Friday, May 1, 2026
28.7 C
Hyderabad

Pakistan|పాక్‌పై దౌత్య యుద్ధానికి భారత్‌|India సిద్ధం

ఏడుగురు బృంద సారథులను ప్రకటించిన కేంద్రం

నెలాఖరున విదేశీ పర్యటనలకు సిద్ధం

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్‌ సిందూర్ Operation Sindhoor ద్వారా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ప్రతీకారం తీర్చుకున్న భారత్‌, ఇప్పుడు దౌత్యరంగంలోనూ అదే పంథాలో సాగేందుకు సన్నద్ధమైంది. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లి, అక్కడి మద్దతును పొందేందుకు భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున యత్నాలు ప్రారంభించింది. ఈ దిశగా ఏడు బృందాలను ఏర్పాటు చేసిన కేంద్రం, పార్లమెంటు సభ్యులు, వివిధ పార్టీల నేతలు, దౌత్యవేత్తలతో ఈ బృందాలను రూపొందించింది. ఈ నెలాఖరు నుంచి ఈ బృందాలు వివిధ దేశాల్లో పర్యటించనున్నాయి.

ప్రతి బృందానికి నాలుగు నుంచి ఐదు దేశాలు కేటాయించబడిన ఈ యాత్రలో, పాక్‌ విద్వేష రాజకీయాలు, ఉగ్రవాద మద్దతు, భారత్‌పై దాడులకు ప్రేరణ వంటి అంశాలను స్పష్టంగా వివరించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐరాస భద్రతా మండలిని కూడా సంప్రదించనున్నారు.

ఈ దౌత్యబృందాలకు విపక్షం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శశి థరూర్‌|shashi tharoor (కాంగ్రెస్‌), కనిమొళి|kanimoli (డీఎంకే), సుప్రియా సూలే|Supriya Sule (ఎన్సీపీ-పవార్‌)లతో పాటు అధికార ఎన్డీఏ కూటమి నుంచి రవిశంకర్‌ ప్రసాద్‌|Ravi Shanker Prasad, బైజయంత్‌ పాండా (బీజేపీ), సంజయ్‌ కుమార్‌ ఝా (జేడీయూ), శ్రీకాంత్‌ షిండే (శివసేన-షిండే) నేతృత్వం వహిస్తున్నారు.

ఈ బృందాల్లో అనురాగ్‌ ఠాకూర్‌, అపరాజితా సారంగి, మనీశ్‌ తివారీ, అసదుద్దీన్‌ ఒవైసీ, అమర్‌ సింగ్‌, రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ, సమిక్‌ భట్టాచార్య‌, బ్రిజ్‌లాల్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌, ప్రియాంక చతుర్వేది, విక్రమ్‌జిత్‌ సాహ్నీ, సస్మిత్‌ పాత్ర‌, భువనేశ్వర్‌ కలితా, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ తదితరులు సభ్యులుగా ఉన్నారు.

ప్రతి బృందానికి కేటాయించిన దేశాలు:

శశి థరూర్‌ నేతృత్వంలోని బృందం: అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా

సుప్రియా సూలే బృందం: ఈజిప్ట్‌, ఖతర్‌, ఇథియోపియా, దక్షిణాఫ్రికా

కనిమొళి బృందం: రష్యా, స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాత్వియా

సంజయ్‌ కుమార్‌ ఝా బృందం: జపాన్‌, సింగపూర్‌, దక్షిణ కొరియా, మలేషియా, ఇండోనేసియా

రవిశంకర్‌ ప్రసాద్‌ బృందం: ఈయూ, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్

బైజయంత్‌ పండా బృందం: సౌదీ అరేబియా, కువైట్‌, బహ్రెయిన్‌, అల్జీరియా

శ్రీకాంత్‌ షిండే బృందం: యూఏఈ, లైబీరియా, కాంగో, సియెర్రా లియోన్‌

ఈ దౌత్య యాత్రల ద్వారా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును సమకూర్చేందుకు భారత్‌ ప్రయత్నిస్తోంది. ప్రపంచ దేశాలకు పాక్‌ ఉగ్రవాద మద్దతును తెలియజేసి, భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను బహిర్గతం చేయడమే ఈ పర్యటనల ముఖ్య ఉద్దేశ్యంగా ప్రభుత్వం పేర్కొంది.

Latest News

పందేరం సందేశమేనా?|TELANGANA|V.HANUMANTHA RAO|BC

వీహెచ్ కు సలహా పదవి..|V.HANUMANTHA RAO|ADVISOR బీసీలకు సానుకూల సంకేతమా?|BC సీనియర్ల అనుభవానికి గుర్తింపా?|SENIOR LEADERS పార్టీకి, ప్రభుత్వానికి మేలు చేసేనా?|PARTY|GOVERNMENT సీఎం పదవి మరింత పదిలమయ్యేనా?|CM కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు సలహాదారుగా పదవివ్వడం పార్టీలో సీనియార్టీని గౌరవించడమా?...

ఇటికెలకు నీల్లు కొడితే, గోడలు గట్టిగుంటయ్!?|ADUGU TRENDS

ఇల్లు కడితే ఏం శేత్తం? గోడలు కట్టినంక నీల్లు బాగా పడ్తం. కనీ, ఇటికెలకు నీల్లు పట్టినంకనే గోడలు కట్టాల్నట! గట్ల కడితే గా ఇటికెలు గట్టిపడి గోడలు నెర్రెలు బాయయట. గంతే...

శ్రమైక జీవన సౌందర్యం-మే డే!|EDITORIAL

“శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే శరాబు లేడోయ్” అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కష్టజీవులకు, కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ, స్వస్తివాక్యములు సంధానిస్తూ, స్వర్ణవాద్యములు సంరావిస్తూ, వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక...

01-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం వైశాఖ పూర్ణిమ మేడే  తిధి శు పౌర్ణమి రాత్రి 09.15 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం స్వాతి రాత్రి 03.10 వరకు ఉపరి విశాఖ యోగం సిద్ది రాత్రి 08.13 వరకు ఉపరి వ్యతీపాత కరణం భద్ర...

అదిరింది..గీ బొంగులతో పందిరి!?|ADUGU TRENDS

సల్లగుండాలె! సూడ్డానికి మంచిగుండాలె! ఏం శేయాలె? గిట్ల ఆలోసించిన గీ అన్నకు భలే ఐడియా వచ్చింది. గదేందో సూత్తాం పదండ్రి. అసలే ఎండా కాలం.. ఆపైన వానా కాలం. ఇగ తర్వాత సలికాలమే అనుకోండ్లి!...

కవిత్వాన్ని భూమార్గం పట్టించిన మహాకవి!|EDITORIAL

సమాజాన్ని మేల్కొలిపే శక్తి సాహిత్యానికి ఉంది. ఆ శక్తికి రూపం ఇచ్చినవారు కవులు. అలాంటి కవుల్లో అగ్రగణ్యుడు శ్రీరంగం శ్రీనివాసరావు, అంటే “శ్రీశ్రీ”. ఆయన కవిత్వం కేవలం సాహిత్యానికే పరిమితం కాలేదు. అది...

30-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు చతుర్దశి రాత్రి 08.06 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం చిత్త రాత్రి 01.21 వరకు ఉపరి స్వాతి యోగం వజ్ర రాత్రి 08.23 వరకు ఉపరి సిద్ది కరణం గరజి ఉదయం...

భూకంపం పుట్టిస్తున్న భూ సేకరణ!|EDITORIAL

అభివృద్ధి ప్రజల సహకారంతో మాత్రమే సుస్థిరంగా ఉంటుంది. రైతులను భాగస్వాములుగా కాకుండా బాధితులుగా మార్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉండవు. అమరావతి వంటి మహత్తర ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటే, అక్కడి రైతుల నమ్మకం,...

29-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 07.30 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం హస్త రాత్రి 12.00 వరకు ఉపరి చిత్త యోగం హర్షణ రాత్రి 08.52 వరకు ఉపరి వజ్ర కరణం కౌలవ ఉదయం...

ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్! హార్మూజ్ ని తెరుస్తాం! కానీ,

అమెరికాకు ఇరాన్ రెండు షరతులు అమెరికా-ఇరాన్ చర్చలపై అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఇరాన్ కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చింది. హర్మూజ్ జలసంధిని తెరిచి నౌకల రాకపోకలకు అనుమతిస్తామని తెలిపింది. అయితే అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని...

శిన్న శిట్కాతోటి కొవ్వు ఖతం!?|ADUGU TRENDS

ఇగిప్పుడు అందరి బాధా గా పెయ్యిల శెడు కొవ్వే! మనం తినే ఆహారపు అలవాట్లు, బతుకు తెరువులు బాగా మారినయి. జీవన శైలి గూడ మస్తుగ మారింది. ఇగ గిదీంతోటి పెయ్యిల అట్టు...

కొంగ జపం శాంతి తపం!?|EDITORIAL

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు నిజమేనా? అసలా చర్చలు దౌత్య నాటకమా? నిజమైన పరిష్కార ప్రయత్నమా? మధ్యప్రాచ్యంలోని తాజా ఉద్రిక్తతలను పరిశీలిస్తే ఈ ప్రశ్న తలెత్తక మానది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News