హైదరాబాద్, ఉప్పల్, చిలుకానగర్‌లో వరకట్న వేధింపులు తట్టుకోలేక రవళి (25) అనే గృహిణి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గుండాల మండలం సీతారాంపురానికి చెందిన రవళి, మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామానికి చెందిన బోరెడ్డి రాజశేఖర్ రెడ్డితో 2019లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొంతకాలం పటాంచేరు లో నివసించిన దంపతులు, అనంతరం ఉప్పల్‌లో స్థిరపడ్డారు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం, భర్త కుటుంబం నుంచి తరచుగా వస్తున్న వేధింపులను తట్టుకోలేక రవళి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

