తెలంగాణ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (నవీన్ కుమార్)పై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మల్లన్న తన హద్దులు మరిచి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
అదేవిధంగా, నల్గొండలో మల్లన్నను గెలిపించేందుకు భారీగా డబ్బులు ఖర్చు చేశామంటూ అనిల్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అనుచితమని పేర్కొంటూ, పార్టీ దీనిపై త్వరలో చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

