బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అదనపు సమాచారం అందించేందుకు సంబంధిత డాక్యుమెంట్లతో విచారణకు హాజరుకావాలని కోరింది. ఈడీ చర్యలపై రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

