Tuesday, September 22, 2026
31.7 C
Hyderabad

రంకు – బొంకు!

భారత్ లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఉగ్రవాద గ్రూపులను రెచ్చగొట్టడం వంటి అంశాలను పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అంగీకరించారు. ఒక ఇంటర్వ్యూలో ఇలా స్పందించారు.
“మీరు ఒప్పుకుంటారా, పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం, నిధులు సమకూర్చడం వంటి చరిత్రను చాలా కాలంగా కలిగి ఉందని?”
“అవును, మేము మూడు దశాబ్దాలుగా యునైటెడ్ స్టేట్స్ కోసం ఈ నీచమైన పని చేస్తున్నాం. మీకు తెలుసా? పశ్చిమ దేశాలకు. బ్రిటన్ తో సహా.”
“సరే, అదేనా మీ వాదన?”

అతను వెంటనే తనను తాను సరిదిద్దుకుని, “అది పొరపాటు. మేము దాని కోసం బాధపడ్డాం. అందుకే మీరు నాతో ఇలా చెబుతున్నారు.” అని బుకాయించారు.
‘‘రంకునేర్చినమ్మ బొంక నేర్చింద’’ని, భారత్‌లో ఉగ్రదాడులు జరిగినప్పుడల్లా పాక్‌ ఇలా బుకాయిస్తూనే ఉంది. ముంబై ఉగ్రదాడుల సమయంలోనూ ఇదే చెప్పింది. అజ్మల్‌ కసబ్‌ గురించి చెప్పినా కసబ్‌ మా దేశస్థుడే కాదని బొంకింది. కసబ్‌ పుట్టు పూర్వోత్తరాలు బయటపడ్డాక కూడా నిస్సిగ్గుగా అదే పాట పాడింది. ఇప్పడు కూడా అదే తొండి కూత కూస్తోంది. మరి ఢిల్లీలోని పాక్‌ రాయబారి కార్యాలయంలో కేక్‌ సంబరాలపై మాత్రం తెల్లమొహం వేస్తోంది. టెర్రరిస్టులకి ‘పాక్’ మద్దతిస్తుందన్న దానికి ఈ ‘కేక్’ రుజువుగా మారి, ‘హాట్ కేక్’ అయిపోయింది. పాకిస్థాన్‌ దౌత్యవేత్త సాద్‌ అహ్మద్‌ వరైచ్‌ను పిలిపించి ‘పర్సోనా నాన్‌ గ్రాటా’ (అయిష్టమైన వ్యక్తులుగా పేర్కొనే) అధికారిక నోటీసులు అందించింది. ఈ నోటీసుల ప్రకారం వారు వారం రోజుల్లోగా భారత్‌ను వీడాల్సి ఉంటుంది. ఇదిలావుండగా బలూచిస్థాన్‌ ఘటనలను భారత్‌కు అంటగట్టే ప్రయత్నం చేసి తన లాలూచీని బయటపెట్టుకుంది. మనం టెర్రరిస్టుల జాబితాని సమర్పించినా, వారు పాక్‌లో వున్నారని అడ్రసులిచ్చినా అప్పగించడం లేదు. సరికదా, హఫీజ్‌ సయీద్‌ లాంటి ఉగ్రవాదులను దాచిపెడుతోంది. పైగా వారిని పాముల మాదిరి పాలుపోసి పెంచుతోంది.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌ నేతల ప్రకటనలు ఉగ్రవాదులకు ఊతమిస్తున్నాయి. మనకు రోత పుట్టిస్తున్నాయి. పహల్గాం టెర్రరిస్ట్‌ దాడితో మాకు సంబంధం లేదని సుద్దపూసలా దాడిని ఖండించింది. కానీ పాక్‌ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాక్ దార్ వ్యాఖ్యలతో వారి నిజస్వరూపం బట్టబయలైంది. 28 మంది అమాయక ప్రజలను అత్యంత కిరాతకంగా ఊచకోత కోసిన నరరూప రాక్షసులను స్వాతంత్య సమరయోధులతో పోల్చాడు. ఆయన వ్యాఖ్యలతో పాక్‌ డొల్లతనం ప్రపంచదేశాల ముందు మరోసారి తేటతెల్లమైంది. భారత్‌ సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై కూడా తిక్కతిక్కగా మాట్లాడాడు. ‘పాకిస్తాన్‌లో 240 మిలియన్ల మందికి సింధు నది నీరు అవసరం. మీరు ఆ ఒప్పందాన్ని ఆపలేరు. ఒకవేళ ఇండస్‌ ట్రీటీ- రద్దు చేస్తే అది యుద్ధ చర్యకు సమాన’మని బీరాలు పలికాడు. ఆ దేశం కూడా అదే విధమైన ప్రతిచర్యను ఎదుర్కొంటుందని అంటే మనమీద యుద్ధం చేస్తామని హెచ్చరించాడు. ఇషాక్ దార్ మాటలపై భారత ప్రజలు భగ్గుమంటున్నారు. ఇదే పాక్‌ నిజస్వరూపమని, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందనడానికి ఇంతకన్నా ఇదే నిదర్శనమని దుమ్మెత్తిపోస్తున్నారు. చివరకు పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా దార్ మాటలని పిచ్చి ప్రేలాపనలుగా కొట్టి పారేశాడు. పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్లుగా ఒప్పుకున్నట్లయిందని, ఉగ్రవాదంతో పాక్ ప్రజలు బాధపడుతున్నారని అన్నాడు. పహల్గాం ఉగ్రదాడిపై పాక్ ప్రధాని మాట్లాడాలని డిమాండ్ చేశాడు.

కాశ్మీర్‌లోని బైసరన్‌ లోయలో జరిగిన ఈ దాడి వెనక లష్కరే తయ్యబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ హస్తం ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. సయీద్‌తో పాటు అతడి ముఖ్య అనుచరుడు సైఫుల్లా ఉగ్రమూకలను అమాయకుల మీదకు ఊసిగొల్పారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఎల్‌ఈటీకి అనుబంధంగా ఉన్న కరుడుగట్టిక ఉగ్రవాదుల బృందం బైసరన్‌లో నిర్దాక్షిణ్యంగా 26మంది అమాయకులను మట్టుపెట్టింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఈ బృందంలో ప్రధానంగా విదేశీ ఉగ్రవాదులు ఉంటారు. వీరికి స్థానిక మిలిటెంట్లతోపాటు కాశ్మీర్‌లో మరికొందరు సహకరించినట్లు అనుమానాలు బలపడుతున్నాయి. పాక్‌ ప్రభుత్వ మద్దతుతో హఫీజ్‌ సయీద్‌, అతడి ముఖ్య అనుచరులు ఈ ఉగ్రమూకలకు నేరుగా సహాయపడి ఉండొచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అయితే పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భారత దళాలు జమ్మూ కాశ్మీర్‌ను జల్లెడ పడుతున్నాయి.

మరోవైపు పాక్ పై భారత్ ముప్పేట కట్టడి చేస్తున్నది. అంతర్గతంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సైన్యాన్ని అప్రమత్తం చేసింది. అయితే, పహల్గాంకు ప్రతీకారం తీర్చుకోవడంపైనే భారత ప్రజలు చర్చిస్తున్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడం, పాక్ తో వైరాన్ని శాశ్వతంగా పరిష్కరించడం, యుద్ధం వస్తే ఎలా? పాక్ ను పూర్తిగా నిలువరించడానికి వ్యూహాలేంటి? అన్న అంశాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.
పహల్గాం సంఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. అన్నింటికి అతీతంగా, దేశంలో మరోసారి దేశ భక్తిని రగిల్చింది. దేశం మొత్తం మరణించిన వారికి నివాళులర్పిస్తున్నది. ఐక్యంగా పాకిస్థాన్ ను ఎదుర్కోవడంపై చర్చిస్తున్నది. ప్రపంచ దేశాల ముందు క్రమేనా పాక్ రంగుతేలి ఒంటరి అవుతున్నది. ఇక భారత ప్రభుత్వంపైనే అంతా ఆధారపడి ఉంది.

Latest News

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News