Tuesday, April 21, 2026
35.2 C
Hyderabad

ఇప్పటి నుండి SCHOOL|స్కూల్లోనే ఆధార్ కార్డులు|AADHAR CARD|UIDAI

దేశవ్యాప్తంగా FIVE YEARS|ఐదు సంవత్సరాలు దాటి కూడా AADHAR|ఆధార్‌ అప్‌డేషన్ చేయించుకోని చిన్నారుల సంఖ్య 7 కోట్లమందికి పైగా ఉందని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) వెల్లడించింది. ఈ నేపథ్యంలో చిన్నారుల బయోమెట్రిక్ అప్‌డేట్‌ను సులభతరం చేయడానికి ఉడాయ్ ఒక ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించింది. ఈ ప్రాజెక్టు కింద పాఠశాలల నుంచే దశలవారీగా బయోమెట్రిక్ అప్‌డేట్ ప్రక్రియను అమలు చేయనున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాకు బయోమెట్రిక్ యంత్రాలను పంపిణీ చేసి, అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఆధార్‌ కస్టోడియన్‌ ఉన్నతాధికారి ఈ విషయాన్ని వెల్లడించారు.

ఉడాయ్ సీఈవో భువనేశ్ కుమార్ మాట్లాడుతూ, పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్‌ను తల్లిదండ్రుల సమ్మతితో పాఠశాలల ద్వారా చేపట్టేందుకు సాంకేతికంగా సిద్ధంగా ఉండేలా ప్రణాళికను రూపొందించామని చెప్పారు. ప్రస్తుతానికి అవసరమైన సాంకేతికతను పరీక్షిస్తున్నామని, మరో 45 నుంచి 60 రోజుల్లో ఈ ప్రాజెక్టు అమలుకు సిద్ధమవుతుందని తెలిపారు. 5 నుంచి 7 ఏళ్ల వయసు పిల్లల వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి ఇది ఉపయోగపడనుందని పేర్కొన్నారు. ఏడేళ్లు దాటిన తర్వాత అప్‌డేట్ చేయాలంటే రూ.100 రుసుము విధించనున్నట్లు తెలిపారు.

ఇంతేకాదు, 15 ఏళ్లు పూర్తయిన తర్వాత జరగాల్సిన రెండో తప్పనిసరి BIO METRIC|బయోమెట్రిక్ అప్‌డేట్‌ (MBU) కోసం కూడా ఇదే విధానాన్ని స్కూళ్లు మరియు కాలేజీల ద్వారా అమలు చేయాలని ఉడాయ్ భావిస్తోంది. ఆధార్ అనేక ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్నందున, పిల్లలు ఈ పథకాల ప్రయోజనాలను సమయానికి పొందాలంటే వారి బయోమెట్రిక్ వివరాలు నవీకరించబడినవే ఉండాలని ఆయన తెలిపారు. స్కూల్ అడ్మిషన్లు, స్కాలర్‌షిప్లు, డీబీటీ నగదు బదిలీ పథకాలు వంటి ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ డేటా సరిగ్గా ఉండటం అవసరం.

ఎంబీయూ (MBU) ను నిర్లక్ష్యం చేస్తే ఆధార్ డేటాలో పొరపాట్లు రావచ్చు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, 7 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత కూడా ఎంబీయూ పూర్తికాకపోతే, సంబంధిత ఆధార్ డీయాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉందని ఉడాయ్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పిల్లల భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో స్కూళ్ల స్థాయిలోనే బయోమెట్రిక్ అప్‌డేట్‌ను అమలు చేయనున్నట్లు భువనేశ్ కుమార్ స్పష్టంచేశారు.

Latest News

గోడలకు గట్టిగ నీల్లు గొట్టే శిట్కా!?|ADUGU TRENDS

పెండ్లి శేసి సూడు... ఇల్లు కట్టి సూడన్నరు. గివి రెండు శేసుడు అంత వీజీ కాదన్నట్లు. గందుకే పండ్లి అన్నా, ఇల్లన్నా కనా కట్టమన్నట్లు. గట్లనే ఇల్లు కట్టాల్నంటే గా ముగ్గు పోసి...

కవిత పార్టీతో బీఆర్‌ఎస్‌కు లాభమా? నష్టమా?|EDITORIAL

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి వేదిక సిద్ధమవుతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు వస్తున్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రకటన కేవలం కొత్త...

21-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం శ్రీ ఆదిశంకరాచార్య జయంతి తిధి శు చవితి ఉదయం 08.31 వరకు ఉపరి పంచమి నక్షత్రం రోహిణి ఉదయం 06.14 వరకు ఉపరి మృగశిర యోగం శోభ సాయంత్రం 04.45 వరకు ఉపరి అతిగండ కరణం...

20-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం అక్షయ తృతీయ బసవ జయంతి తిధి శు తదియ ఉదయం 10.58 వరకు ఉపరి చవితి నక్షత్రం కృత్తిక ఉదయం 07.53 వరకు ఉపరి రోహిణి యోగం సౌభాగ్య రాత్రి 07.51 వరకు ఉపరి శోభ కరణం...

కులాలు, పండుగలు, ఆచారాలు, తెలంగాణ అస్తిత్వం|TELANGANA|FESTIVALS

ప్రాగైతిహాసిక కాలంలో కులపరమైన సమాజం లేదు. ప్రపంచంలో మొట్టమొదటి బృహత్ శిలా సమాధులు తెలంగాణలో ఉన్నాయి. ఉత్తర తెలంగాణ ప్రపంచంలోనే తొలినాళ్లలో ఇనుప ఉత్పత్తి చేసిన ప్రాంతాల్లో ఒకటి. దీని కారణంగా ఇక్కడ...

ఏసీల్లెక్క కూలర్ గాలికి గీ శిట్కాలు!?|ADUGU TRENDS

ఎండాకాలం రానే వచ్చె. పెనంల కెళ్ళి పొయ్యిల పడ్డట్టు, కుమ్ముల పెట్టినట్లు మలమల మాడి, ఉడికిపోబడితిమి. ఇగిప్పుడు ఏసీ టైమొచ్చింది. ఏసీల గిరాకీ, ధరలు సూత్తే అవి గూడ మండిపోబట్టే. ఇగ మద్దె...

విపక్షాలను ఏకం చేసిన అధికార పక్షం!?|EDITORIAL

విపక్షాలు ఏకమైతే కేంద్రానికి సవాల్ విసరగలవని తేలిపోయింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించకపోవడం, ఎన్‌డిఎ మద్దతుపైనే ప్రభుత్వం కొనసాగుతుండటం వల్ల కీలకమైన రాజ్యాంగ సవరణలను చేపట్టాలంటే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 19 నుండి ఏప్రిల్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. కొత్త అవకాశాలు మీ ముందు వస్తాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది....

మనుసులతోటి పనేంది? మిషిన్లుండంగ!?|ADUGU TRENDS

గిదంతా రెడీమేడ్ల కాలం! రెడీమేడ్ బట్టలొచ్చె. వండకతినే కుక్కర్లు, మైక్రో ఓవెన్లు వచ్చె. ఆర్డరేస్తే ఫుడ్డొచ్చె. బెడ్డొచ్చె. బట్టలుతికే వాషింగ్ మిషిన్లొచ్చె. ఇగ ఎవలికే కట్టం లేకుండ పిల్లల్ని కనే పద్ధతులొచ్చె!? గట్లనే...

మహిళల కోటా కోసం సీట్లు పెంచాల్సిందేనా!?|EDITORIAL

ప్రజలపై అదనపు భారం మోపకుండా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వలేమా? ప్రస్తుత సీట్లలోనే 33 శాతం కేటాయింపు అమలు చేయడం సాధ్యమే. అంటే 543 సీట్లలో సుమారు 181 సీట్లు మహిళలకు ఇవ్వవచ్చు. దీనివల్ల...

18-04-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం వైశాఖమాసం ప్రారంభం తిధి శు పాడ్యమి మధ్యాహ్నం 03.29 వరకు ఉపరి విదియ నక్షత్రం అశ్విని ఉదయం 10.50 వరకు ఉపరి భరణి యోగం ప్రీతి రాత్రి 01.50 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం బవ...

భయమా? వ్యూహమా?|PARLIAMENT|Delimitation bill|TEJASWI SURYA|BJP|NARENDRA MODI

పాగాకై పాకులాటా? కస్సుమన్న కాంగ్రెస్!|CONGRESS భగ్గుమన్న బీఆర్ఎస్!!|BRS ఆత్మరక్షణలో బీజేపీ!!!|BJP వివాదానికి నేపథ్యమేంటి? ఇప్పుడు సూర్య, గతంలో మోదీ! చారిత్రక అంశాల వక్రీకరణా? రాజకీయ మైలేజీ వ్యూహమా? కాంగ్రెస్‌ను టార్గెట్ చేయడమా? పునర్విభజన - దక్షిణాది భయమా? లోక్‌సభలో పునర్విభజన బిల్లుపై చర్చను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News