Saturday, September 19, 2026
27.3 C
Hyderabad

ట్రంపు సరే, మోడీ సుంకాల మాటేమిటి!?

వడ్డీరేట్లు, పన్నులు ప్రజలకు, వ్యాపారులకు, ఉద్యోగులకు, అన్ని వర్గాలకు అనువుగా ఉండాలి. వారు భరించేవిగా ఉండాలి. పన్నులు కూడా హేతుబద్దంగా ఉండాలి. విపరీతంగా పన్నులు, వడ్డీలు వసూలు చేస్తే ప్రజలు భరించలేరని గుర్తించాలి. స్వయం ఉపాధి పొందే వారికి, చవువుకునే వారికి ఉపయుక్తంగా ఉండాలి. డబ్బు వినిమయం, వస్తు కొనుగోళ్లకు అవినాభావ సంబంధం ఉంది. డబ్బు మార్కెట్లో చలామణి అవుతూనే వస్తూత్పత్తి ప్రజలకు చేరాలి. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగేలా పరపతి విధానం ఉండాలి. అలాగే పెట్రో ధరలు, గ్యాస్‌ ధరలు కూడా ప్రజల కొనుగోలు శక్తికి మించి ఉండరాదు. ఇవి వస్తువుల ధరలను కూడా నియంత్రిస్తుంటాయి. వీటి ధరల ఆధారంగానే మార్కెట్లో వస్తువుల ధరలు పెరుగుతాయి. వీటిని బ్యాలెన్స్‌ చేయడం ప్రభుత్వం నడిపిస్తున్న వారికి అవసరం. అదేపనిగా ఉచిత పథకాల కారణంగా సమాజంలో పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతున్నది. తిని కూర్చునే వారు పెరుగుతున్నారు. దీంతో వస్తూత్పత్తి కూడా తగ్గుతుంది. ఇకపోతే ధర పెరిగినంత మాత్రాన పెట్రోలు, డీజిల్, గ్యాస్‌ వినియోగాన్ని తగ్గించలేం. కనుక వాటి కోసం మనం వెచ్చించే మొత్తం పెరిగింది. ఐతే కార్మికుల, ఉద్యోగుల వేతనాలు మొత్తం మాత్రం పెరగడంలేదు. దీంతో మనం ఇతర వస్తువుల వినియోగాన్ని తగ్గించివేస్తున్నాం. ఇతర సరుకుల వినియోగం ఎప్పుడైతే తగ్గిందో, ఆ మేరకు ఆయా రంగాలలో మాంద్యం ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి ప్రభుత్వం పూనుకోవాలి. కాని అలా జరగడం లేదు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగినప్పుడల్లా వాటి విూద వసూలు చేసే పన్నుల మొత్తం కూడా పెరుగుతోంది. ప్రస్తుత సంక్షోభాన్ని నివారించాలంటే ప్రజల కొనుగోలు శక్తిని పెంచే మార్గాలు అన్వేషించాలి. ఉపాధికల్పన మార్గాలను అన్వేషించాలి. కనీసం పెట్రో ఉత్పత్తుల విూద పన్నులను పెంచడం తగ్గిస్తే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకోగలరు. అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్రో ధరల పెరుగుదల వలన అదనపు ఆదాయం సమకూరుతోంది. ఆవిధంగా వచ్చిన అదనపు ఆదాయాన్ని ఉపాధి కల్పన వంటి రంగాలకు ఖర్చు చేయడం బదులు, కార్పొరేట్లకు మరిన్ని రాయితీల్విడానికో, వారి బకాయిలను మాఫీ చేయడానికో వినియోగిస్తోంది. అలాగే మరిన్ని ఉచిత పథకాలకు వెచ్చిస్తున్నారు.

వాస్తవానికి మన దేశంలో పెట్రోలు ధరలో 45.5 శాతం, డీజిల్‌ ధరలో 39.8 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులకే పోతుంది. పన్ను రూపంలో వసూలు చేసే దానిలో కేంద్రం రాష్ట్రాలతో వాటా పంచుకోవాలి. అందుచేత మోడీ ప్రభుత్వం నేరుగా పన్ను రూపంలో కాకుండా స్పెషల్‌ డ్యూటీ, రోడ్‌ సెస్‌, ఇన్‌ఫ్రాస్టక్చ్రర్‌ సెస్‌ వంటి పేర్లతో వసూలు చేస్తోంది. తరచూ ఆర్ధిక మాంద్యం ఏర్పడడం వల్ల సరుకుల వినిమయం తగ్గిపోతుంది. అదే విధంగా ద్రవ్యోల్బణం పెరుగుతూ వుంటుంది. మన రూపాయి విలువ పడిపోయినా, సరుకుల ధరలు పెరిగినా అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం 8 శాతం దాటింది. వీటికి తోడు మన దేశ వార్షిక జిడిపి వృద్ధి రేటు ముందు అంచనా వేసినట్టుగా ఉండడం లేదని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి.

ట్రంప్‌ విధానాలు, పాలస్తీనా,ఉక్రెయిన్‌ యుద్ధం ఆర్ధిక వ్యవస్థవిూద ప్రభావం చూపనున్నాయని అంటున్నారు. వృద్ధిరేటు తక్కువగా ఉండడం, ద్రవ్యోల్బణం అధికంగా ఉండడం, నిరుద్యోగం తీవ్రంగా ఉండడం నేటి ఆర్థి దుస్థితికి తాజా ఉదాహరణాలు. ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. ఐతే మార్కెట్ల విూద గుత్తాధిపత్యం కలిగివున్న బడా కార్పొరేట్లు ఆ పెరిగిన ధరలను వినియోగదారుల విూదకు నెట్టి వేస్తున్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడం వలన దాని ప్రభావం రవాణా రంగం విూద పడుతుంది. దాని కారణంగా ఇతర సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. ఇవన్నీ కలిసి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీని పర్యవసానంగా శ్రామిక ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. దాని వలన సరుకుల వినియోగం తగ్గిపోతుంది. మార్కెట్‌ లోని సరుకులు చెల్లుబాటు కావు. అందువలన ఆర్ధిక మాంద్యం ఏర్పడుతుంది.

మనదగ్గర పంటలు బాగానే పండుతున్నాయి. మిర్చి, పప్పు ధాన్యాలు విపరీతంగా పండుతున్నాయి. వరి లెక్కకు మించి పండిస్తున్నారు. అయితే ఈ ధరలు ప్రజలకు చేరడం లేదు. తాజాగా ఆక్వా రైతులు ట్రంప్‌ దెబ్బకు విలవిల్లాడుతున్నారు. చికెన్‌, మటన్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్నా ఆక్వా సామాన్యులకు అందుబాటు లోకి లేదు. దానిని ప్రజల చెంతకు తీసుకుని వెళ్లాల్సి ఉంది. ప్రజలకు మనదేశంలో లభిస్తున్న ఆహార ఉత్పత్తులు సరసమైన ధరలకు చేరాలి. ప్రధానంగా రొయ్యలను ఇంటింటికీ చేరుకునేలా చేయాలి. 140 కోట్లు జనాభా ఉన్న మన దేశంలో మాంసాహారులు కూడా ఎక్కువే. అమెరికా సుంకాలకు భయపడి కూర్చోకుండా ఆక్వాను ప్రజలకు అందించేలా ప్రణాళికలు చేయాలి. ట్రంపం సుంకాలను విమర్శిస్తున్న మనం మన వద్ద మోడీ సుంకాలను పట్టించుకోవడం లేదు. దేశం ఆర్థికంగా నిలదొక్కుకుని ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే జిఎస్టీ వడ్డింపులు భారీగా తగ్గాలి. ఉచిత పథకాలను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టాలి. తాయిలాలను పక్కన పెట్టాలి. కిలో రూపాయికే బియ్యం పథకానికి పాతరేయాలి. వడ్డీరేట్లు మరింతగా తగ్గాలి. విద్యార్థులు తీసుకునే విద్యారుణాలపై వడ్డీ నామ మాత్రంగా ఉండేలా చూడాలి.

ఇలా ఆలోచన చేసినప్పుడే, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. సంపాదించింది తిండికి కూడా సరిపోకపోతే దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని పాలకులు, వారికి సలహాలు ఇస్తున్న మేధావులు గుర్తించాలి.
……ఎండ్.

Latest News

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News