Sunday, September 20, 2026
25.2 C
Hyderabad

రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ

మన ప్రజా పాలనకు ప్రజల ఆదరణ

నిజామాబాద్‌ రైతు మహోత్సవ సదస్సులో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

#congress #telangana #tpcc

నిజామాబాద్‌ జిల్లాలో నిర్వహించిన రైతు మహోత్సవ సదస్సులో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతిగా నిలుస్తుందని, రైతుల కోసం సమర్పిత భావంతో పనిచేస్తోందని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేసే విమర్శలు వాస్తవాలకు దూరంగా ఉన్నప్పటికీ, ప్రజల అభీష్టాన్ని గౌరవిస్తూ ప్రభుత్వం చిత్తశుద్ధితో పాలన కొనసాగిస్తోందని వెల్లడించారు.

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, లక్షన్నర కోట్లు గోదావరిలో పోసిన పాపం పూర్తిగా కేసీఆర్‌దే అని మండిపడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పూర్వ వైభవాన్ని పునరుద్ధరించగల పార్టీ కాంగ్రెస్‌ మాత్రమెనని పేర్కొన్నారు. జిల్లాను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రులపై ఉందని పేర్కొంటూ, వారి నైతిక, పాలనాపరమైన బాధ్యతను గుర్తు చేశారు.

నిజామాబాద్‌ జిల్లా రాజకీయాలకు, సామరస్యానికి మారుపేరుగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల నాటికే పార్టీ భిన్నతలు ఉంటాయని, కానీ ఎన్నికల అనంతరం జిల్లా అభివృద్ధి కోసం అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాకు రావలసిన నిధులు, ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవ తీసుకోవాలని ప్రజల తరఫున విజ్ఞప్తి చేశారు.

రైతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు కలిసి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని పేర్కొన్నారు. కొంతమంది రైతులను ఎంపిక చేసి విదేశాలకు తీసుకెళ్లి వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం పై అవగాహన కల్పించేలా మంత్రి చొరవ తీసుకోవాలని సూచించారు.

ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తూనే, సన్న బియ్యం పంపిణీ వంటి చారిత్రాత్మక పథకాలను కొనసాగిస్తోందని తెలిపారు. దీనిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా ముందుండి అమలు చేస్తున్నారు. ధనిక, పేద తేడా లేకుండా ప్రతి కుటుంబానికి ఈ పథకం లబ్ధి చేకూరుస్తోందని వివరించారు.

రానున్న రోజుల్లో ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మరోసారి 90 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్ పార్టీ లాగా మాట ఇచ్చి మోసం చేసే పద్ధతికి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాంగ్రెస్ ధర్మమని చెప్పారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ డీ-సెడ్మెంటేషన్ ద్వారా మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని, దేశంలోనే గొప్ప ప్రాజెక్ట్‌ అయిన శ్రీరాంసాగర్‌ను కూడా డీ-సెడ్మెంటేషన్ చేస్తే అదనంగా రెండు లక్షల ఎకరాలకు పైగా నీరు లభిస్తుందని వివరించారు. ఈ రెండు ప్రాజెక్టులతో ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా సస్యశ్యామలంగా మారిందని, ఆంధ్ర ప్రాంత రైతులు వలసలు కూడా వచ్చారని గుర్తు చేశారు.

ఈ విధంగా సస్యశ్యామలానికి పేరుగాంచిన నిజామాబాద్ జిల్లాకు పునరుత్థానం, పూర్వవైభవం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

Latest News

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News