Tuesday, September 22, 2026
27.2 C
Hyderabad

బిజెపి బిగ్ బాస్ గా ఈటల?!

పార్టీ బలోపేతానికే బలమైన బీసీ నేత ఎంపిక
ఈ నెల 10వ తేదీలోపే వెలువడనున్న ప్రకటన

అవును. బిజెపి స్టేట్ బాస్ గా ఈటెల రాబోతున్నారు. ప్రత్యర్థులకు దీటుగా పార్టీ బలోపేతానికి బలమైన బీసీ నేతను బరిలోకి దింపుతోంది బిజెపి. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 10వ తేదీలోగానే ఈటల నియామక ప్రకటన వెలువరించేందుకు బిజెపి రెడీ అవుతోంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి పురంధేశ్వరి నియామకం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

దేశంలో సంకీర్ణ అధికారంలో ఉన్న బిజెపి సొంత బలం కోసం పాకులాడుతోంది. అధికారం ముఖం చూడని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. దేశంలో, రాష్ట్రాల్లో నిరపేక్ష పవర్ కోసం పవర్ ఫుల్ ప్లాన్స్ వేస్తోంది. ఇందుకు దేశ వ్యాప్తంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని సానుకూలంగా మలచుకుంటోంది. బలమైన నేతలను బరిలోకి దించి బాధ్యతలు అప్పగించనుంది. ఇందులో భాగంగానే తెలంగాణలో బలహీన వర్గాలకు చెందిన బలమైన నేత ఈటల రాజేందర్ కు బిజెపి పగ్గాలు అప్పగించాలని నిర్ణయించింది.

గడిచిన ఎన్నికల నేపథ్యం, సమీప భవిష్యత్తు ఎన్నికల బేరీజులో బిజెపి తలమునకలైంది. సంప్రదాయ పార్టీగా పేరున్న బిజెపి, ఏనాడో ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టింది. ఫక్తు రాజకీయ పార్టీల తరహాలో అనేక పార్టీల నేతల్ని చేర్చుకుంది. చేర్చుకుంటూనే ఉంది. పద్ధతులను పక్కనపెట్టి పవర్ పాలిటిక్స్ చేస్తున్నది. పవరే పరమావధిగా ఇప్పుడు పార్టీ దేశ, రాష్ట్రాల శాఖలకి సామాజీక సమీకరణాలతో సమర్థులైన నేతలను ఎంపిక చేస్తున్నది. ఇప్పటికే తన వారసత్వ సంప్రదాయాన్ని పక్కన పెట్టి, కాంగ్రెస్ కర్ణాటక దళిత వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గేకు పార్టీ పగ్గాలు అప్పగించిన విధంగానే, బిజెపి, అదే కర్ణాటకకు చెందిన దళిత వర్గ నేతకు జాతీయ పార్టీ పగ్గాలను అందించనుంది. ఇదే కోవలో తెలంగాణ పిసిసి పగ్గాలను కాంగ్రెస్ బీసీ సామాజిక వర్గానికి అందించిన విధంగానే ఓ బలమైన బీసీ వర్గానికి చెందిన బలమైన నేత ఈటల రాజేందర్ కు అప్పగించాలని నిర్ణయించింది. నిజానికి తెలంగాణ బిజెపి అధ్యక్ష బాధ్యతల విషయంలో అంతర్గతంగా విభేదాలతోపాటు పోటీ ఏర్పడింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు రెండు వర్గాలుగా ఒక వర్గం బండి సంజయ్ ని మరోసారి ప్రతిపాదించింది. గతంలో బండి సంజయ్‌ హయాంలో బీజేపీ క్షేత్రస్థాయిలో మంచి విజయాన్ని సాధించింది. బండి సంజయ్ కార్యకర్తల్లో మంచి జోష్ నింపి, పార్టీని బలోపేతం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం బండికే మద్దతు పలికారు. తన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన ఈటలతో విభేదించినప్పటికీ, కేంద్ర మంత్రిగా, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సంజయ్, ఈసారి ససేమిరా అన్నారు. దీంతో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుని తెరమీదకు తెచ్చారు. ఇంకోవైపు ఈటలకు మరోవర్గం మద్దతుగా నిలిచింది. పోటీలో ఉన్నప్పటికీ తమకు కానట్లైతే, ఈటల కోసం నిలబడడానికి ఎంపీలు ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు వంటి వారు అంగీకరించారు. కాగా బండి సంజయ్ ఈటలకు మద్దతు పలికారని తెలిసింది. రాష్ట్రంలోని రాజకీయ సామాజిక పరిస్థితుల నేపథ్యంలో మెరుగైన బీసీ నేతకే జాతీయ నాయకత్వం మొగ్గు చూపింది.

ఇదిలావుండగా, ఒక బలమైన బీసీ నేత కోసం చూస్తున్న కేంద్ర నాయకత్వానికి సామాజికంగా, ఆర్థికంగా, సమర్థుడైన ఈటల సరిపోతాడని భావించినట్లు తెలుస్తోంది. కేశవ మెమోరియల్ స్కూల్ లో చదువుకున్న ఈటల, తర్వాత వామపక్ష భావజాలంతో పని చేసినప్పటికీ, రాజకీయ పరమపద క్రీడలో 2021లో బిజెపిలో చేరారు. 2003 నుంచి బిఆర్ఎస్ (టిఆర్ఎస్)లో చేరి, ఉద్యమాల్లో పాల్గొంటూ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2 సార్లు మంత్రిగా పని చేశారు. తాజాగా మల్కాజీగిరి ఎంపీగా ఉన్నారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా పని చేశారు.

అయితే ఆయన వామపక్ష ఉద్యమ, సుదీర్ఘ తెలంగాణ ఉద్యమ నేపథ్యం, రాజకీయ అనుభవం పార్టీకి ఉపయోగపడుతుందని బిజెపి జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ క్యాడర్ తో ఉన్న అనుబంధం అనుకూలిస్తుందని, అతని బలమైన సమాజిక వర్గం సానుకూలిస్తుందని, వచ్చే స్థానిక సంస్థలు, జీ,హెచ్.ఎం.సి ఎన్నికల్లో పవర్ ప్రతిఫలిస్తుందని బిజెపి తలపోస్తోంది.

Latest News

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News