2025 ఏథర్ 450 సిరీస్ స్కూటర్లు భారత మార్కెట్లోకి విడుదలయ్యాయి. వీటిలో ఆధునిక ఫీచర్లు, మెరుగైన పనితీరును అందించేందుకు ప్రయత్నించారు. 450ఎస్ మోడల్ ధర రూ.1,29,999గా నిర్ణయించగా, 2.9kWh బ్యాటరీతో 122 కి.మీ ఐడీసీ రేంజ్ అందిస్తుంది. 450ఎక్స్ 2.9kWh మోడల్ ధర రూ.1,46,999 కాగా, 126 కి.మీ ఐడీసీ రేంజ్ ఉంది. 3.7kWh బ్యాటరీతో 450ఎక్స్ లాంగ్ రేంజ్ వేరియంట్ ధర రూ.1,56,999గా, 161 కి.మీ ఐడీసీ రేంజ్ కలిగి ఉంది. పరిమిత ఎడిషన్‌లో విడుదలైన 450 అపెక్స్ మోడల్ ధర రూ.1,99,999గా నిర్ణయించగా, 157 కి.మీ ఐడీసీ రేంజ్‌ను అందిస్తుంది. నిజ జీవన రేంజ్ కొంచెం తక్కువగా ఉండవచ్చని కంపెనీ పేర్కొంది.
కొత్త మోడళ్లలో ఎంఆర్ఎఫ్ మల్టీ కాంపౌండ్ టైర్లతో మెరుగైన గ్రిప్, 450ఎక్స్, 450 అపెక్స్ మోడళ్లలో ట్రాక్షన్ కంట్రోల్, రేన్, రోడ్, ర్యాలీ మోడ్లు అందుబాటులో ఉన్నాయి. ఏథర్ స్టాక్ 6 సాఫ్ట్వేర్, గూగుల్ మ్యాప్స్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్, వాట్సాప్ నోటిఫికేషన్లతో పాటు ‘పింగ్ మై స్కూటర్’, లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి ఫీచర్లను కలిగిఉంది. డ్యూయెల్ ఫాస్ట్ ఛార్జర్‌తో 2.9kWh బ్యాటరీని 3 గంటల్లో 80% ఛార్జింగ్ చేయవచ్చు. హాలో హెల్మెట్‌ను ఉచితంగా అందిస్తున్నారు.

