Monday, September 21, 2026
26.3 C
Hyderabad

అసెంబ్లీ లాబీలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ సంచలన వ్యాఖ్యలు

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడారు. సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన కౌంటర్ ఇచ్చారు. “సీఎం రేవంత్‌కు దమ్ము ఉంటే ఫార్ములా ఈ రేసు సహా ఇతర ఆరోపణలపై అసెంబ్లీలో చర్చ పెట్టండి,” అని డిమాండ్ చేశారు. “రేవంత్ రెడ్డికి అసెంబ్లీలో నిజాలను ప్రజల ముందు ఉంచే ధైర్యం లేదు. లీకులిచ్చి దుష్ప్రచారం చేసే కన్నా సభలో చర్చకు రావాలి. అసెంబ్లీలో చర్చ పెడితే ఏది నిజమో ప్రజలు స్వయంగా తేల్చుకుంటారు,” అని అన్నారు.

కేటీఆర్ తన ప్రసంగంలో రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. “లీకు వీరుడు రేవంత్ రెడ్డి ఆరోపణలకు సభ్యత, సంస్కారం ఉండదు. ఫార్ములా ఈ రేసుతో పాటు మిగతా అంశాలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు అసత్యాలు. నిజంగా న్యాయంగా వ్యవహరిస్తే ఏ కోర్టు అయినా కేసును కొట్టేస్తుంది. కానీ తాము చేస్తున్న ప్రతీ పనిని విమర్శించడమే వీరి పని,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీలకు అన్యాయం చేసే చట్ట సవరణలపై విరుచుకుపడిన కేటీఆర్

కాంగ్రెస్ ప్రవేశపెట్టిన స్థానిక సంస్థల చట్ట సవరణలపై కూడా కేటీఆర్ మండిపడ్డారు. “ఈ చట్ట సవరణల వల్ల బీసీలకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనే హామీ గంగలో కలిసినట్టే అవుతుంది,” అని చెప్పారు. “బీసీల రిజర్వేషన్లకు సంబంధించి ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలని కొత్త అడ్డంకులు పెట్టడం అన్యాయమని,” ఆయన అన్నారు.

కేటీఆర్ అన్ని పార్టీల మద్దతుతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టంలో పొందుపరచాలని డిమాండ్ చేశారు. “సభలో ఓటింగ్ లేదా డివిజన్ అడుగుతాం. బీసీల హక్కులను రక్షించడానికి అవసరమైతే రాజ్యాంగ సవరణ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదిస్తాం. కానీ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన చట్ట సవరణలు బీసీల హక్కులను కాలరాస్తాయి,” అని చెప్పారు.

కేబినెట్ పై విమర్శలు

కేబినెట్ పని తీరుపై కూడా కేటీఆర్ విమర్శించారు. “కేబినెట్ గురించి గాసిప్ లను సృష్టించడం మినహా కాంగ్రెస్‌కి ఏమీ చేతకాదు. అధికారికంగా విషయాలు చెప్పే ధైర్యం లేక లీకులు చేయడమే వీరి పనిగా మారింది,” అని దుయ్యబట్టారు.

సమగ్రంగా బీసీలకు రిజర్వేషన్లు అవసరం

“ఈ చట్ట సవరణల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక నిబంధనలు పెట్టాలి. కోర్టులు అంగీకరించకపోతే అవసరమైతే రాజ్యాంగ సవరణ కోసం ప్రయత్నించాలి,” అని కేటీఆర్ స్పష్టం చేశారు. “బీసీల ప్రయోజనాల కోసం తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం,” అని పేర్కొన్నారు.

ఈ ప్రకటనలతో కాంగ్రెస్, బీజేపీ వైఖరులపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేయడంతో రాజకీయంగా టెన్షన్ పెరిగింది. అసెంబ్లీలో ఈ అంశాలపై చర్చ వాతావరణం వేడెక్కించనుంది.

Latest News

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News