Thursday, September 17, 2026
27.7 C
Hyderabad

జగదీప్ ధన్‌ఖడ్‌ రాజీనామా-జవాబులేని ప్రశ్నలు!|EDITORIAL

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్ రాజీనామా చేయడం సహజంగానే ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా, అంతకు మించిన అనుమానాలను కూడా రేకెత్తించింది. బెంగాల్‌ గవర్నర్‌గా ఆయన పనితీరును ప్రశంసించిన మోడీ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేశారు. అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియగానే పొడిగించమో లేదా రాష్ట్రపతిగా ప్రమోట్ చేయడమో జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ అవేవీ జరగలేదు. ఒకప్పుడు అద్వానీని రాష్ట్రపతిని చేస్తారని అంతా భావించారు. కానీ రామ్‌నాథ్‌ కోవింద్‌ను తెరపైకి తెచ్చి అద్వానీని అవమానించారు. ఈ దేశానికి ప్రధాని కావాలని ప్రగాఢంగా విశ్వసించి పార్టీ కోసం కృషి చేసిన అద్వానీకి మోడీ మెండి చేయి చూపాడు. దాంతో అద్వానీ శకం ముగిసింది. మురళీమనోహర్‌ జోషి జోష్ లేకుండా పోయింది. పాతతరంలో రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీలు మాత్రమే ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో ఉన్నారు. వెంకయ్యను పార్టీ నుంచి తప్పించే క్రమంలో ఉపరాష్ట్రపతిని చేసి, ఆ పదవి ముగిసిన వెంటనే ఆయనను వెనక్కి పంపించేశారు. ఇప్పుడు ఆ వంతు ధన్‌ఖడ్‌ కు వచ్చినట్లుంది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ధన్ ఖడ్ రాజీనామాను రాజీనామాను వెంటనే ఆమోదించారు. ఈ ఆమోదమే పలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. అనారోగ్య కారణాలతో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ధన్ ఖడ్ పేర్కొన్నప్పటికీ, రాజీనామాకు అసలు కారణం అనారోగ్యం కాదని, మరేవో ఉన్నాయన్న అనుమానాలను పలువురు రాజకీయ నేతలు వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల వేళ ఉపరాష్ట్రపతి అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే, ఉపరాష్ట్రపతి రాజీనామాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారు. ఉపరాష్ట్రపతి సహా వివిధ హోదాల్లో దేశానికి సేవ చేసేందుకు ధన్‌ఖడ్‌కు అనేక అవకాశాలు లభించాయన్నారు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకున్నారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమే తాను తన పదవిని వదులుకుంటున్నట్లు ధన్‌ఖడ్‌ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 67(ఏ) అధికరణ కింద ఇది తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు.

అయితే మరో రెండేండ్లు పదవీకాలం ఉండగానే ధన్‌ఖడ్‌ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకిలా అన్న చర్చ సాగుతోంది. 2022లో ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్‌ కావడంతో ఆయన బెంగాల్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. విపక్ష అభ్యర్థి మార్గరెట్‌ అల్వాపై విజయం సాధించి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 710 ఓట్లకు 528 ఓట్లు పొంది 1997 తర్వాత అత్యధిక ఓట్లతో ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇదిలావుంటే, ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన మూడో వ్యక్తి ధన్‌ఖడ్‌. అంతకుముందు 1969లో రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు వీవీ గిరి, 1987లో రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఆర్‌.వెంకటరామన్‌ ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. కానీ అలాంటిదేవిూ లేకుండానే ధన్‌ఖఢ్‌ రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం ధన్ ఖడ్ నిర్ణయం దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అనే న్యాయమూర్తి నివాసంలో భారీగా నగదు లభ్యం కావడంతో ఈ వివాదం మొదలైంది. ఈ సంఘటన తర్వాత విపక్ష పార్టీలు రాజ్యసభలో జస్టిస్‌ వర్మను తొలగించేందుకు ఒక నోటీసును ప్రవేశపెట్టాయి. రాజ్యసభ అధ్యక్షుడిగా ఉన్న జగదీప్‌ ధన్‌ఖడ్ ఈ నోటీసును ఆమోదించి, రాజ్యసభ కార్యదర్శికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ చర్య కేంద్ర ప్రభుత్వానికి నచ్చలేదని తెలుస్తోంది. విపక్షాలు ప్రవేశపెట్టిన ఈ నోటీసును ఆమోదించడం ద్వారా, న్యాయవ్యవస్థలో అవినీతిపై కేంద్రం నేరుగా చర్యలు తీసుకునే అవకాశాన్ని ధన్‌ఖడ్ తప్పించారని కేంద్రం భావించినట్లు సమాచారం. ఈ విషయంపై కేంద్రంతో విభేదాలు వచ్చాయని పుకార్లు కూడా వచ్చాయి. ఈ సంఘటన తర్వాత ధన్‌ఖడ్ పై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చే ప్రయత్నాలు మొదల య్యాయని తెలిసింది. ఆరు నెలల క్రితం కూడా విపక్షాలు ధన్‌ఖడ్ పై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చాయి. అయితే, ఈసారి కేంద్రం నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా, ధన్‌ఖడ్ అవమానకరమైన అవిశ్వాస తీర్మానానికి బదులు రాజీనామా చేయడాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సోమవారం రాత్రి 9:25 గంటలకు ఉప రాష్ట్రపతి అధికారిక ఎక్స్ ఖాతాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖను పోస్ట్‌ చేశారు. తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 67(ఎ) ప్రకారం రాజీనామా చేస్తున్నట్లు- లేఖలో తెలిపారు. ఇది వెంటనే అమల్లోకి వచ్చేలా భారత ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఈ క్రమంలో తన పదవీ కాలంలో సహకరించిన వారికి ధన్‌ఖడ్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే, ప్రధానమంత్రి, రాజ్యసభ సభ్యులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అయితే ఇవన్నీ బయటకు కనిపిస్తున్న కారణాలు మాత్రమే. ఇంకా ఇతరత్రా ఏ కారణాలు ఉన్నాయన్నది కాలక్రమంలో తెలుస్తుంది. అయితే ధన్‌ఖడ్‌ మోడీకి ఇష్టమైన వ్యక్తిగా అనూహ్యంగా దూసుకుని వచ్చి, అంతకంటే అనూహ్యంగా రాజీనామా చేసి వెళ్లిపోవడమే విధి వైపరీత్యమో? లేక రాజకీయ వైచిత్రమో?

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News