Saturday, September 19, 2026
23.7 C
Hyderabad

పకడ్బందీగా వల్మీడి జాతర ఏర్పాట్లు

సమీక్షించిన ఎమ్మెల్యే యశస్విని

వల్మీడి జాతర ఏర్పాట్లు పకడ్బందీగా జరగాలని, భక్తులు సంతృప్తిగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకునేలా చర్యలు తీసుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆదేశించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం, వల్మీడి లో ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి జాతర బ్రహ్మోత్సవాలపై అన్ని శాఖల అధికారులతో దేవస్థాన ప్రాంగణంలో ఆర్డీఓ డి.ఎస్ వెంకన్న, డిపిఓ నాగపురి స్వరూప తో కలిసి సమీక్ష నిర్వహించారు.

2025 ఏప్రిల్ 2 నుండి 12వ తేదీ వరకు నిర్వహించనున్న వల్మీడి జాతర లో 6వ తేదీన నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం ఒక్కరోజే 50 వేల మంది భక్తులు సందర్శించుకునే ఈ జాతరకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పక్కగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వల్మీడి జాతర పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఆటంకం కలగకుండా జాతర ఏర్పాట్లు చేయలన్నారు. జాతర 10 రోజుల పాటు జరుగుతుందని, ఈ జాతరకు జనగామ జిల్లా భారీ ఎత్తున భక్తులు తరలి వస్తారని ఆమె తెలిపారు.

అదనపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి, ఎలాంటి అంతరాయాలు లేని నిరంతర విద్యుత్, మిషన్ భగీరథ కు తోడుగా అదనపు ట్యాంకర్లు, బోరు బావులకు జనరేటర్లు అమర్చి ఆటంకాలు లేని విధంగా నీటి సరఫరా జరిగే విధంగా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అంబులెన్స్ సహా ఫైర్ ఇంజన్ వంటి సదుపాయాలను అందుబాటులో ఉంచాలి. రోడ్ల మరమ్మతులు, రోడ్లకు ఇరువైపులా పెరిగిన చెట్ల కొమ్మల నరికివేత, లైటింగ్ అండ్ డెకరేషన్, పారిశుధ్యం, ప్రచారం, సీసీ కెమెరాలు ఏర్పాటు, పనిచేయడానికి వచ్చే సిబ్బందికి భోజనం వసతులు, వీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు, శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన సిబ్బంది ఏర్పాటు వంటి అనేక అంశాలపై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో డీపీఓ నాగపూరి స్వరూప, ఆర్డీఓ డి ఎస్ వెంకన్న, సీఐ మహేందర్ రెడ్డి, ఎమ్మార్వో శ్రీనివాస్, ఈఓ మోహన్ బాబు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News