Thursday, July 30, 2026
23.7 C
Hyderabad

గూడూరు శాసనం – తొమ్మిది శతాబ్దుల వేడుక!

“స్వస్తి శ్రీమచ్చాళుక్య విక్రమ వర్షద 49 నెయ క్రోధి సంవత్సరద పుష్య బహుళ 1 బుధవారదందు …” అనగా స్వస్తి శ్రీమచ్చాళుక్య విక్రమ వర్షం 49, క్రోధి సంవత్సరం, పుష్య బహుళ పాడ్యమి, బుధవారం సరియగు తేది క్రీస్తు శకం 1124 డిసెంబర్ 24 నాడు గూడూరు స్తంభ శాసనం ఆవిష్కరించ బడింది. ఈ కన్నడ తెలుగు శాసనానికి 2024 డిసెంబర్ 24 తో తొమ్మిది శతాబ్దులు నిండి పదవ శతాబ్ది లోనికి అడుగు పడింది. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా పాలకుర్తి మండలం నేటి గూడూరు నాటి గుముడూరు గ్రామంలో ఉన్నది ఈ శాసనం.

అయితే ఏమిటి? ఎన్నో శాసనాలలో ఇది ఒకటి అనుకోవచ్చు. కాదు; ఎన్నో విశేషాలు, ఎన్నో ప్రత్యేకతలు ఉన్న శాసనం; ఉద్దండుల నుంచి ఔత్సాహికుల దాకా అనుశీలించిన శాసనం; చరిత్రకారులు, సాహితీవేత్తలచే విస్తృతంగ చర్చించ బడిన శాసనం; చరిత్రకు, సాహిత్యానికి గొప్ప కూర్పును, చేర్పును అందించిన శాసనం గూడూరు శాసనం.

ఈ శాసనం కళ్యాణి చాళుక్య చక్రవర్తి త్రిభువన మల్ల 6 వ విక్రమాదిత్య (క్రీ శ 1074-1127) కాలానికి చెందినది. విరియాల మల్ల అనే మాండలికుడు ప్రభువుల పక్షాన ఉత్తరాయణ సంక్రాంతి నిమిత్తం గుముడూరు గ్రామంలో మల్లేశ్వర దేవుని రంగ భోగం కోసం బమ్మరి గ్రామాన్ని ధారా పూర్వకం చేయుట, ఇతర వితరణలు చేసిన సందర్భంగా వేయించిన దాన శాసనం. కాని, ఇది అంతటికే పరిమితం కాలేదు. పై ప్రభువుల చరిత్ర, ప్రశస్తి, గెలిచిన రాజ్యాలు, వారి అనుయాయుల పరిచయం, తన వంశ పరంపర, పరాక్రమం, చేసిన యుద్ధాలు, నిలబెట్టిన దేశాలు, పొందిన బిరుదులు, బహుమతులు, ఇచ్చిన దానాలు వంటి శాసన కాలానికి సుమారు శతాబ్దిన్నర ముందు నాటి నుంచి సవిస్తర సమాచారం స్పష్టమైన భాషలో మనకు అందిస్తుంది ఈ శాసనం.

ముఖ్యంగా కాకతీయ రాజ్య స్థాపనలో కీలక ఘట్టం ఈ శాసనంలో లభిస్తున్నది. అందుకే ఈ శాసనానికి ఇంత ప్రత్యేకత. మల్లని తాతకు తల్లి అయిన కామవసాని ప్రస్తావన ఇందులో కీలకం. కామవసాని విరియాల ఎర్ర నరేంద్రుని భార్య, కాకతి గుండ రాజు సోదరి. కాకతీయులు మొదట స్వతంత్ర పాలకులు కాదు. కొరవి పాలకుల ఫిర్యాదు మేరకు చాళుక్య చక్రవర్తి కాకతీయుల పైకి యుద్ధానికి ఎర్ర నరేంద్రుని పంపుతడు. ఎర్ర నరేంద్రుడు గుండ రాజును చంపి బొట్టు బేత రాజును కొరివి అధిపతిగా నిలుపుతడు. కామవసాని మేనల్లుడు గరుడ బేతరాజును చేపట్టి చక్రవర్తిని మెప్పించి అనుమకొండ విషయాధిపత్యం ఇప్పిస్తది. గరుడ బేతరాజు కాలాన్ని క్రీ శ 992-1052 గ నిర్ణయం చేసిండ్రు చరిత్ర కారులు. ఆ తరువాత కాకతీయుల పాలన క్రమంగా విస్తరిస్తది.

ఇంక, శాసన భాష విషయానికి వొస్తే సంస్కృత భూయిష్టమైన కన్నడ, తెలుగు భాషలు. మూడు వైపుల కన్నడ, ఒక వైపు తెలుగు ఉన్నయి. తెలుగు శాసనం ఉత్పల మాల, చంపక మాల పద్యాలలో ఉంది. ఇది తెలుగు శాసనాలలో తొలి వృత్త శాసనం. శాసన లేఖకుడు కొమ్మోజ సంస్కృత, కన్నడ, తెలుగు భాషలలో పండితుడు, పద్యకవి.

నేలటూరి వెంకటరమణయ్య, పి వి పరబ్రహ్మ శాస్త్రి, బి ఎన్ శాస్త్రి, జి ఆర్ వర్మ వంటి పెద్దలు ఎందరో ఈ శాసనాన్ని పరిశోధన చేసిండ్రు. గూడూరు సందర్శనలో జి ఆర్ వర్మ గారికి తోడుగా పేర్వారం జగన్నాథం గారి పనుపున విద్యార్థి లింగంపల్లి రామచంద్ర ఉన్నరు. ఈమని శివనాగి రెడ్డి, ద్యావనపల్లి సత్యనారాయణ, శ్రీరామోజు హరగోపాల్, రెడ్డి రత్నాకర్ రెడ్డి వంటి పరిశోధకులు ఈ శాసనాన్ని విశ్లేషణ చేసిండ్రు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ 1996 శాసన పాఠాన్ని, క్లుప్త వివరణ ను వార్షిక నివేదికలో ప్రచురించింది. 1974లో శాసనాన్ని ముద్రలతో సహా అచ్చు వేసింది. ఆ తరువాత చాలా గ్రంథాలు వచ్చినయి. ఆర్తి పరాంకుశం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఇంగ్లీష్ లో పాఠ్యాంశం వ్రాసిండ్రు. లింగంపల్లి రామచంద్ర తన “జనగామ జిల్లా సాహిత్య చరిత్ర”, పాలడుగు రత్నాకర్ రావు “గూడూరు చరిత్ర” గ్రంథాల ముఖ చిత్రం పై ఈ శాసనాన్ని వేసుకొన్నరు.

గ్రామంలోని శ్రీ పోతన చైతన్య వేదిక పూనుకొని 2018 లో నామ ఫలకాలు ఏర్పాటు చేసింది, చిరు పుస్తకం వేసింది. సర్పంచ్ మాచర్ల పుల్లయ్య సహకారంతో శాసనానికి పీఠం నిర్మించి గ్రామ పంచాయతి ఆవరణలో పొందుబాటు చేసిండ్రు. ఇప్పుడు తొమ్మిది వందల సంవత్సరాలు నిండిన సందర్భంగా “గూడూరు శిలా శాసన స్మృతి” అనే పుస్తకాన్ని తెస్తున్నరు.

పాలకుర్తి పర్యాటకానికి వచ్చే వారు గూడూరు శాసనాన్ని కూడా చూసి పోతున్నరు. ప్రభుత్వం శ్రద్ధ వహిస్తే గూడూరు లోని మల్లేశ్వర మందిరం, కోమటోల్ల బొమ్మలు, పాటి గడ్డ వస్తువులతో మ్యూజియం నిర్మాణం వంటివి చేపట్టి మరింత అభివృద్ధి చేయవచ్చు.

(నేడు గూడూరు శిలా శాసనం నవమ శతాబ్ది వేడుకలు)

డాక్టర్ రాపోలు సత్యనారాయణ
ఫోన్: 9440163211

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News