Saturday, September 19, 2026
27.3 C
Hyderabad

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉండనుంది.

భారత్ తన ముడి చమురు అవసరాల్లో 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. హార్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో 20% రవాణా జరుగుతుంది. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ఈ చమురు రావాణా మార్గాన్ని మూసివేసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు కొరత ఏర్పడి, ధరలు అమాంతం పెరుగనున్నాయి. తద్వారా పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు కూడా పెరుగుతాయి. దాంతో రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసరాల ధరలు కూడా ఎగబాకడం అనివార్యం.

చమురు ధరల పెరుగుదలతో వాణిజ్య లోటు పెరుగుతుంది. ఇప్పటికే దిగుమతులు ఎక్కువగా, ఎగుమతులు తక్కువగా ఉన్న నేపథ్యంలో డాలర్ డిమాండ్ పెరిగి రూపాయి విలువ పడిపోతుంది. రూపాయి బలహీనపడితే దిగుమతుల ఖర్చు మరింత పెరుగుతుంది. ఇది ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే దుష్ప్రభావం కలిగిస్తుంది. ద్రవ్యోల్బణం 6 శాతానికి మించి పెరిగితే సామాన్యుల జీవన వ్యయం గణనీయంగా పెరుగుతుంది.

భారత్ ప్రతి ఏడాది 5–6 మిలియన్ టన్నుల కందిపప్పు, పెసరపప్పు వంటి పప్పుదినుసులను మయన్మార్, కెనడా, ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అలాగే సోయా ఆయిల్‌ను అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా నుంచి, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఉక్రెయిన్, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ సరుకులు ఎక్కువగా సూయెజ్ కాలువ, హార్ముజ్ జలసంధి మార్గాల ద్వారా వస్తాయి. ఈ మార్గాల్లో అంతరాయం కలిగితే నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దాంతో రవాణా, బీమా ఖర్చులు పెరిగి చివరకు వినియోగదారులపై భారమవుతుంది. అలాగే జీడిపప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష, ఆప్రికాట్ వంటి డ్రైఫ్రూట్స్ దిగుమతులు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. సరఫరా తగ్గితే ధరలు పెరగడం ఖాయం. ఇది మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం వేస్తుంది.

మన దేశ జనాభా 147 కోట్లకు చేరుకుంది. వివిధ నివేదికల ప్రకారం ఇప్పటికీ 28% మంది పేదరికంలో జీవిస్తున్నారు. దేశ సంపదలో సగానికి మించి, కేవలం 10% మంది ధనవంతుల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ధరల పెరుగుదల పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాలను మరింత కష్టాల్లోకి నెడుతుంది.

వ్యవసాయ రంగం బలహీనపడటం, నిరుద్యోగం పెరగడం, విద్యా–వైద్య సేవలు ఖరీదైనవిగా మారడం వంటి అంశాలు ఇప్పటికే సామాజిక ఒత్తిడిని పెంచుతున్నాయి. యుద్ధ ప్రభావంతో ద్రవ్యోల్బణంతో, జీవన వ్యయం పెరగడం వల్ల అప్పుల భారమూ అధికమవుతుంది. ఇది ఆత్మహత్యలు, సామాజిక అస్థిరత వంటి సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది.

మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? చమురు దిగుమతులను తగ్గించుకుంటూ, ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించాలి. పప్పుదినుసులు, నూనె గింజల ఉత్పత్తిని దేశీయంగా పెంచాలి. రైతులకు కనీస మద్దతు ధర, నిల్వ సదుపాయాలు, ప్రాసెసింగ్ యూనిట్లు కల్పించాలి. కీలక దిగుమతులపై సమయానుకూల నియంత్రణలు విధించి దేశీయ ఉత్పత్తిదారులను రక్షించాలి. పేదల కోసం నేరుగా నగదు బదిలీలు, ఆహార భద్రత పథకాలు బలోపేతం చేయాలి.

యుద్ధాలు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు కలిగించినా, వాటి ప్రభావాలు దీర్ఘకాలికంగా తీవ్రం. ప్రపంచీకరణ యుగంలో ఒక చోట సంక్షోభం మొత్తం ప్రపంచాన్ని తక్షణమే ప్రభావితం చేస్తుంది. కాబట్టి భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలి. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయ ఉత్పత్తి, వినియోగాన్ని పెంచుకోవాలి.

సమయోచిత విధానాలు అమలు చేస్తే దాని ప్రభావాన్ని నియంత్రించడమే కాదు తగ్గించుకోవడం కూడా సాధ్యమే. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ఆర్థిక సంస్కరణలకు పూనుకుంటేనే దేశం దీర్ఘకాలికంగా ఆర్థికంగా బలపడుతుంది.

Latest News

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News