తెలంగాణలోని రైతులకు శుభవార్త. రైతు భరోసా నిధుల తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మరో విడత విడుదల చేసింది. 2 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు ఒక్కొక్కరికి రూ.6,000 చొప్పున మొత్తం 8.65 లక్షల మందికి రూ.707.54 కోట్లు ఖాతాల్లో జమ చేసింది. ఇప్పటికే ఎకరం పొలం ఉన్న 17 లక్షల మంది రైతులకు రూ.557 కోట్లు, అలాగే 557 పైలట్ గ్రామాలకు చెందిన వారికి రూ.568 కోట్లు జమ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు మొత్తం 30.11 లక్షల మంది రైతులకు రూ.1834.09 కోట్లు విడుదలైనట్లు ప్రభుత్వం తెలిపింది.

