Friday, August 7, 2026
30.7 C
Hyderabad

ఇగిప్పుడు ‘సావు’కొచ్చింది!?|ADUGU TRENDS

మన ఊర్లల్ల ఎవ్వలన్న కాలం శేసిండ్రంటేనే సూసొత్తం. కనికరం సూపి తలో సెయ్యేత్తం. దిక్కూమొక్కూలేనోల్లతై మనమే తలా ఇంతేసుకుని గాయింత ఇగ గా కట్టెల్లేసొత్తం. కానీ, తలకొరివి పెట్టాల్సిన కన్న బిడ్డలే కడసారి సూపుకు కూడా రాకపోతే? అంత్యక్రియలు అనాథలకు శేసినట్లు శేయవల్సివత్తే?

గీ మద్దెల మనసులు మాట్లాడ్తలేరు పైసలే మాట్లాడ్తానయి. గా కన్నోల్లు జీవితమంగా కనా కట్టాలు పడి కూడ బెడ్తాండ్రు. పుట్టినోల్లేమో గవాటి కోసం తల్లితండ్రులను కాదని కొట్టుక సత్తాండ్రు. శవాలను ఆడబెట్టి ఆస్తిపాస్తులు పంచుకుంటాండ్రు. నా వాటా కిప్పుడిత్తేనే కొరివి పెడ్తాననే కొడుకొకడు. బతికుండంగనే సంపే కొడుకింకొకడు. ఇగిప్పుడు గా కొడుకులకు బిడ్డలు గూడా తోడైండ్రు.

హరియాణా పానీపట్ ల ఓ అయ్య పోయిండు. గాయినె పిల్లలు జెల్లలు యేడ్నో గా దూరపు దేశంల సంపాయించుకోవడాన్కి పోయిండ్రు. ఒంటకూర గాయిన్ని, సూసుకుంటోల్లు లేక ఓ అనాథల ఆశ్రమంలేసిండ్రు. గాయింత గాయినె కాలం శేసిండు. గా శవాన్ని తగుల బెట్టాల్నాయె. గా బిడ్డలకు శెప్పినా, ఎవ్వలూ రాలే, ఇగాకరికి గా ఆశ్రయమోల్లే అంతిమక్రియలు శేసిండ్లు. ఇగ గిదీన్ని గా బిడ్డలు ఈడియల సూసిండ్రు. అడ్డాలనాడే గనీ, గడ్డాల నాడు కాదన్నరు. ఎవని పిండం? ఎవని గండం? గీ మద్దెల గిదే ట్రెండైతాంది మరి. గిది సదివినోల్లైనా కాస గిట్ల శేయకుండ్రి. తల్లిదండ్రుల గోస పెట్టకుండ్రి.

Latest News

శ్రద్ధేది? శుద్ధ దండగ!?|EDITORIAL

2025 వర్షాకాల సమావేశాల్లో నిర్ణయించిన సమయంలో లోక్‌సభ కేవలం 29%, రాజ్యసభ 34% మాత్రమే పనిచేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభలో కేవలం 23%, రాజ్యసభలో 6% మాత్రమే పని జరిగింది. అదే సమావేశాల్లో14...

ఆగస్టు 07, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి నవమి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి దశమి నక్షత్రం కృత్తిక సాయంత్రం 04.48 వరకు ఉపరి రోహిణీ యోగం వృద్ధి ఉదయం 11.17 వరకు ఉపరి ధ్రువ కరణం గరజి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి...

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

సంయమనం కోల్పోతే రాజకీయ సంక్షోభమే!?|EDITORIAL

వ్యక్తిగత విమర్శలు తాత్కాలిక రాజకీయ ప్రచారానికి ఉపయోగపడవచ్చు. కానీ, దీర్ఘకాలంలో నాయకుడి విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. రాజకీయ వారసత్వం కేవలం కుటుంబ నేపథ్యంతోనే రాదు, హుందాతనంతో కూడిన నాయకత్వంతోనే నిలుస్తుంది. మాటలతో సంపాదించేది ప్రచారం...

ఆగస్టు 06, గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి మధ్యాహ్నం 03.39 వరకు ఉపరి నవమి నక్షత్రం భరణి సాయంత్రం 06.11 వరకు ఉపరి కృత్తిక యోగం గండ మధ్యాహ్నం 02.03 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 03.39వరకు ఉపరి తైతుల రాహుకాలం...

తింటే గీ అవ్వ శేతి గారెలే తినాలె!?|ADUGU TRENDS

ఎన్కటికి... యింటే భారతమే యినాలె... తింటే గారెలే తినాలన్నరు. కనీ, ఇగిప్పుడైతే, తింటే గింటే గీ అవ్వ శేతి గారెలే తినాల్నని తిన్నోల్లంటాండ్రు. మరి, గా గారెల ముచ్చటేందో సూద్దాం పదండ్రి. ములుగు జిల్ల...

బీజేపీ-ఆత్మపరిశీలనకు సరైన సమయం! EDITORIAL

ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ఒక సందేశం! ప్రతి ఉప ఎన్నిక ఒక హెచ్చరిక!! ప్రతి ప్రజా ఉద్యమం పాలకుల పాలనకు అద్దం. ఇప్పటిదాకా అప్రతిహతంగా అధికారం చెలాయిస్తున్న బీజేపీ అనూహ్యంగా ఈ మూడింటినీ...

ఆగస్టు 05 బుధవారం 2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు , ఆషాఢ మాసము-కృష్ణపక్షం తిథి కృష్ణ-సప్తమి ఈ రోజు (05) రాత్రి 8:42 వరకు, తదుపరి కృష్ణ-అష్టమి నక్షత్రము అశ్విని ఈ రోజు (05) రాత్రి 9:18 వరకు,...

ఇగ పోను అన్ లాక్ శేసుడు అల్కన!!?|ADUGU TRENDS

ఇగో గిప్పుడు గా పోన్ల వాడుడు అందరికీ అల్కగైపోయింది. సంటి పోరగాండ్ల కానుంచి, పండు ముసలోల్ల దాకా పోను వాడుతనే ఉన్నరు. ఇగ గీ వాడుట్ల అప్పుడప్పుడు గా పోన్ల లాకుల నెంబర్ల...

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News