పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో రాయపర్తి మండలంలో పలు అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల నిమిత్తం స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి కోలన్ పల్లి లో రోడ్డు మార్గం ద్వారా వెళ్తూ… మధ్యలో ఓ పేదింటి పెద్దవ్వ వద్ద ఆగి వారి ఇంటికి వెళ్ళారు. ఈ సందర్భంగా ఆ పెద్దవ్వ ఆనందంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన సన్న బియ్యంతో వండిన ఆహారాన్ని తన ఇంటికి వచ్చిన ఆడ బిడ్డ మా ఎమ్మెల్యే అంటూ… ఆత్మీయంగా వడ్డించగా, ఎమ్మెల్యే యశస్విని, జిల్లా కలెక్టర్ సత్య శారద భోజనం చేశారు. ఈ సందర్భంగా పెద్దవ్వ సీఎం రేవంత్ రెడ్డిని, ఎమ్మెల్యే యశస్విని ని “అన్నదాత సుఖీభవ” అంటూ ఆశీర్వదించగా, ఎమ్మెల్యే మాట్లాడుతూ…. పేదింటి పెద్ద కొడుకులా సీఎం రేవంతన్నను ప్రజలు దీవిస్తున్నారు. ఇది పేదల ఆత్మగౌరవానికి నిదర్శనమన్నారు. సన్నబియ్యం పంపిణీ రాష్ట్రంలోని పేదలకు భరోసా, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి చిరునామా” అని పేర్కొన్నారు. తమకు భోజనం పెట్టిన పెద్దవ్వ ఆశీర్వాదం తీసుకొని తర్వాతి కార్యక్రమాలకు వెళ్ళారు.


