Thursday, September 17, 2026
27.7 C
Hyderabad

సంచలన వ్యాఖ్యలు చేసిన టిపిసిసి|TPCC చీఫ్|CHIEF మహేష్ కుమార్ గౌడ్|MAHESH KUMAR GOUD

BRS|బిఆర్ఎస్ లో అంతర్గత కలహాలు భగ్గుమన్నాయి

KAVITHA|కవిత-కేటీఆర్|KTR మధ్య విభేదాలతో పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకం

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీపై విపక్షాల దాడులు ముదురుతున్నాయి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇంట్లోనే కుంపటి తట్టుకోలేక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. పార్టీపై తన ఆధిపత్యానికి భంగం కలిగేలా మరో పవర్ సెంటర్‌ రూపంలో కవిత ఎదగడంతో, కేటీఆర్ మతిభ్రమించి CM|సీఎం REVANTH REDDY|రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారని ఆయన విమర్శించారు.|TPCC|CHIEF|MAHESH KUMAR GOUD|BRS|KAVITHA|KTR|

ఇటీవలి కాలంలో కవితపై వచ్చిన విమర్శలు, కేసులు, నోటీసుల వ్యవహారాలను మరల్చేందుకు కేటీఆర్ జాతీయ రాజకీయాల్లో రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారన్నది మహేష్ గౌడ్ ఆరోపణ. ముందుగా తన ఇంట్లోనే రగులుతున్న అగ్ని అణుచుకోవాలి. పది సంవత్సరాల పాలనలో జరిగిన టీఆర్ఎస్ తప్పిదాలను ప్రజలకు కవితే గుర్తు చేస్తోంది, అని మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు.|TPCC|CHIEF|MAHESH KUMAR GOUD|BRS|KAVITHA|KTR|

కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరినట్లు పార్టీ నాయకుల మౌనమే స్పష్టంగా చెబుతోందని ఆయన అన్నారు. తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు, బీఆర్ఎస్‌కు, బీజేపీకి స్పష్టమైన అవగాహన ఉందని చెప్పిన మాటలు, పార్టీని మరింత అస్థిరతవైపు నడిపిస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. వీటన్నింటి కారణంగా బీఆర్ఎస్ మూడు ముక్కలవుతుందని, కవిత, కేటీఆర్ మధ్య అంతర్గత పోటీ తీవ్రమవుతున్న నేపథ్యంలో హరీష్ రావు ఎప్పుడైనా తన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని గౌడ్ విమర్శించారు.|TPCC|CHIEF|MAHESH KUMAR GOUD|BRS|KAVITHA|KTR|

ఇక పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా ఒంటరిగా ఫామ్‌హౌస్‌కి పరిమితమయ్యారని, ఆయన చుట్టూ ఉన్న మానవ రూప దయ్యాలు ఎవరో ప్రజలకు తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై కేంద్ర నోటీసులు వస్తుండటంతో కేటీఆర్ భయంతో చెమటలు పడుతున్నారని అన్నారు.|TPCC|CHIEF|MAHESH KUMAR GOUD|BRS|KAVITHA|KTR|

పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం అందించలేకపోయిందని, పంపకాల్లో తేడాల కారణంగానే కవిత కూడా ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగరవేసిందని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే భవిష్యత్తులో తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ అనే పార్టీ ఉండకపోవచ్చని ఆయన హెచ్చరించారు.|TPCC|CHIEF|MAHESH KUMAR GOUD|BRS|KAVITHA|KTR|

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News