Saturday, September 19, 2026
23.7 C
Hyderabad

పులులతోనే సకల మానవ జీవ వైవిధ్యం!|EDITORIAL

వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పారిశుద్ధ్యం, పర్యావరణం ఇవి మానవ మనుగడుకు అత్యావశ్యం. కానీ, వీటినే మానవుడు అత్యంత నిర్లక్ష్యం చేస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణంపై శ్రద్ధాసక్తులు తగ్గిపోతున్నాయి. మానవుడు పుట్టిన నాటి నుండే ప్రకృతి విధ్వంసం మొదలైంది. ఆ రకంగా చూస్తే మనిషే ప్రకృతికి, పర్యావరణానికి మొదటి శత్రువుగా మారాడు. ఇష్టానుసారంగా అడవులను నరికివేస్తూ, అడవుల్లోని జంతుజాలాన్ని వేటాడుతూ, వాటి ఉనికికే ప్రమాదకారిగా మారాడు. ఈ కారణంగా ఇప్పటికే అనేక జంతు జాతులు నశించాయి. మనం బతికితే చాలు, మిగతా ఏమయితే మనకేమిటన్న ధోరణి ప్రబలింది. ప్రపంచవ్యాప్తంగా విచక్షణారహిత మానవ ప్రవర్తన వల్ల అడవులు మాత్రమే కాదు. అటవీ జంతు జాతి మొత్తం అంతరించిపోయే ప్రమాదపుటంచుల్లో మనం జీవిస్తున్నాం. పర్యావరణ హితమైన పులుల జాతి కూడా మానవ హింసాత్మక ప్రవుత్తికి బలైపోతోంది. దీన్ని గమనించిన 2010 నుంచి ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా జూలై 29న ’అంతర్జాతీయ పులుల దినోత్సవా’న్ని పాటించడం ఆనవాయితీగా పెట్టింది. అయితే అది ‘పులుల దినం’గా ఆ రోజుకే పరిమితమై పోవడమే విచారకరం.

పులులను కాపాడుకోవడం, వాటి ఆవాసాలను సంరక్షించుకోవడం, అక్రమ వేటలను మానుకోవడం, జీవ వైవిధ్యాన్ని కాపాడే ప్రాధాన్యాన్ని వివరించడం, టైగర్‌ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయడం, టైగర్‌ రిజర్వులను నియంత్రించడం లాంటి అంశాల్లో సామాన్య జనాలకు అవగాహన కల్పించడానికి ఈ వేదికలను ఉపయోగించుకోవాలి. పిల్లుల జాతిలో అతి పెద్ద జంతువుగా పులికి పేరుంది. 2025 అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ‘మానవులు, పులులు సామరస్యంగా సహజీవనం చేయడం’ అనే ఇతివృత్తంగా పులుల సంరక్షణ బాధ్యతలను వివరించడం జరుగుతుంది.

కాగా, పులుల వృద్ధి రేటు 6.1 శాతంగా నమోదు అవుతున్నది. వందేళ్ళ క్రితం లక్ష వరకు ఉన్న పులులు నేడు కేవలం 5,574 మాత్రమే ఉండడం విచారకరం. పులుల్లో చాలా అరుదైన జాతి రాయల్‌ బెంగాల్‌ -టైగర్‌. దీన్ని పెద్ద పులి అంటారు. ఇది మన దేశంలో తప్ప ఇంకెక్కడా కనిపించదు. బెంగాల్‌ టైగర్‌ గాండ్రింపు సుమారు రెండు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. ఇవి రోజుకు దాదాపు 21 కిలోల మాంసాన్ని తింటాయి. ప్రతి రెండేళ్లకోసారి ఒక్కో ఆడ పులి రెండు నుంచి నాలుగు పిల్లల్ని పెడుతుంది. పులులు పుట్టిన 18 నెలల నుంచే వేటాడటం మొదలు పెడతాయి.

ఇటీవల ఆదిలాబాద్‌ కవ్వాల్‌ రక్షణకు జివో 49ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుని వచ్చింది. కానీ గిరిజనుల జీవనానికి ఇది అడ్డంకిగా మారిందన్న ఆందోళనతో అది అమలుకు నోచుకోలేదు. నిజానికి జీవవైవిధ్యం కాపాడటంలో పులులదే కీలక పాత్ర. అడవిలో ఒక ప్రాంతంలో గడ్డి, మొక్కలను తినే జీవజాతులను వేటాడే పులి భయానికి కొంత కాలం మేసి, అక్కడి నుంచి అవి మరో చోటకి పోతాయి. పులులు తిరిగి వేటాడుతూ, ఆ చోటకు వెళతాయి. అవి మరో చోటకి… ఇలా వెళ్ళడం వల్ల మొదటి జంతు జీవాలు ఖాళీ చేసిన ప్రాంతం తిరిగి పూర్వ స్థితిని సంతరించుకుంటుంది. ఆ విధంగా అడవి సంరక్షించబడటమేగాక, జీవ వైవిధ్యం కాపాడపడుతుంది. రానురాను అడవులు ధ్వంసం అవుతుండటం, వేటాడటం వల్ల పులుల సంఖ్య తగ్గిపోతోంది. సాధారణంగా ఒక పులి సంచరించే ప్రాంతం చుట్టు-పక్కల మరో పులి సంచరించదు. 25 నుంచి 30 కిలోమీటర్ల మేర ఒక పులి తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంది. ఫుడ్‌ పిరమిడ్లో అగ్రస్థానంలో ఉండే పెద్ద పులి నివసించాలంటే ఆ ప్రాంతంలో చిన్నా, పెద్దా అన్నిరకాల జంతువులుండాలి. మంచి వర్షపాతం ఉండాలి. పచ్చని చెట్లతో కూడిన దట్టమైన అడవి ఉండాలి. ఒక్కో పులి మనుగడకి 25 వేల ఎకరాల అడవిని కాపాడుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు.

ప్రపంచంలోని పులుల సంఖ్యలో సగానికి పైగా మన దేశంలోనే ఉన్నాయి. 1972లోనే పులిని జాతీయ జంతువుగా ప్రకటించి, తర్వాతి ఏడాది నుంచే ప్రాజెక్ట్‌ -టైగర్‌ ను ప్రారంభించింది. టైగర్‌ ట్రాకర్స్‌ వ్యవస్థను పటిష్ట పరిచింది. పులు వేటని నిషేధించింది. వాటి సంరక్షణ కోసం భారీగా ఖర్చు చేస్తోంది. దేశంలో 48 పులి అభయారణ్యాలను ఏర్పాటు- చేశారు. ఇండియన్‌ రైల్వే, టైగర్‌ ఎక్స్‌ ప్రెస్‌ పేరుతో టూరిస్ట్‌ రైలు సేవలను కూడా ప్రారంభించింది. ఇందులో బాంధవగడ నేషనల్‌ పార్క్‌, కన్హా నేషనల్‌ పార్కులో సఫారీకి తీసుకెళ్తారు.

అయితే అడవులు అంతరించడం. అడవుల్లో నీటి కుంటలు లేకపోవడం వల్ల అవి ఊళ్లలోకి వస్తున్నాయి. నగరాల విస్తరణ, గ్లోబలైజేషన్‌ ప్రభావంతో రానురానూ అడవులు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం కేవలం ఆరు జాతుల పులులు మాత్రమే మనుగడలో ఉన్నాయి. అనేక టైగర్‌ జాతులు అంతరించి పోయాయి. పులుల సంఖ్య పెరగడం వల్ల పర్యావరణం పెరిగి, పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. పులులు అంతరిపోవడానికి వేట, వాతావరణ మార్పులతోపాటు, పులి చర్మం, గోళ్లకు డిమాండ్‌ ఎక్కువ. చైనీస్‌ సంప్రదాయ వైద్యంలో పులుల గోళ్లు, పళ్లు, మీసాలను ఉపయోగిస్తారు. వాటి కోసం ఎక్కువ ధర చెల్లిస్తారు. అందుకే పులుల వేట, స్మగ్లింగ్‌ కూడా ఎక్కువైంది. దీంతో పులులు మాత్రమే కాక, ఇతర జీవులు కూడా అంతరిస్తున్నాయి. మానవ మనుగడ కోసం పులుల్ని, ఇతర జీవరాశులని సంరక్షించుకోడంతోపాటు అడవులు పెంచడం ఒక్కటే మార్గం.
…..

Latest News

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News