తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియలో అపశృతి చోటుచేసుకుంది. టోకెన్ల కోసం పోటెత్తిన భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి, సేలంకు చెందిన మహిళా భక్తురాలు మరణించారు. ఈ విషాదకర ఘటన భక్తుల హడావిడితో ఏర్పడిన తోపులాటలో చోటుచేసుకుంది. వైకుంఠ ఏకాదశి ప్రత్యేక దర్శనం టోకెన్ల కోసం అలిపిరి, శ్రీనివాసం, సత్యనారాయణపురం, పద్మావతిపురం లాంటి ప్రాంతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.
టోకెన్ల జారీ రేపు తెల్లవారుజాము నుంచి ప్రారంభమవుతుందన్న సమాచారం కారణంగా భక్తులు సాయంత్రం నుంచే క్యూలైన్లలో నిలిచారు. అయితే భారీ సంఖ్యలో భక్తులు రావడంతో క్యూలైన్లలో తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు విచారణకు ఆదేశించారు. భక్తులు శాంతియుతంగా సమన్వయంతో వ్యవహరించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ వెల్లడించింది
.

