Trending News
Sunday, December 7, 2025
25.2 C
Hyderabad
Trending News

అరాచక రాజకీయాలు! అనేక డ్రామాలు!!|EDITORIAL

గతంలో నాయకులు సేవా భావంతో రాజకీయాల్లోకి వచ్చేవారు. నిస్వార్థంగా సేవ చేసేవారు. నిష్టతో నిరుపేదలని ఆదుకునేవారు. మనసా, వాచా, కర్మణ త్రికరణ శుద్ధితో నిస్వార్థ ప్రజాసేవకే వాళ్ళ జీవితాలను అంకితం చేసేవారు. అందుకే గాంధీజీని ఇంకా మనం మన జాతిపితగా, నెహ్రూని భారత నిర్మాతగా, పటేల్ ని ఉక్కు మనిషిగా, శాస్త్రిని ఆదర్శవాదిగా, అబ్దుల్ కలామ్ ని నిరాడంబర జీవిగా, తెలంగాణ కోసం పదవులను త్యాగం చేసి, బతికినంత కాలం అదే ఆశయం కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీని కొనియాడుతున్నాం. వాళ్ళను అనుకరించే వాళ్ళు కూడా ఇంకా అక్కడో, ఇక్కడో, ఎక్కడో నూటికో కోటికో ఒక్కరు ఉన్నారు కాబట్టే రాజకీయాలు కూడా నడుస్తున్నాయనేవాళ్ళూ ఉన్నారు. రాను రాను రాజకీయాలంటే అరాచకంగా మారిపోయాయి. పార్టీలు, నేతలూ అంతా కలగలిసి దోచుకుందాం, దాచుకుందామనే పనిలోనే ఉన్నారు. ఇందుకు వాళ్ళు ఆడని అబద్ధం లేదు, చేయని తప్పు లేదు. తత్ఫలితంగా మొత్తం దేశం, రాష్ట్రాలు దివాళా తీసేస్తున్నాయి.

ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ అప్పులు విపరీతంగా పెరిగాయి. ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితి. ఒకరిని మించి ఒకరు అప్పులపైనే ఆధారపడుతున్నారు. ప్రజా ప్రతినిధులుగా, ప్రభుత్వానికి కేర్ టేకర్లుగా వ్యవహరించాల్సిన పీఎం, సీఎంలు రియల్ ఎస్టేట్ సీఇఓలు గా వ్యవహరిస్తున్నారు. చేసిన వేలకోట్ల అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నారు తప్ప, దుబారాను అరికట్టే ప్రయత్నం చేయడం లేదు. నేతల జీతభత్యాలు, పెట్టుబడుల కోసం దేశదేశాలు తిరగడానికి ప్రత్యేక విమానాలు, హెలీక్యాప్టర్లకయ్యే ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. ఉచిత పథకాల పద్దు ఎలాగూ ఉంది. ప్రజలు కూడా ఉచితాలకు అలవాటు పడితే, తిరిగి వారిమీదే ఆ ఆర్థిక భారం పడుతుంది. ఏ పార్టీ, ఏ నేతా వారి జేబుల్లో నుంచో, లేక వారు ఆబగా అడ్డంగా సంపాదించిన ఆస్తులమ్మో వారి పార్టీలను, ప్రభుత్వాలను నడపరు. ప్రజలు కట్టే పన్నుల నుంచే అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వం, పాలకులు, అధికార యంత్రాంగం, సేవలు, ఆర్టీసీ అన్నీ అందులోనుంచే నడుస్తాయన్నది మరచిపోవద్దు.

అధికార వ్యామోహానికి వ్యసనంగా అలవాటు పడ్డ మన నేతలు ఆ పదవులను కాపాడుకోవడానికి, తిరిగి పొందడానికి ఎన్ని వేషాలైనా వేస్తున్నారు. ఏపీలో చంద్రబాబు అమరావతి, పి-4 అంటూ పరుగులు తీస్తున్నారు. ఉన్న భూమి చాలదన్నట్లు మరో 45 వేల ఎకరాలకు టెండర్‌ పెట్టారు. జగన్‌ను విమర్శిస్తూనే, మరిన్ని అప్పులు చేసేస్తున్నారు. వడ్డీల భారం ప్రజలకు తప్పడం లేదు. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. మరోవైపు రాజకీయంగా ఎదురుదాడితో నిరంతరం విమర్శలకు దిగుతున్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేశామంటున్నారు సరే, వాటికి నిధులేవీ? అంటే తిరిగి అప్పులే. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను ఎజెండా చేసుకుని అధికార, ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. జగన్‌ అధికారంలో ఉండగా అంతకుమించి అన్నట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు టీడీపీ కూటమికి సమయం వచ్చింది. అంతే. సింగపూర్‌ పర్యటనను కూడా రాజకీయం చేసేశారు. ఇంతకూ ఎవరి మీద ఎవరు కేసులు పెడతామన్నారనేది త్వరలో ప్రజలకు తెలుస్తుంది. ఏపీలో జగన్‌ వర్సెస్‌ కూటమిగా రాజకీయం నడుస్తుంటే, చెల్లి షర్మిల సమయం చిక్కినప్పుడల్లా అన్న జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం 42శాతం బీసీ రిజర్వేషన్ల రాజకీయం నడుస్తోంది. ముడు ప్రధాన పార్టీల ఒకరిని ఒకరు నిందించుకుంటున్నాయి. వేర్వేరుగా ఏ ఒక్క పార్టీ కానీ, కలిసి మూడు పార్టీలు కానీ బీసీల రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధిగా పని చేయడం లేదు. ఈ డ్రామా స్థానిక ఎన్నికల తర్వాత కూడా కొనసాగేలా ఉంది. మరో విచిత్రం ఏమంటే, మూడు పార్టీలు మిగతా రెండు పార్టీలను కుమ్మక్క అయ్యాయని పరస్పరం నిందించుకుంటున్నాయి. రాజకీయ మైలేజీ కోసం నానా తంటాలు పడుతున్నాయి.
ఇక తెలంగాణ రాజకీయాల్లో మరో తమాషా నడుస్తోంది. బీజేపీలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్‌లు మూడు శిబిరాలైతే, ఈటలకు పదవి రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుకుండా మిగతా రెండు శిబిరాలు కలిసి అడ్డుకున్నాయి. బీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, హరీశ్‌ల మధ్య ప్రత్యక్ష పోటీ బయటకు కనిపిస్తుంది. కానీ లోలోన అంతా ఒక్కటే. బీఆర్ఎస్, బీజేపీ విలీనాన్ని తాను జైల్లో ఉండి ఆపానని కవిత అంటుంటే, ఆమె వెనక అదృశ్య శక్తులు చేరాయని విధేయ నేతలతో ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ది ఓ కలహాల కాపురం అనేక గ్రూపులుగా అంతా కలిసే వున్నారు. పానకంలో పుడకలా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మంత్రి పదవి ఎపిసోడ్ నడుస్తూనే ఉంది.
ఒకప్పుడు కుటుంబానికో రాజకీయ నేతలుంటే మహా ఎక్కువ. ఇవ్వాళ అన్నీ కుటుంబ రాజకీయాలే! రాజకీయాలు లాభసాటి వ్యాపారంగా మారాయి. అందుకే అన్ని పార్టీల రాజకీయ నేతలూ నాటకాలు ఆడుతున్నారు. పార్టీలు కూడా కొన్ని కులాలు, కుటుంబాలు, వ్యక్తులు, వర్గాల చేతుల్లో బందీగా మారాయి. ఇప్పుడు ప్రజలకు ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ‘వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, వాడి…’ అనే సినిమా డైలాగ్ లాగా, పరిస్థితి దాపురించడంతో అన్నీ పార్టీలు అడిందే ఆట, వేసిందే డ్రామాలా మారిపోయింది. ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. సమయం వచ్చినప్పుడే స్పందిస్తారన్నది మరచిపోవద్దు.

Latest News

సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్ రేసులో|PANCHAYATI TRENDS

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రైతులు, స్థానిక నాయకులు సర్పంచ్ పదవికి పోటీ చేసే గ్రామ రాజకీయాల్లో ఈసారి సాఫ్ట్‌వేర్ కంపెనీ...

తంగెడాకులతోటి ఇనుప ధాతువు తయారు?!|ADUGU TRENDS

ఆకే కదాని తీసిపారేయొద్దు! పువ్వే కదాని పీకి పారేయొద్దుల్లా!! ఏ పుట్టల ఏ పాముందో! అన్నట్లు... గా ఏ ఆకుల ఏం బలముందో ఎవరికి ఎరుక?! గిప్పటి దాకా మనకు ఆకులు, అలములల్ల ఔషధ...

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ,...

ఈ రోజు /వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

డిసెంబర్ 07--2025 నుండి డిసెంబర్ 13--2025 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీ శక్తి మరియు నిర్ణయాత్మకత మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తిపరమైన రంగంలో, మీరు ఎదుర్కొంటున్న ఎత్తు తక్కువలను...

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News