Monday, September 21, 2026
28.1 C
Hyderabad

రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి|KTR|REVANTH REDDY

సీఎం ఛార్జ్‌షీట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

TELANGANA|తెలంగాణ CM|ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు NATIONAL HERALD|నేషనల్ హెరాల్డ్ చార్జ్‌షీట్‌లో ఉండటం రాష్ట్ర ప్రజలకు అవమానకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నైతికత, నిజాయితీ ఉంటే రేవంత్ స్వయంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ హైకమాండ్ ఆయన్ని పదవి నుంచి తప్పించాల్సిందిగా కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో ఓటుకు నోటు కేసులో బాగ్‌మేన్‌గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ రూట్ స్కామ్‌లో కీలకపాత్ర పోషించారని, ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎంగా వాడుతున్న దానికి నిదర్శనమని విమర్శించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు ఈడీ చార్జ్‌షీట్‌తో నిజమని రుజువైందని తెలిపారు. ఎవరెవరికి డబ్బులు ఇచ్చారో, ఏ పదవుల కోసం ఇచ్చారో, ఎన్ని మొత్తాల్లో పంపారో ఈడీ స్పష్టంగా వెల్లడించిందన్నారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|

తెలంగాణ సీఎం పదవిని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్‌కు ముడుపులు పంపుతున్నారని, 17 నెలల్లో 44 సార్లు ఢిల్లీకి వెళ్లడం ద్వారా అరుదైన రికార్డు నెలకొల్పారని ఎద్దేవా చేశారు. అమిత్ షా కాళ్లు పట్టుకుంటూ కేసుల నుంచి తప్పించుకోవాలని వేడుకుంటారని, బయటకి వచ్చాక పెద్ద ఫోజులు కొడతారని విమర్శించారు. లక్షా ఎనభై వేల కోట్ల అప్పు చేసి ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదని, ఒక్క హామీ నెరవేర్చలేదని పేర్కొన్నారు. తెలంగాణ సంపదను దోచుకుని ఢిల్లీకి పంపే రాజకీయ కమిషనర్‌గా పనిచేస్తున్నారని ఆరోపించారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|

రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశం చుట్టేస్తున్నా, తన పార్టీ సీఎం అవినీతిపై మాట్లాడడం లేదన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీల పేర్లను చార్జ్‌షీట్‌లో చేర్చినప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు స్పందించగా, రేవంత్ మాత్రం జపాన్ పర్యటన పేరుతో తప్పించుకోవడం అనుమానాస్పదమన్నారు. మౌనం వీడని కారణం తనపేరూ చార్జ్‌షీట్‌లో వచ్చే అవకాశం ఉందన్న భయమేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|

తెలంగాణ బీజేపీ నేతలు కూడా రేవంత్ అవినీతిపై మౌనంగా ఉండటం, కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న కుమ్మక్కునకు నిదర్శనమన్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్‌పై బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తుంటే, అదే కేసులో ఉన్న రేవంత్‌పై మాత్రం తెలంగాణ బీజేపీ నేతలు మౌనం వహించడం పాక్షికతకు ఉదాహరణగా పేర్కొన్నారు. పోంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు జరిగి ఏడాది అయినా ఇప్పటివరకు ఒక్క ప్రకటన కూడా బయటకు రాలేదని, 45 కోట్లు వాల్మీకి స్కామ్ ద్వారా తెలంగాణకు వచ్చాయని రిమాండ్ డైరీలోనే ఈడీ పేర్కొన్నదని గుర్తు చేశారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|

సివిల్ సప్లై స్కామ్‌పై తమ వద్ద ఆధారాలతో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. అమృత్ కుంభకోణంలో రేవంత్ బావమరిది శోధా కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అర్హత లేకుండా రూ.1137 కోట్ల టెండర్లు అప్పగించారని పేర్కొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో కేంద్ర ఎంపవర్ కమిటీ నివేదిక ఇచ్చినా కేంద్రం చర్యలు తీసుకోలేదని, ఇది బీజేపీ, కాంగ్రెస్ మధ్య అవినీతి ఒప్పందాలకు ఉదాహరణ అన్నారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ఎలాంటి అవినీతి జరగలేదని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం మంత్రులే బహిరంగంగా 30 శాతం కమిషన్ అడుగుతున్నారన్న ఆరోపణలు వెలువడుతున్నాయని, ఇది రేవంత్ ప్రభుత్వానికి గుణపాఠమని అన్నారు. సీఎం‌కు పిల్లనిచ్చిన ఆయన మామే కాళేశ్వరంపై అవినీతి ఆరోపణలు అవాస్తవమని పేర్కొంటున్నారని చెప్పారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|

మీడియా కొన్ని పత్రికలు నేషనల్ హెరాల్డ్ చార్జ్‌షీట్‌లో రేవంత్ పేరుని సైతం ప్రచురించలేదని, ఎంత తాపత్రయపడ్డా ప్రజలెప్పుడో నిజాలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీగా బీఆర్‌ఎస్‌లో ఎవరైనా అధ్యక్షుడికి సూచనలు చేయవచ్చని, గతంలోనూ అనేక మంది నేతలు లేఖలు రాశారని చెప్పారు. కోవర్టులు ఎవరో బయటపడతారని వ్యాఖ్యానించారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|

కేటీఆర్ చివరగా హెచ్చరిస్తూ, ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలంటూ గవర్నర్‌ను కలవనున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే నెలరోజుల్లో తమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. కేంద్రాన్ని, బీజేపీని ప్రజలముందు ఎండగడతామన్నారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|

Latest News

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News