Thursday, July 30, 2026
23.4 C
Hyderabad

భూ యాజమానుల హక్కులను కాపాడేందుకు పలు చట్టాలు

అసెంబ్లీలో సిఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రసంగిస్తూ, భూమి యజమానుల హక్కులను కాపాడేందుకు పలు చట్టాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. “అర్హులైన ప్రతీ భూ యజమానులు తమ హక్కులను కాపాడుకునేందుకు, మా ప్రభుత్వం చట్టాలను ప్రవేశపెడుతున్నాం అన్నారు. తెలంగాణ రైతులకు ఉపయోగపడే చట్టాలు తీసుకురావాలని ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరిపే ప్రయత్నం చేశాం. అయితే ప్రతిపక్ష పార్టీ వారు అహంకారంతో చర్చను అడ్డుకోవాలని ప్రయత్నించారు. మీరు సహనంతో వ్యవహరించి, చర్చను పక్కదారి పట్టించకుండా కొనసాగించారు. మీకు అభినందనలు” తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రైతుల పోరాటాలను గుర్తు చేసుకున్నారు. “రావి నారాయణ రెడ్డి, అరుట్ల కమలాదేవి, అరుట్ల రాంచంద్రా రెడ్డి, మల్లు స్వరాజ్యం, భీం రెడ్డి నర్సింహారెడ్డి, చాకలి ఐలమ్మ లాంటి వారు భూమి కోసమే పోరాటాలు చేశారు. వారు భూమిని ఆత్మగౌరవంగా భావించారు, సాయుధ రైతాంగ పోరాటాలు జరిపారు. భూమి కాపాడుకోవడంలో వారు విజయం సాధించారన్నారు. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దుకు, యజమానుల హక్కులను కాపాడేందుకు అప్పటి ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి అని వెల్లడించారు. “ఇందిరాగాంధీ గారు భూమిలేని పేదలకు అసైన్డ్ పట్టాలు ఇచ్చి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. నిజమైన భూ యజమాని హక్కులను కాపాడుకుందాం అన్నారు. చదువు లేని వారి భూములు అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం ఉందని, ఈ పరిస్థితి నివారించేందుకు చట్టాలు సవరించామన్నారు.

ఈ సందర్భంగా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి కూడా విమర్శలు చేశారు. “కేసీఆర్ ఇచ్చిన ధరణి పోర్టల్ 2010లో ఒడిస్సాలో ప్రారంభించిన e-ధరణి ఆధారంగా నిర్మించబడింది. ఈ-ధరణి పోర్టల్‌కు అనుభవం లేని సంస్థ IL&FS ఇచ్చారు. 2018లో IL&FS తో పాటు గాదె శ్రీధర్ కు చెందిన e-Centric, Wissen Infotech సంస్థలు కాంట్రాక్టు సాధించాయి. ఈ సంస్థలు అనేక క్రిమినల్ నేపథ్యాలు కలిగిన సంస్థలు. కేసీఆర్ వాటిని ఎందుకు తీసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. “ఫిలిప్పిన్స్‌కు చెందిన Falcon SG సంస్థ 2021లో టెరాసిస్ షేర్లను కొనుగోలు చేసింది. దీనిలో 99% వాటాలు ఎవరూ కొనుగోలు చేశారో, 1% వాటాతో గాదె శ్రీధర్ రాజు CEO అయ్యాడు. ఈ దేశీయ, విదేశీ కంపెనీలలోని వారు తెలంగాణ రైతుల భూముల సమాచారాన్ని తమ చేతుల్లో పెట్టడం ఇది ఎంత తీవ్రమైన నేరమో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్నారు.

“భూ రిజిస్ట్రేషన్ల కోసం జరిగిన మార్పులు, అర్ధరాత్రి జరిగే రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ ఆఫీసుల లేకుండా ఇతర ప్రాంతాల్లో నిర్వహించడం, విదేశీ కంపెనీల చేతుల్లో డేటా పెట్టడం చాలా తీవ్రమైన తప్పిదమని ఆయన అన్నారు. వీటిని సవరించడం కోసమే భూ భారతి-2024 చట్టం తీసుకువచ్చినట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఈ చట్టం పేదల భూ హక్కులను కాపాడేందుకు తీసుకున్న చట్టం అని పేర్కొన్నారు. “ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం వల్ల 600 కోట్ల నష్టం రాకుండా కాపాడగలిగాం” అని పేర్కొన్నారు.

“మా ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ కబ్జాలు చేసిన వారిపై కేసులు నమోదు చేసాం. కొన్ని ప్రాంతాల్లో వేల ఎకరాల భూములు బదిలీ చేయబడ్డాయి. ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దేందుకే, భూమి యజమానుల హక్కులను కాపాడేందుకే భూ భారతి-2024 చట్టం తీసుకువచ్చాం” అని ఆయన తెలిపారు. “ఈ చట్టం ద్వారా 55 కోట్ల రూపాయలతో 600 కోట్ల నష్టం లెక్కించడమంటే అలా మనం రైతుల భూములు కాపాడే పనిలో ఉన్నాం. భూ హక్కులను కాపాడేందుకే భూ భారతి చట్టం తీసుకొచ్చామని సీఎం రేవంత్ తెలిపారు.

Latest News

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News