వార్డెన్‌కు నోటీసు
భువనగిరి ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్‌ను కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్‌లో మెనూ ప్రకారం భోజనం అందించడంలో అవకతవకలు ఉన్నట్లు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ విజయలక్ష్మికి షోకాజ్ నోటీసు జారీ చేయడంతో పాటు హాస్టల్ పరిసరాల్లో ఉన్న డ్రైనేజీ సమస్యను తక్షణమే పరిష్కరించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు.

