మిగిలిన వారికి త్వరలో అందజేత
రైతు భరోసా పథకం కింద జనవరి 26 నుంచి మూడు విడతలుగా నిధులు జమ చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. మొత్తం 44.82 లక్షల మంది రైతులకు, ఒక్క ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు, రూ. 3,487.82 కోట్లు అందజేశామని వివరించారు. ఇంకా నిధులు అందని రైతులకు త్వరలోనే జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతు భరోసా సాయాన్ని వ్యవసాయ పెట్టుబడుల కోసమే వినియోగించాలని ఆయన సూచించారు.

