తిరుపతి బైరాగిపట్టెడలో జరిగిన తొక్కిసలాట సంఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి అక్కడికి చేరుకున్న ఆయన, ఘటనా స్థలాన్ని సందర్శించి, కలెక్టర్, ఎస్పీ, టీటీడీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, టికెట్లు పంపిణీ కేంద్రంలో ఉన్న అధికారులను ప్రశ్నిస్తూ, తొక్కిసలాట జరగకుండా ఏం చర్యలు తీసుకున్నారో అడిగారు. “ఈ ఘటన క్షమించదగిన తప్పు కాదని” అన్నారు.
భక్తుల రద్దీ పెరిగిపోతున్న వేళ, అధికారుల చర్యలు సరిగ్గా లేవని మండిపడ్డారు. ఆయన, “భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని” సూచించారు. అలాగే, “పద్ధతి ప్రకారం పని చేయాలని” హెచ్చరించారు. సీఎం, భక్తులను గేట్లలో నిలిపి ఉండగానే జాగ్రత్తలు తీసుకోవాలని, ‘టికెట్ల జారీపై’ కూడా ప్రశ్నించారు. “పోలీసు అధికారులకు సరైన సూచనలు ఇవ్వలేదా?” అని అడిగి, “ఇది నియమాల ప్రకారం కాకుండా, తమాషాగా జరుగుతుందా… అంటూ సీరియస్ అయ్యారు.

