటి గా బండి, కొత్తదాని లెక్క మెరుస్తదన్నట్టు. మంచిగున్నది గదా? ఇగ మీరు గూడా గీ దీన్ని పాలో అయి చూడుండ్లి.

Latest News

సిమిటి మాల్ కు శిన్న శిట్కా?!|ADUGU TRENDS

శిన్న శిన్న ఇకమతులే పెద్ద పెద్ద పనుల్ల శెమను తగ్గిస్తయి. అల్కగ అయ్యేట్లు శేత్తయి. గట్లనే ఇగో గీ ఉపాయమన్నట్లు. సిమిటి మాల్ కు ఓ శిన్న శిట్కాను కనిపెట్టిండు. గా పనిల...

ఎల్‌నినో హెచ్చరికలు : అప్రమత్తతలు|EDITORIAL

వాతావరణ మార్పులు భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే అవకాశముందని ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అనిశ్చిత వర్షపాతం, తీవ్రమైన వాతావరణ ఘటనలు వ్యవసాయ రంగానికే కాదు, మానవ మనుగడకే కొత్త సవాళ్లను...

జూన్ 23, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు నవమి రాత్రి 07.28 వరకు ఉపరి దశమి నక్షత్రం హస్త మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి చిత్త యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.02 వరకు ఉపరి పరిఘ కరణం బాలవ ఉదయం 07.26...

జూన్ 22, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు అష్టమి రాత్రి 07.26 వరకు ఉపరి నవమి నక్షత్రం ఉత్తర మధ్యాహ్నం 02.37 వరకు ఉపరి హస్త యోగం వ్యతీపాత మధ్యాహ్నం 03.02 వరకు ఉపరి వరీయాన్ కరణం భద్ర ఉదయం 07.41...

‘తెలంగాణ జన’సేన అయ్యేనా?!|TELANGANA|JANASENA|PSPK

-ఏపీ తరహాలో స్వతంత్రంగా ఎదిగేనా?|AP -బీజేపీకి తోక పార్టీగా మిగిలేనా?|BJP -జన సేనతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?|JANASENA తెలంగాణ జనసేన అయ్యేనా?! తెలంగాణ జనం జన సేనను ఆదరించేనా? తెలంగాణలో జనసేన సక్సెస్ అయ్యేనా? సాధారణంగా...

సిమిటి, అస్తర్కార్ లేకుండనే గోడలు?!|ADUGU TRENDS

ఇల్లు కట్టి సూడు, పెండ్లి శేసి సూడన్నరు. గయి రెండంటే గంత కట్టమన్నట్లు.? పెండ్లంటే గిప్పట్ల సిడెంల అయిపోతానయి గనీ, గీ ఇండ్లంటేనే గవాటి టైం గయి తీసుకుంటయి. మట్టి, సిమెంటు, ఇటికె,...

సంపూర్ణ ఆరోగ్యానికి మార్గం యోగా!|EDITORIAL

ఆధునిక వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ చికిత్స కంటే, నివారణే ఉత్తమమనే సత్యం ఎప్పటికీ మారదు. యోగా అదే నివారణ వైద్యానికి ప్రతీక. మన పురాతన జ్ఞాన సంపదగా ప్రారంభమైన యోగా నేడు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 21 నుండి జూన్ 28 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టిన పనుల్లో క్రమంగా పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం వల్ల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు సులభంగా...

జెర పెండ్లి శేసుకోరా…?!|ADUGU TRENDS

పెండ్లిల్లు సర్గంల అయితయి అని ఎందుకన్నరో గనీ, గీ భూమ్మీద మాత్రం లేటైతానయి. బహు కట్టమైతానయి. ఎవర్నడుగు దుర్బిణి యేసి సూసినా, ఆడి పిల్లలు అసలే దొరుకుతలేరంటాండ్రు. మన దగ్గర గిట్లుంటే, మరి...

సమగ్ర పంటల విధానమే రైతుకు రక్ష!|EDITORIAL

వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కొనుగోళ్ల విస్తరణలో లేదు. శాస్త్రీయ పంటల ప్రణాళికలో మాత్రమే ఉంది. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయడం సాధ్యంకాదు. కానీ రైతులు మార్కెట్‌కు అవసరమైన...

జూన్ 20, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు షష్ఠి రాత్రి 10.13 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మఖ మధ్యాహ్నం 02.48 వరకు ఉపరి పుబ్బ యోగం వజ్ర సాయంత్రం 06.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ ఉదయం 09.34...

ఎక్కువ కాలం ఎవలు బత్కుతరు?!|ADUGU TRENDS

పుట్టిన పతి ప్రాణీ గిట్టక మానది. గట్లనే ఒక్కో జీవికి ఒక్కో ఆయుర్ధాయం ఉంటది. జెల్లీ ఫిష్ కి ఏకంగా అమరత్వమే ఉందంట. గిది వయసైపోయినంక, మళ్ళీ శైశవ దశకు చేరుకుని జీవితాన్ని...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News