Wednesday, May 6, 2026
33.2 C
Hyderabad

CAST|కుల, RELIGION|మత కుళ్ళు POLITICS|రాజకీయాలకు స్వస్తి!?

ఆ మధ్య ఒక వీడియో వైరల్ అయింది. అందులో ఓ ప్రసంగికుడు, ‘చంద్రమండలంపై నివసించే అవకాశం వస్తే, అంతా మన కులం వాళ్ళే ముందుండాలి. వారికే ప్రాధాన్యం కల్పించాలి. అందుకనుగుణంగా మనమంతా చైతన్యం కావాలి.’ అంటూ కుల గజ్జిని నిర్లజ్జగా ప్రచారం చేశాడు. దాన్ని ఆ కులం వాళ్ళో లేక ఆ కులం అంటే పడని వాళ్ళో కానీ, తెగ వైరల్ చేసేశారు. అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక యుగంలోనూ కుల, మత ప్రాతిపదికన రాజకీయాలు నడవటం, రాజ్యాలుండటం, రాజ్యాంగాలుండటం, రాజ్యాలు ఏలుతుండటం నిజంగా సిగ్గుపడాల్సిన మూర్ఖత్వం. శోచనీయం. అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతూ, అంతరంగంలో మాత్రం కులం, మతం కుళ్ళును పెట్టుకోవడం విడ్డూరం కాక మరేమిటి? ఎవరేం చెప్పినా, చెప్పకపోయినా, కులం, మతం మన రక్తంలో అలా కలిసిపోయిందేమో? కులం, మతం విస్మరించలేని క్లేషంగా మిగిలిపోయింది. కొనసాగుతున్నది కూడా. CAST|RELIGION|POLITICS

దేశంలో మత, కుల రాజకీయాలు దినదిన ప్రవర్థమానం అవుతున్నాయి. మతం, కులాల పేరుతో పబ్బం గడుపుకోవడం రాజకీయ పార్టీలకు అలవాటైంది. ఇందులోనూ ఆధిపత్య వైఖరి కొన్ని కులాలకు ఉంటుండగా, ఇతర కులాలకు బానిస మనస్తత్వం అలవాటైపోయింది. ఇది ఇంకా కొనసాగుతున్నందున, ఆయా కులాలు, మతాలు ఇంకా వాటినే నమ్ముకుని ప్రయాణిస్తున్నాయి. కాబట్టే కొన్ని మతాలు, కులాలు రాజ్యాధికారంలోనే పాలకులుగా ఉంటుండగా, మిగతా కొన్ని మతాలు, కులాలు పాలితులుగానే మిగిలిపోతున్నాయి. కుక్కకు బొక్కేసినట్లు ఏవో ఒకటి రెండు పదవులు పడేస్తే.. వాటిని కంకుకుంటూ కొన్ని కులాలు ఉంటున్నాయి. సమాజంలో, దేశంలో బలమైన వర్గాలకు ‘బలహీన వర్గాల’ని బోర్డు తగిలించేశారు. ఆ వర్గాలు నిజమే కాబోలని బలహీనంగా మారిపోయాయి. ఇంకొన్ని వర్గాలు అంబేద్కర్ పుణ్యమాని అందివచ్చిన రిజర్వేషన్లను అనుభవిస్తున్నాయి. అంతే తప్ప పాలకులు, పాలితులకు ఏనాడూ రాజ్యాధికారం అప్పగించడం లేదు. CAST|RELIGION|POLITICS

పార్టీలు, వాటి అధ్యక్ష పదవులు మొదలు ప్రధానులు, సీఎంలు, మంత్రులు ఇలా అంతా కొన్ని కులాల గుత్తాధిపత్యంగా మారిపోయాయి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలను కేవలం ఓటు బ్యాంక్‌ చేసుకుని రాజకీయాలు చేస్తూ, అధికార పెత్తనం చెలాయిస్తూ దేశాన్ని దేశాన్ని, పాలనను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. నిజానికి కులాల కుంపట్లతో చలి మంట కాల్చుకోవడం తప్ప సాధించేదేమీ లేదు. ఒకవైపు మరో ప్రపంచం, మరో ప్రపంచం అంటూ అనేక దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే మనం మాత్రం మతాలు, కులాలు, వర్గాలు అంటూ కుమ్ములాడుకుని, కొట్టుకు చస్తున్నాం. దీనికితోడు దేశంలో సిద్ధాంత నిబద్ధత లేని రాజకీయాలు నడుస్తున్నాయి. విద్వేషాలు, విభేదాలతో రాజకీయాలు రక్తి కడుతున్నాయి. CAST|RELIGION|POLITICS

కేవలం బీజేపీ హిందుత్వాన్ని ప్రోత్సహింస్తోంది. ముస్లీం మైనార్టీలకు అనుకూలంగా కాంగ్రెస్ పని చేసింది. ఇదే అదనుగా కొన్ని ముస్లీం పార్టీలు అధికార పార్టీకి అండగా నిలుస్తున్న వైనం మనం చూస్తూనే ఉన్నాం. దేశ, ప్రజా ప్రయోజనాలను మించి ఓట్ల కోసం వెంపర్లాడే రాజకీయాలను అన్ని పార్టీలు దూరం పెట్టాలి. నిజానికి మైనార్టీలను సంతోష పెట్టే మిషతో విభజన రేఖలు గీస్తున్నది రాజకీయ పార్టీలే. అన్ని మతాలను, కులాలను, వర్గాలను సమానంగా చూసే రాజకీయాలు దేశానికి అవసరం. CAST|RELIGION|POLITICS

ఇప్పటికే మత ప్రాతిపదికన దేశం విచ్ఛిన్నం అయింది. దేశ విభజన జరిగింది. ఆ పీడకల నుంచి, ఆ విడిపోయిన ప్రతిఫలాల నుంచి ఇంకా మనం బయటపడలేదు. అన్ని మతాలు, కులాలు, వర్గాల ప్రజలను ఈ దేశ సంస్కృతిలో భాగంగా చూడాలి. ప్రధానంగా దేశంలో కమ్యూనిస్టులు ఇంకా మేల్కోవడం లేదు. పడికట్టు పదాలతో గిమ్మిక్కులను ప్రజలను నమ్మేస్థితిలో లేరు. స్వార్థ, స్వప్రయోజనాల కోసం కాకుండా, దేశ, ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే రాజకీయాలు చేసే అలవాటును మన దేశంలో పార్టీలు అలవరచుకోవాల్సి ఉంది. CAST|RELIGION|POLITICS

ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్‌ టెర్రరిజం వేళ్ళూనుకుని, విస్తరిస్తోంది. ఈ టెర్రరిజాన్ని అంతం చేయడంలో కఠినంగా వ్యవహరించకపోతే, ఆ విపరిణామాలను అనుభవించాల్సిన ఆగత్యం తప్పదు. మతోన్మాద రాజకీయాలను బీజేపీ ప్రోత్సహిస్తోందన్న విమర్శలెలా ఉన్నా, ఇస్లామిక్‌ ఉగ్రవాదాన్ని అంతకంటే కూడా ఖండించాలి. ఉగ్రవాద నిర్మూలనకు నడుం బిగించాలి. అమాయకుల ప్రాణాలు ఇంకా బలి కాకూడదు. అంటే ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను అణచివేయడంలో ప్రపంచమంతా ఏకం కావాల్సి ఉంది. CAST|RELIGION|POLITICS

ప్రపంచంలో వినియోగాలు, ఉత్పత్తులు, అవసరాలు, మారుతున్నాయి. ఏ దేశం కూడా ఇతర దేశాలపై ఆధారపడకుండా, స్వతంత్రంగా మనగలిగే పరిస్థితులు లేవు. అన్ని దేశాలు రకరకాల సమస్యలతో పోరాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలో అంటరానిది లేదు. ఏ వస్తువుకు, అవసరానికి మతం, కులం, వర్గం, ప్రాంతం, దేశం లేదు. అన్నీ అందరికీ సమానమైనవిగానే భావించాల్సి ఉంది. నిజానికి ప్రజల్లో కుల, మత, వర్గ వైషమ్యాల తీవ్రత అంతగా లేదు. కానీ, రాజకీయ పార్టీల వల్లే అవి పెచ్చరిల్లుతున్నాయి. రెచ్చగొట్టడం, ఓట్లను కొల్లగొట్టడమనే నినాదాలతో, సిద్ధాంతాలతో, రాజకీయ పార్టీలు రాజ్యమేలుతున్నాయి. ప్రజలని ఆయా కుల, మత, ప్రాంత, వర్గాలుగా విడదీసి రాజకీయ పార్టీలు, అధికారాన్ని, ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. కలసిమెలసి జీవించే ప్రజా జీవితాల్లో ఆజ్యం పోయకుండా, అన్ని రాజకీయ పార్టీలు ప్రజల ఎజెండాతో ముందుకు సాగాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. CAST|RELIGION|POLITICS

Latest News

ప్లాస్టిక్ టబ్బే వాష్ బేసిన్!?|ADUGU TRENDS

తెలివుండాలె. ఇగ గదే ఉంటే ఎన్ని ఉపాయాలైనా శేయొచ్చు. గట్లనే గీ తమ్ముడు మంచి పాయమే శేసిండు. ప్లాస్టిక్ టబ్బును వాష్ బేసిన్ శేసిండు. కర్సు తక్కువల గదెట్ల శేసిండో మనమూ సూద్దామానుల్లా? ఒక...

విజయాలు సరే, జన జీవన ప్రమాణాలేంటి!|EDITORIAL

ఎన్నికలు కేవలం అధికార మార్పిడికి ప్రక్రియ మాత్రమే కాదు. అవి ప్రజల ఆశలు, ఆకాంక్షలు, సంతృప్తులు, అసంతృప్తుల ప్రతిబింబం. దేశంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే, దేశవ్యాప్తంగా ఓటర్లు స్పష్టంగా...

06-05-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి పూర్తిగా రోజంత నక్షత్రం మూల మధ్యాహ్నం 01.04 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ద రాత్రి 10.40 వరకు ఉపరి సాధ్య కరణం కౌలవ సాయంత్రం 05.36 వరకు ఉపరి...

మార్పు… తీర్పు!|ELECTIONS|5 STATES|RESULTS

బెంగాల్ లో కమల ప్రభజనం|WEST BENGAL తమిళనాట దళపతి సంచలనం|TAMILNADU కేరళలో యూడీఎఫ్|KERALAM అసోంలో బీజేపీ హ్యాట్రిక్|ASSAM పుదుచ్చేరిలో కమలం|PUDUCHERRY ఓడిపోయిన మమత, స్టాలిన్|MAMATHA BENARJEE|STALIN పరువునిలుపుకున్న విజయన్|VIJAYAN ‘దళపతి’తో ‘సోపతి’ ఎవరు?|THALALPATHY VIJAY నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ?|TELANGANA ఐదు రాష్టాల ఎన్నికల ఫలితాలు బిజెపికి...

తమిళనాట కొత్త చరిత|TAMILANADU|TVK PARTY

ద్రవిడ పార్టీలకు చరమగీతం అనూహ్యంగా దళపతి విజయం|THALAPATHY VIJAY స్టాలిన్ కు ఘోర పరాజయం|STALIN ప్రభావం చూపని బీజేపీ నేతలు|BJP LEADERS తమిళనాట కొత్త చరిత్ర ఆవిష్కృతమయ్యింది. అనూహ్యంగా దూసుకు వచ్చిన నటుడు విజయ్ పార్టీ తమిళనాట జెండా...

గదేం సూకిల్? గిదేం మాయ!?|ADUGU TRENDS

అవునుల్లా..! గీ సైకిల్ ను తొక్కేటోడు కంటికి కనిపించడు. కనీ, గా సైకిల్ మాత్రం రోడ్ల మీద పోతనే ఉంటది. ఇగ గిది సూసినోల్లు.. గిదేం సిత్రమని నోల్లు ఎల్లబెడతాండ్రు. గీ ముచ్చట...

మార్పుకై ప్రజల తీర్పు!|EDITORIAL

భారత రాజకీయాల్లో ప్రతి అసెంబ్లీ ఎన్నిక జాతీయ ఎన్నికలపై ప్రభావం చూపేదే. దేశ రాజకీయాలను మలుపు తిప్పేవే. సంకీర్ణ దశ నడుస్తున్న ప్రస్తుత దశలో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నది. గత కొన్ని...

05-05-2026 మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం సంకట హరచతుర్థి తిధి బ చవితి రాత్రి తెల్ల 04.40 వరకు ఉపరి పంచమి నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 10.29 వరకు ఉపరి మూల యోగం శివ రాత్రి 10.06 వరకు ఉపరి సిద్ద కరణం...

04-05-2026 సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 02.36 వరకు ఉపరి చవితి నక్షత్రం అనూరాధ ఉదయం 07.51 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం పరిఘ రాత్రి 09.26 వరకు ఉపరి శివ కరణం వణజి మధ్యాహ్నం...

ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనం|ARYAVAISHYA MAHASABHA|ANDHRA

ఆర్యవైశ్య మహాసభ అట్టర్ ప్లాప్ తెలంగాణ నేతల బహిష్కరణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నేత మిడిదుడ్డి శ్యామ్ సుందర్ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనమే కొనసాగుతోందని, తెలంగాణ వైశ్యనేతలు దూరంగా ఉండటమే ఇందుకు కారణమని రాష్ట్ర...

గా ప్లాస్టిక్ పైపులతోటి ఇంటికప్పు!?|ADUGU TRENDS

ఎవలైనా గూన పెంకలు, బెంగుళూరు పెంకలతోటో, రేకులతోటో, సిమిటి కాంక్రీటుతోటో ఇంటికి పై కప్పేత్తరు. కానీ, గీ అన్న ఏకంగా ప్లాస్టిక్ పైపులతోటే ఇంటికప్పేసిండు. గీయనకు పై కప్పుల్లో పపంచ కప్పే ఇయ్యాలె...

అప్పుల ఊబీలోకి దేశం, రాష్ట్రాలు!|EDITORIAL

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సంక్షేమ పథకాల విస్తరణ, పెరుగుతున్న అప్పులు, ఆదాయ వనరుల పరిమితి, దుబారా ఖర్చులు, ఖర్చుల ప్రాధాన్యతా లోపాలు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News