తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వారికి నూతన సంవత్సర & సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంలో పాలకుర్తి నియోజకవర్గానికి కావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుండి అందుతున్న పథకాలు తదితర అంశాలపై సీఎంతో ఎమ్మెల్యే యశస్విని, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని తప్పకుండా పూర్తి సహకారం ప్రభుత్వం నుండి ఉంటుందని సీఎం వారికి హామీ ఇచ్చారు.

