Tuesday, July 28, 2026
23.4 C
Hyderabad

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే ఒక కుంభకోణం ముగిసేలోపే మరో కుంభకోణం వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఆర్థిక మోసాలకు నిజమైన అడ్డుకట్ట కఠిన చట్టాలు మాత్రమే కాదు. వాటి నిష్పాక్షిక అమలే ముఖ్యం.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్ 

దేశంలో ఆర్థిక నేరాలు, కార్పొరేట్ కుంభకోణాలు, బ్యాంకింగ్ మోసాలు, పెట్టుబడిదారుల మోసాలు రాను రాను మితిమీరుతున్నాయి. వాటి కట్టడికి తీసుకుంటున్న చర్యలెన్నీ తీసుకున్నా, అంతకు మించి ఆర్థిక నేరాలు అనేక కొత్త కోణాల్లో వెలుగు చూస్తున్నాయి. ఇటీవలి ఘటనలు చూస్తే వ్యవస్థలోని లోపాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నవారి అవినీతి ఒకవైపు, కార్పొరేట్ సంస్థల ఆర్థిక అక్రమాలు మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. మోసాలు జరిగిన తర్వాత దర్యాప్తులు ప్రారంభమవుతున్నప్పటికీ, వాటిని ముందుగానే గుర్తించి అడ్డుకునే వ్యవస్థ మాత్రం ఇంకా బలపడలేదు.

దేశంలో గత రెండు దశాబ్దాలుగా అనేక భారీ ఆర్థిక కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. విజయ్ మాల్యా కేసులో బ్యాంకులకు రూ.9 వేల కోట్లకు పైగా బకాయిలు మిగిలాయి. నీరవ్ మోడీ–పంజాబ్ నేషనల్ బ్యాంకు మోసం రూ.13 వేల కోట్ల మేర జరిగింది. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీపై ఆర్థిక అక్రమాల ఆరోపణలు వచ్చాయి. సహారా ఇండియా కేసులో లక్షలాది మంది చిన్న పెట్టుబడిదారులు తమ పొదుపులను కోల్పోయారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ కుంభకోణం లక్షలాది కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీసింది. ఇటీవల మైక్రో ఫైనాన్స్ సంస్థల అక్రమాలు, చిట్‌ఫండ్ మోసాలు, ఆన్‌లైన్ పెట్టుబడి మోసాలు కూడా పెరుగుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరుకు చెందిన బంగారం, ఆభరణాల దిగ్గజ సంస్థ రాజేష్ ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్ వ్యవహారం దేశ కార్పొరేట్ రంగాన్ని కుదిపేసింది. సంస్థ తన ఆదాయాన్ని భారీగా అధికంగా చూపించి, పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించిందనే ఆరోపణలపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తు చేపట్టింది. ఒక సాధారణ పెట్టుబడిదారుడి ఫిర్యాదుతో ప్రారంభమైన ఈ విచారణలో కంపెనీ ఆర్థిక లెక్కల్లో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నట్లు బయటపడింది. కంపెనీ యాజమాన్యం పలుమార్లు నోటీసులు ఇచ్చినా పూర్తి సహకారం అందించకపోవడం అనుమానాలను మరింత పెంచింది.

ఇది దేశంలో జరిగిన తొలి కార్పొరేట్ స్కాం కాదు. 2009లో సత్యం కంప్యూటర్స్ కుంభకోణం దేశాన్ని కుదిపేసింది. కంపెనీ ఖాతాల్లో రూ.7,800 కోట్ల మేర తప్పుడు లెక్కలు చూపించినట్లు బయటపడింది. చివరకు సంస్థ వ్యవస్థాపకుడు బి. రామలింగరాజుకు శిక్ష పడింది. ఆ ఘటన తర్వాత కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు మెరుగుపడతాయని భావించినా, ఇప్పటికీ ఇటువంటి ఘటనలు పునరావృతమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

కార్పొరేట్ రంగంలో మోసాలలో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఆదాయాన్ని అధికంగా చూపించడం, అప్పులను దాచిపెట్టడం, అనుబంధ షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు, తప్పుడు ఆడిట్ నివేదికలు, షేర్ విలువలను కృత్రిమంగా పెంచడం వంటి పద్ధతులు తరచూ కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఏర్పాటు చేసిన షెల్ కంపెనీలు ఈ అక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. నియంత్రణ వ్యవస్థల కళ్లుగప్పి నిధులను తరలించడం, లెక్కలను మార్చడం ద్వారా వేల కోట్ల రూపాయల మోసాలు జరుగుతున్నాయి.

అయితే, ఈ అక్రమాలను ముందుగానే ఎందుకు గుర్తించలేకపోతున్నారు? దేశంలో సెబీ, రిజర్వ్ బ్యాంక్, ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ వంటి పలు సంస్థలు ఉన్నప్పటికీ, అనేక సందర్భాల్లో అవి స్పందించేది మోసం బయటపడిన తర్వాతే. పర్యవేక్షణ వ్యవస్థలు ముందస్తు హెచ్చరికలను గుర్తించడంలో విఫలమవుతున్నాయి. ఫలితంగా చిన్న పెట్టుబడిదారులు, బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

భారతదేశంలో నమోదవుతున్న ఆర్థిక నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. జాతీయ నేర గణాంకాల ప్రకారం ప్రతి ఏడాది వేలాది ఆర్థిక మోసాల కేసులు నమోదవుతున్నాయి. సైబర్ మోసాలతో పాటు పెట్టుబడి మోసాలు, బ్యాంకు రుణాల ఎగవేతలు, చిట్‌ఫండ్ మోసాలు పెరుగుతున్నాయి. అయితే నేరస్థులకు త్వరితగతిన శిక్షలు పడకపోవడం వల్ల నిరోధక ప్రభావం కనిపించడం లేదు.

ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే కొన్ని కీలక చర్యలు తప్పనిసరి. నియంత్రణ సంస్థలకు పూర్తి స్వతంత్రత, సాంకేతిక సామర్థ్యాలు కల్పించాలి. కార్పొరేట్ సంస్థల ఆడిటింగ్ వ్యవస్థను మరింత కఠినతరం చేయాలి. పెట్టుబడిదారుల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించే వ్యవస్థ ఉండాలి. షెల్ కంపెనీలపై కఠిన నిఘా అవసరం. భారీ ఆర్థిక నేరాలకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి త్వరితగతిన తీర్పులు ఇవ్వాలి.

దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలబడాలంటే కేవలం చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే ఒక కుంభకోణం ముగిసేలోపే మరో కుంభకోణం వెలుగులోకి వచ్చే పరిస్థితి కొనసాగుతూనే ఉంటుంది. ఆర్థిక మోసాలకు నిజమైన అడ్డుకట్ట కఠిన చట్టాలు మాత్రమే కాదు. వాటి నిష్పాక్షిక అమలే ముఖ్యం.

Latest News

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

జూలై 27, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి త్రయోదశి మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం మూల ఉదయం 11.00 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం వైధృతి రాత్రి 12.18 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి...

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News