ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం 27 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాజీవ్ కుమార్ మీనాను ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ గా నియమించారు. శాంతిభద్రతల అదనపు డీజీగా ఎన్. మధుసూదన్ రెడ్డి నియమితులయ్యారు. ఐజీపీ (ఆపరేషన్స్)గా సీహెచ్ శ్రీకాంత్ బదిలీ అయ్యారు. టెక్నికల్ సర్వీసెస్ ఐజీపీగానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్గా జి. పాలరాజు, ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీపీగా బి. రాజకుమారి బాధ్యతలు స్వీకరించనున్నారు.

