Tuesday, September 22, 2026
30.2 C
Hyderabad

పార్లమెంట్‌ పరిధిలో బిజెపి కారణంగానే ఉద్రిక్తత: ఖర్గే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ…..

పార్లమెంట్ పరిధిలో జరిగిన ఘటనపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ, “పార్లమెంట్ లోకి వెళ్లనివ్వకుండా మకర ద్వారం వద్ద బీజేపీ ఎంపీలు మాపై దాడి చేశారు. మమ్మల్ని తోసేయడంతో అదుపు తప్పి కూర్చుండిపోయాను. నా కాలికి గాయమైంది. ఇది ప్రజాస్వామ్యానికి అపచారం,” అని అన్నారు.

అలాగే “ప్రజా సమస్యల కోసం పోరాడే మాకు ఇలాంటి అడ్డంకులు రావడం దురదృష్టకరం. పార్లమెంట్‌లో మమ్మల్ని అడ్డుకోవడం పట్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం. బీజేపీ అప్రజాస్వామిక చర్యలు ప్రజల ముందుకు తీసుకెళ్లి, వారి అసలైన ధోరణిని వెలుగులోకి తీసుకొస్తాం” అని చెప్పారు.

రాహుల్ గాంధీ మాట్లాడుతూ…..

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ ఘటనపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ…., “అదాని గ్రూప్ అవినీతిపై పార్లమెంట్‌లో చర్చ జరగకుండా బీజేపీ మొదటి నుంచి ప్రయత్నిస్తోంది. మకర ద్వారంలో బీజేపీ ఎంపీలు మమ్మల్ని అడ్డుకోవడం కూడా ఆ ప్రయత్నాల్లో భాగమే,” అని అన్నారు.

అలాగే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆలోచనలను రాజ్యాంగ వ్యతిరేకమంటూ విమర్శించారు. “బీజేపీ రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్‌కి వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఆయనను అవమానించినందుకు బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలి. అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలి,” అని డిమాండ్ చేశారు.

ఆదానీ అవినీతి అంశంపై “దేశాన్ని ప్రధాని మోడీ అదానీకి అమ్మేస్తున్నారు. ఇది ప్రధానమైన సమస్య. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగకూడదని బీజేపీ కోరుకుంటోంది. ప్రజలు ఈ మోసాన్ని అర్థం చేసుకోవాలి,” అని రాహుల్ గాంధీ అన్నారు.

విపక్షాల ఆందోళన

కాంగ్రెస్ నేతల విమర్శలతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ఘటనపై మండిపడుతున్నాయి. పార్లమెంట్‌ పరిధిలో దాడులు జరగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని వారు ప్రకటించారు.

రాజకీయ ఉద్రిక్తతలు

ఈ ఘటన దేశ రాజకీయాల్లో ఉత్కంఠను పెంచింది. బీజేపీ ఎంపీల చర్యలపై నెటిజన్లు, సామాజిక ఉద్యమకారులు కూడా స్పందిస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను తిరస్కరించింది. అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్‌ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

మొత్తానికి, ఈ పరిణామం దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యంపై చర్చను మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది.

Latest News

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News