కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. పరువునష్టం కేసు ప్రొసీడింగ్స్‌ను తాత్కాలికంగా నిలిపేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2018లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి అమిత్ షాపై “హత్య కేసులో నిందితుడు” అని ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత నవీన్ ఝా పరువునష్టం దావా వేశారు. రాహుల్ ఈ కేసును రద్దు చేయాలని 2024 ఫిబ్రవరిలో క్వాష్ పిటిషన్ వేశారు. అయితే, ఝార్ఖండ్ హైకోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. కేసులో మరింత పరిశీలన అవసరమని సుప్రీంకోర్టు ఈరోజు పేర్కొంది.

