Friday, April 17, 2026
31.2 C
Hyderabad

Russia|రష్యాలో భారీ earthquake|భూకంపం..

Hawai|హవాయి, Japan|జపాన్‌, China|చైనాలకు సునామీ హెచ్చరికలు

రాష్ట్రాలన్నీ భయాందోళనతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు

రష్యాలోని తూర్పు ప్రాంతం కామ్చాట్కా ద్వీపకల్పంలో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం వల్ల సముద్రంలో విపరీతమైన అలలు ఏర్పడి సునామీగా మారాయి. దీంతో రష్యా తీర ప్రాంతాలతోపాటు, జపాన్‌, చైనా, అమెరికాకు చెందిన హవాయి రాష్ట్రంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. భారీ అలలు పలు ద్వీపాలను ముంచెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు సునామీ ముప్పు పొంచి ఉంది. రష్యా ప్రభుత్వం తక్షణమే అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇప్పటికే కొన్ని దీవుల్లో వరదలు వచ్చాయి. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. రష్యా తీర ప్రాంతాల్లోని ప్రజలను అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఇక జపాన్ తీర ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఉత్కంఠ కలిగిస్తోంది. అక్కడి అధికార యంత్రాంగం సుమారు 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టింది. సముద్రతీరాన్ని ఆనుకొని ఉన్న నివాసాలపై ముప్పు ఎక్కువగా ఉన్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు, చైనా తూర్పు తీరానికి కూడా ఈ ప్రకృతి విపత్తు ముప్పు పొంచి ఉంది. షాంఘైలోని 28 వేల మందిని ముందస్తుగా తక్షణమే తరలించారు. అంతేగాకుండా, సైక్లోన్ కూడా దూసుకొస్తుండటంతో జాతీయ స్థాయిలో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో తూర్పు చైనా అతలాకుతలమవుతోంది. ప్రయాణాలన్నీ నిలిచిపోయాయి. విమానాలు, బోటు సర్వీసులు రద్దయ్యాయి.

హవాయి రాష్ట్రంలో కూడా భూకంపం భారీ కలకలం రేపింది. అమెరికా వాతావరణ విభాగం రాష్ట్రానికి సునామీ హెచ్చరికను జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో సునామీ అలలు ఆరు అడుగుల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. రాష్ట్రం మొత్తానికి సునామీ సైరన్లు వినిపించాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురై తమ నివాసాలను వదిలి ఎత్తైన ప్రాంతాలకు తరలిపోతున్నారు. పర్యాటకులు, స్థానికులు అంతా తప్పించుకునే యత్నంలో రోడ్డెక్కారు. దీంతో రోడ్లన్నీ ప్రజలతో నిండి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారాయి.

అమెరికా వాతావరణ శాఖ కీలక హెచ్చరికను జారీ చేసింది. సునామీని తక్కువ అంచనా వేయొద్దని, ఫొటోలు తీసుకోవడానికి తీర ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలను హెచ్చరించింది. ఒక్క అలతో సునామీ రాదని, వరుసగా పెద్ద అలలతో వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. సముద్రపు నీరు పెద్ద మొత్తంలో తీరానికి ప్రవహించడంతో ప్రాణ నష్టం సంభవించే ప్రమాదముందని పేర్కొంది. భూకంపం వల్ల సముద్ర మట్టంలో మార్పు రావడంతో భారీగా అలలు ఏర్పడి తీర ప్రాంతాలపై విరుచుకుపడుతున్నాయని, తద్వారా పలు దేశాల్లో వరదలు సంభవించే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించింది. ఈ ప్రకృతి విపత్తు ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దీవులు, తీర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉండగా, అధికార యంత్రాంగాలు యుద్ధప్రాతిపదికన ప్రజలను తరలిస్తున్నారు.

Latest News

భయమా? వ్యూహమా?|PARLIAMENT|Delimitation bill|TEJASWI SURYA|BJP|NARENDRA MODI

పాగాకై పాకులాటా? కస్సుమన్న కాంగ్రెస్!|CONGRESS భగ్గుమన్న బీఆర్ఎస్!!|BRS ఆత్మరక్షణలో బీజేపీ!!!|BJP వివాదానికి నేపథ్యమేంటి? ఇప్పుడు సూర్య, గతంలో మోదీ! చారిత్రక అంశాల వక్రీకరణా? రాజకీయ మైలేజీ వ్యూహమా? కాంగ్రెస్‌ను టార్గెట్ చేయడమా? పునర్విభజన - దక్షిణాది భయమా? లోక్‌సభలో పునర్విభజన బిల్లుపై చర్చను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...

శింతపండు పురుగుపట్టది! నల్లబడది!!|ADUGU TRENDS

ఇగో గీ శింతపండు లేకపోతే ఎవ్వలికీ ఎల్లది. పప్పుశారు, సేప పులుసు, అంటుపులుసు, ఒట్టి సేపల పులుసు, దప్పడం, అన్ని తొక్కుల్ల ఏసుడే కాదు, ఆఖరికి శింతపండు తొక్కు కూడ శేసుకొని తింటం....

చట్టసభలు అ (కొ) 0దరి కోసమేనా!?|EDITORIAL

భారతదేశం వంటి 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో కొందరే పదే పదే చట్టసభల్లో కొనసాగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. కొత్త ఆలోచనలు, కొత్త నాయకత్వం రావాలంటే వ్యవస్థలో మార్పులు అవసరం. మహిళల...

17-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అమావాస్య సాయంత్రం 05.25 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం రేవతి మధ్యాహ్నం 11.55 వరకు ఉపరి అశ్విని యోగం వైధృతి ఉదయం 07.10 వరకు ఉపరి విష్కమ్భ కరణం చతుస్పాద ఉదయం 06.15...

గిట్ల శేత్తే గా కుండల నీల్లు ప్రిజ్జంత సల్ల..గుంటయి!?|ADUGU TRENDS

పేదోల్ల అవ్వల్ దర్జా ప్రిజ్జి ఏందంటే? ఎవ్వలైనా ఏం శెప్తరు? మట్టి కుండ అంటరు! అవు మల్ల గీ నేల తల్లి, మన గా కుమ్మరన్నలు మనకిచ్చిన మట్టి కుండల నీల్లు పెయికి...

స్పష్టతలేని బిల్లులు సమస్యలకు హేతువులు!?|EDITORIAL

భారతదేశ ప్రజాస్వామ్య దశ, దిశను ప్రభావితం చేసే కీలక మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత అవసరం. ఈ రెండు అంశాల చుట్టూ ఉన్న అనుమానాలు, రాజకీయ వాదోపవాదాలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి....

16-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి బ చతుర్దశి రాత్రి 07.01 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 12.45 వరకు ఉపరి రేవతి యోగం ఐంద్ర ఉదయం 09.35 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం...

వాడి పడేసిన డబ్బల్ని వాడే ఇకమతు!?|ADUGU TRENDS

ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! ఉపాయం ఉంటే ఊరేగొచ్చట!! వాడి పడేసే డబ్బాల్ని గిట్ల వాడే ఇకమతు శేస్తున్న గీ అక్క ఉపాయం సూత్తే మీరే పరేషాన్ అయితరు! మనం పండ్లు కొంటే గ...

శాంతి చర్చలు-సజీవంగా ఆశలు!?|EDITORIAL

ప్రపంచంలో యుద్ధోన్మాద ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్నాయి. పశ్చిమాసియా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య చర్చలు విఫలమవడం, ఇజ్రాయెల్ పాత్ర, చమురు సరఫరాలో ప్రతిష్టంభన, అంతరాయం ప్రపంచాన్ని అస్థిరత వైపు నెడుతున్నాయి. శాంతి...

15-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ త్రయోదశి రాత్రి 08.17 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం పూర్వాభాద్ర మధ్యాహ్నం 01.10 వరకు ఉత్తరాభాద్ర యోగం బ్రహ్మ ఉదయం 11.27 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం 08.41 వరకు ఉపరి...

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News