శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్టమాసం శుక్లపక్షం
తిధి శు.తదియ రాత్రి 02.50 వరకు
ఉపరి చవితి
నక్షత్రం ఆరుద్ర రాత్రి 02.15 వరకు
ఉపరి పునర్వసు
యోగం శూల సాయంత్రం 05.44 వరకు
ఉపరి గండ
కరణం కౌలవ ఉదయం 06.18 వరకు
ఉపరి గరజి
వర్జ్యం పగలు 11.45 నుండి 01.15
వరకు
దుర్ముహూర్తం ఉదయం 10.00 నుండి
10.48 వరకు తిరిగి పగలు 02.48 నుండి
03.36 వరకు
రాహుకాలం పగలు 01.30 నుండి
03.00 వరకు
సూర్యోదయం ఉదయం 05.42
సూర్యాస్తమయం సాయంత్రం 06.45
మేష రాశి
ఈ రోజు శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధాలు వస్తాయి. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. మీ నిర్ణయాలకు పెద్దలు గౌరవిస్తారు.
వృషభ రాశి
ఉద్యోగంలో అనుకోకుండా కొన్ని ప్రత్యేక బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది.
మిథున రాశి
చిన్నపాటి ఉద్యోగ అవకాశాలలో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు.
కర్కాటక రాశి
విదేశీ ప్రయాణాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రేమ, కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది.
సింహ రాశి
ఆర్థికంగా ఎదుగుతారు. కొత్త పెట్టుబడులు లాభిస్తాయి. కుటుంబ జీవితంలో శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త అవసరం.
కన్య రాశి
కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది. ప్రేమ, వైవాహిక జీవితం మెరుగవుతుంది. ఆరోగ్యపరంగా సాధారణ స్థితి ఉంటుంది. శని ప్రభావం వల్ల కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు.
తులా రాశి
ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. వృత్తిపరంగా గతి పెరుగుతుంది. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.
వృశ్చిక రాశి
ఉద్యోగం, వ్యాపారం మరింత బలపడతాయి. ప్రేమ, కుటుంబ సంబంధాల్లో అనుకోని మార్పులు వస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తలు అవసరం.
ధనుస్సు రాశి
ఆర్థిక, వృత్తి, ఆరోగ్య మరియు వ్యక్తిగత జీవితాలలో శుభఫలితాలు ఎదురవుతాయి. ఆదాయ వృద్ధి, పదోన్నతి, ప్రేమజీవితంలో ఆనందం లభిస్తుంది.
మకర రాశి
కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం లభిస్తుంది. వ్యాపార వ్యవహారాలలో ఓర్పుతో వ్యవహరించి మంచి లాభాలను అందుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.
కుంభ రాశి
కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
మీన రాశి
గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్య మళ్లీ తిరగబడుతుంది. అనుకున్న ఫలితాలు సాధించడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.

