Sunday, June 28, 2026
23.8 C
Hyderabad

భారత భద్రత, భవితవ్యం భవ్యమేనా!?|EDITORIAL

ఒక దేశంగా భారత్ భద్రమేనా? భారత్ భవితవ్యం భవ్యంగా ఉన్నట్లేనా? దేశ విచ్ఛిన్నమే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. మరి దేశాన్ని మతపరంగా విభజించే కుట్రలేమైనా సాగుతున్నాయా? మన పక్కనే ఉన్న పాక్ పక్కలో బల్లెంలా తయారైంది. స్వాతంత్ర్య భిక్ష పెట్టిన భారత్ పైనే బంగ్లాదేశ్ కయ్యానికి కాలుదువ్వుతోంది. తాజాగా డిల్లీ బాంబు పేలళ్ళ కుట్ర టర్కీ నుంచి జరిగింది. ఫరీదాబాద్ ఉగ్ర కార్యకళాపాలకు వేదికైంది. దేశంలో ఢిల్లీ సహా హైదరాబాద్, బెంగళూరు, కశ్మీర్ అనేక నగరాల్లో ఉగ్రమూలాలు వెల్లడవుతున్నాయి. మైనార్టీ యూనివర్సిటీలు ఉగ్రవాదుల తయారీ కేంద్రాలవుతున్నాయి. ప్రాణాలు పోసే వైద్య విద్యనభ్యసించిన వాళ్ళే ప్రాణాలు తీసే మానవ బాంబర్లవుతుంటే దేశం ఎటుపోతోంది? మనిషి ప్రయాణం ఎటు సాగుతోంది? మతం మానవత్వాన్ని మింగేస్తోందా? సర్వమానవ హితం, సర్వమానవ హతంగా మారుతోందా? ఏమైపోతోంది మన భారతదేశం?

మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్ 

ఒక దేశంగా భారత్ భద్రమేనా? భారత్ భవితవ్యం భవ్యంగా ఉన్నట్లేనా? దేశ విచ్ఛిన్నమే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. మరి దేశాన్ని మతపరంగా విభజించే కుట్రలేమైనా సాగుతున్నాయా? మన పక్కనే ఉన్న పాక్ పక్కలో బల్లెంలా తయారైంది. స్వాతంత్ర్య భిక్ష పెట్టిన భారత్ పైనే బంగ్లాదేశ్ కయ్యానికి కాలుదువ్వుతోంది. తాజాగా డిల్లీ బాంబు పేలళ్ళ కుట్ర టర్కీ నుంచి జరిగింది. ఫరీదాబాద్ ఉగ్ర కార్యకళాపాలకు వేదికైంది. దేశంలో ఢిల్లీ సహా హైదరాబాద్, బెంగళూరు, కశ్మీర్ అనేక నగరాల్లో ఉగ్రమూలాలు వెల్లడవుతున్నాయి. మైనార్టీ యూనివర్సిటీలు ఉగ్రవాదుల తయారీ కేంద్రాలవుతున్నాయి. ప్రాణాలు పోసే వైద్య విద్యనభ్యసించిన వాళ్ళే ప్రాణాలు తీసే మానవ బాంబర్లవుతుంటే దేశం ఎటుపోతోంది? మనిషి ప్రయాణం ఎటు సాగుతోంది? మతం మానవత్వాన్ని మింగేస్తోందా? సర్వమానవ హితం, సర్వమానవ హతంగా మారుతోందా? ఏమైపోతోంది మన భారతదేశం?

దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో బాంబులు పేలి 13 మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది క్షతగాత్రులు కావడం అత్యంత విషాదకరం. ఈ ఒక్క ఘటన అనేక కుట్రలను వెలుగులోకి తెస్తున్నది. భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలు మారణహోమానికి తెగిస్తున్నాయన్నది తేలిపోయింది. నీరు, ఆహార పదార్థాల్లో విషం కలిపి చంపాలని కుట్రలు చేసిన తీరు విస్మయం కలిగించకమానదు. దర్యాప్తు సంస్థలు కూపీ లాగుతున్నాకొద్ది అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. అఖండ భారత్‌ నుంచి విడివడ్డ పాక్‌, బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మతం ముసుగులో మారణహోమం చేయాలనుకున్న వారిని ఏరిపారుయడం వినా మరో మార్గం లేదు.
ఢిల్లీ పేలుళ్ల కుట్రలను ఛేదించి, శోధించిన కొద్దీ ఉగ్ర కుట్రలనేకం వెల్లడవుతున్నాయి. తుర్కియేలోని ’ఉకాసా’ అనే హ్యాండ్లర్‌తో ఈ మాడ్యూల్‌ టచ్‌లో ఉన్నట్లు నిఘా వర్గాలు కనుగొన్నాయి. ఉకాసా అంటే అరబిక్‌లో స్పైడర్‌. ఫరీదాబాద్‌ మాడ్యుల్‌, ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌తో పాటు అన్సర్‌ ఘజ్‌వత్‌ ఉల్‌ హింద్‌ అనే సంస్థల నిర్వాహకులకు ఉకాసాతో ప్రత్యక్ష సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో డాక్టర్‌ ఉమర్‌తో పాటు అతడి సహచరులు ఈ ఉకాసా హ్యాండ్లర్‌తో సంభాషించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. డాక్టర్‌ ఉమర్‌ తో సహా పలువురు 2022లో తుర్కియేలో పర్యటించినట్లు అధికారులు గుర్తించారు. అంకారాలో వారు రెండు వారాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ హ్యాండ్లర్‌ కూడా అంకారాలో ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచే ఈ గ్రూప్‌ను నడపడంతో పాటు వారికి నిధులు కూడా సమకూర్చినట్లు భావిస్తున్నారు. భారత్‌లో బహుళ పేలుళ్లకు రూపొందించిన మాడ్యూల్‌ ప్రణాళిక వెనుక ఉకాసా కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. హ్యాండ్లర్లతో చర్చించేటప్పుడు నిఘా వర్గాలకు దొరకకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మాడ్యూల్‌ వెనుక ఓ విదేశీ గ్రూప్‌ పనిచేస్తుందని స్పష్టంగా తెలుస్తోందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. ఈ నెట్‌వర్క్‌ కార్యకలాపాల గురించి పూర్తిగా తెలుసుకునేందుకు నిందితులు చేసిన చాట్‌, కాల్‌ హిస్టరీలను అధికారులు ఛేదిస్తున్నారు. ఉకాసా ను గుర్తించడంతో పాటు అతడికి పాక్‌ ఉగ్రవాద నిర్వాహకులతో ఉన్న సంబంధాల గురించి తెలుసు కునేందుకు విదేశీ నిఘా సంస్థల సహకారం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా నాలుగు కీలక ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరపాలని నిందితులు ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఒక కొత్త, మరో రెండు పాత కార్లను కూడా సిద్ధం చేయాలని వారు ప్లాన్‌ చేసినట్లు సమాచారం. ఇందులో ఐ20 కారులోనే ఎర్రకోట వద్ద పేలుడు జరగ్గా.. ఎకోస్పోర్ట్‌ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా రెండు కార్ల కోసం అన్వేషణ కొనసాగుతోంది.

ఈ ప్లాన్‌ను అమలు చేసేందుకు 8 మందిని సిద్ధం చేసినట్లు వారి డైరీల సమాచారంతో అధికారులు గుర్తించారు. ఒక్కో ప్రాంతానికి ఇద్దరు చొప్పున వెళ్లి పేలుళ్లు జరపాలని వీరు పన్నాగం. ఈ ఎనిమిది మందిలో ఉమర్‌, ముజమ్మిల్‌తో పాటు డాక్టర్‌ అదిల్‌, డాక్టర్‌ షాహీన్‌ కూడా ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. దిల్లీ పేలుడు ఘటన పై దర్యాప్తు చేపట్టిన అధికారులు హరియాణాలోని ఫరీదాబాద్‌లో గల అల్‌ ఫలా యూనివర్సిటీని జల్లెడ పడుతున్నారు. ఇక్కడి మెడికల్‌ కాలేజీలోని బాయ్స్‌ హాస్టల్‌ లోని 17వ నంబర్ భవనం ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
ఇజ్రాయెల్‌ తదితర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున మారణహోమం జరిగింది. ఇప్పుడు భారత్‌లో వారు ఆడిన ఆటలు సాగకపోవడం వల్లే ఈ దాడులకు తెగిస్తున్నారు. కశ్మీర్‌లో నెలకొన్న ప్రశాంతను చెదరగొట్టారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా అలాగే చేయాలనుకుంటున్నారు.

దేశంలో అక్రమ వలసల నివారణకు గట్టి చర్యలేమీలేవు. పైగా అలాంటి వారికి ఓటర్, గుర్తింపులు అలవోకగా లభిస్తున్నాయి. దేశం వీడి వెళ్లే, వచ్చే వాళ్ళపై తగిన నిఘా లేదు. విదేశీ సరిహద్దులు దాటి మన దేశంలోనే ఉగ్రమూలాలు వేళ్ళూనుకుంటుంటే అరికట్టే విధానాలేవీ లేవు. నిఘా వర్గాలు విఫలమైనప్పుడల్లా ఢిల్లీ పేలుడు లాంటి ఘటనలు సంభవిస్తూనే ఉన్నాయి. అప్పుడే అప్రమత్తత. ఆతర్వాత మళ్ళీ ఘటన జరిగేదాకా మొద్దు నిద్ర. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంలో రక్షణ, భద్రతపై కఠిన నియమ నిబంధనలు తప్పనిసరి. అందుకు తగిన విధి విధానాలు రూపొందించి అమలు చేయాలి. ప్రపంచానికి శాంతిని నేర్పిన దేశంలో అశాంతి రగలకుండా చూడాల్సిన బాధ్యత పాలకులది. అందుకు సంపూర్ణ సహకారం అందించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలది, ప్రజలది.

Latest News

దంటగాడు!?|ADUGU TRENDS

రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులకంటే గూడా దంటగాల్లే ఎక్కువ అంటరు. ఎవలికీ శెప్పుకోలేనివి గా దంటగాల్లకు శెప్పుకుంటరు. గవాల్లు గూడా బాగా సూసుకుంటరు. నీ గురించి అన్నీ తెలిసి కూడా నిన్ను ప్రేమించేవాడు,...

ప్రశ్నార్థకంగా ప్రశ్నించే సంస్కృతి!?|EDITORIAL

అధికారాన్ని నియంత్రించేది చట్టం. చట్టాన్ని సజీవంగా ఉంచేది ప్రజల అప్రమత్తత. ఈ రెండింటి మధ్య వంతెనగా నిలిచేది ప్రశ్నించే సంస్కృతి. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అన్యాయం జరగడం కాదు. అన్యాయం జరిగినా సమాజం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 28 నుండి జూలై 04 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే...

ఆఖరి మజిలీ అదే!?|ADUGU TRENDS

స్టీవెన్ స్పీల్ బర్గ్ తీసిన ‘ది టర్నినల్’ సినిమా చూసిండ్రా? గా సినిమాకు అసల్ కథ గీయినదే! మనిసి మనుగడ, జీవిత మజిలీలకు గీయినె జీవితమే ఉదాహరణ. గందుకే గా స్పీల్ బర్గ్...

వెనెజువెలా ప్రపంచానికి హెచ్చరిక!?|EDITORIAL

వెనెజువెలా విషాదం ప్రపంచానికి మరో కీలక సందేశాన్ని అందిస్తోంది. ప్రకృతి విపత్తులను ఆపలేకపోయినా, శాస్త్రీయ ప్రణాళిక, భూకంప నిరోధక నిర్మాణాలు, విపత్తు నిర్వహణలో సాంకేతికత వినియోగం, ప్రజల్లో అవగాహన, అంతర్జాతీయ సహకారంతో ప్రాణనష్టాన్ని...

జూన్ 27, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 12.14 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం అనురాధ రాత్రి 10.29 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సాధ్య మధ్యాహ్నం 01.38 వరకు ఉపరి శుభ కరణం కౌలవ ఉదయం 11.20...

మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!!|ADUGU TRENDS

గంజి నీల్లు తాగినోడు మట్టిలోనే..! బెంజి కార్ల తిరిగినోడు మట్టిలోనే..!! మనతో తెచ్చిందేమీ లేదు. తీసుకపోయేదేమీ లేదు. మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!! గీ సూత్రం తెలిసినోల్లు గీ భూమ్మీద మనుసుల్లెక్క...

చమురుకు చలువ పరిణామాలు!?|EDITORIAL

ఇరాన్‌తో చమురు వాణిజ్యానికి మళ్లీ అవకాశం కనిపించడం భారత్‌కు సానుకూల పరిణామమే. చమురు ధరల తగ్గుదల, హర్ముజ్ మార్గంలో స్థిరత్వం, ఇంధన సరఫరా భద్రత వంటి అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊరటనివ్వగలవు....

జూన్ 26, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 10.26 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రాత్రి 08.07 వరకు ఉపరి అనురాధ యోగం సిద్ద మధ్యాహ్నం 01.15 వరకు ఉపరి సాధ్య కరణం బవ ఉదయం 09.43...

శెట్టా? పెద్ద.. ఛెత్రా?!|ADUGU TRENDS

మనిసిది పక్రుతితో యిడదీయరాని సంబంధం. మనిసే కాదు, పతి పాణి మనుగడే శెట్లతోటే ముడిపడి ఉంది. గాలి, నీడ, ప్రాణవాయువు ఆక్సీజన్ మొదలు పంచ భూతాల దాకా శెట్టుకు-మనిసికి లెంకే. మనం తినేవన్నీ...

అయ్యో..రామయ్యా! ఇదేం గోలయ్యా?|EDITORIAL

అయోధ్య రామాలయాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మాత్రమే చూడలేం. అది కోట్లాది మంది హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక. ఆ పవిత్ర స్థలంలో నిధుల దుర్వినియోగం జరిగిందనే అనుమానమే భక్తులను కలచివేస్తోంది. అందుకే ఈ...

జూన్ 25, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం నిర్జల ఏకాదశి తిధి శు ఏకాదశి రాత్రి 08.59 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం స్వాతి సాయంత్రం 06.03 వరకు ఉపరి విశాఖ యోగం శివ మధ్యాహ్నం 01.09 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News