Wednesday, September 16, 2026
29.4 C
Hyderabad

‘ఉత్తర’ ప్రగల్బాలు అతడివేనా?

అన్ని ఉగ్రదాడుల వెనుకా అతడే!
అతడి వెనుకే పాక్!!

భారత్ లో అన్ని ఉగ్రదాడుల వెనుక ఉన్నది ఆ ఒక్కడే..! అతడే మసూద్‌ అజార్‌. జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్‌. ఆపరేషన్‌ సిందూర్‌లో మెయిన్‌ టార్గెట్‌ మహమ్మారి ఈ మసూదే! 1994 లో అరెస్టై, 1999లో విడుదలై, ఒకసారి పాక్ లో భారీ బహిరంగ సభలో, ఆర్మీ హాస్పిటల్ లో మాత్రమే కనిపించాడు. ఈ కనిపించని కర్కోటకుడు అండర్ గ్రౌండ్ నుంచే ఉగ్రవాద ఆపరేషన్స్ చేస్తున్నాడు. చేయిస్తున్నాడు. మరి ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తన కుటుంబ సభ్యులు, బంధువుల చనిపోతే, అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ, పోలీసు భద్రత మధ్య విషణ్ణ వదనంతో కనిపించాడు. చావు తప్పి, భారత్‌పై పిచ్చి ప్రేలాపనలతో విర్రవీగిన అజార్ మసూద్ ఎక్కడున్నాడు? మసూద్‌కి రక్షణ కల్పిస్తున్నదెవరు? అసలు మసూద్‌ ఇప్పటి దాకా ఎక్కడ ఉన్నాడు? ఇంతకీ లేఖ విడుదల చేసింది ఎవరు అన్న చర్చ ప్రపంచ వ్యాప్తంగా మొదలైంది.

న్యూ ఢిల్లీ, మే 8 (అడుగు న్యూస్ ప్రత్యేక ప్రతినిధి):
భారత్‌ ఎటాక్‌తో పాకిస్తాన్‌ గడ్డపై ఉగ్ర మూకలు చావు కేకలు పెట్టాయి. పహల్గామ్‌ ఉగ్రదాడికి మూల్యం చెల్లించుకున్నాడు జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌. భారత్‌ రివెంజ్‌ ఎటాక్‌లో మసూద్ అజార్‌ కుటుంబం హతమైంది. మసూద్ సోదరి, మౌలానా కషాఫ్ కుటుంబంతో కలిపి మొత్తం 14మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ దాడిలో తాను చనిపోతే బాగుండని ఘోల్లున ఏడ్చిన మసూర్‌ అజార్‌, ఆ తర్వాత విర్రవీగాడు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విషం కక్కుతూ ఓ లేఖ విడుదల చేశాడు. ప్రధాని మోదీ అన్ని నియమాలూ ఉల్లంఘించారంటూ ఆక్రోశం వెల్లగక్కాడు. భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం.. ఇకపై జాలి చూపను అంటూ.. మరీ ఓవరాక్షన్‌ చేశాడు మసూద్. తను చేసిన పాపాలన్నీ మరిచిపోయి భారత్‌ తప్పుచేసిందన్నట్లు మాట్లాడుతున్నాడు.

నిజానికి ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్‌ బహావల్ పూర్ స్థావరం పూర్తిగా నేలమట్టమైంది. ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్‌ హెడ్‌క్వార్టర్‌ ఇదే. బహావల్‌‌పూర్ పాకిస్థాన్‌లో 13వ అతిపెద్ద నగరం. ఇక్కడున్న జామియా మసీద్‌ సుభాన్ అల్లా కాంప్లెక్స్‌ నుంచి జైషే మహమ్మద్‌ టెర్రర్‌ ప్లాన్స్‌ వేస్తోంది. దాదాపు 18 ఎకరాల్లో ఆ సంస్థ టెర్రర్‌ క్యాంప్‌ ఉంది. దాన్ని సమాధి చేయడంతో మసూద్‌ అజార్‌ రగిలిపోతున్నాడు.

మసూద్ అజార్‌ మొదట్లో హర్కతుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థతో మొదలుపెట్టి.. 2000 సంవత్సరంలో జైష్-ఎ-మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. మసూద్ అజార్‌ని 1994లో భారత ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టింది. అతన్ని విడిపించేందుకు ఉగ్రవాదులు 1999లో భారత విమానాన్ని హైజాక్ చేశారు. దీంతో అతనితో పాటు మరో ఇద్దరిని అప్పటి భారత ప్రభుత్వం విడుదల చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అతడిని మట్టుబెట్టేందుకు భారత్‌ ఆర్మీ దూకుడు మీదుంది.

ఆపరేషన్ సిందూర్ తర్వాత మసూద్ అజార్ పరిస్థితేంటన్నది ఎవరికీ తెలవట్లేదు. మసూద్ అజార్‌ ఇప్పుడెక్కడున్నాడు? పాక్ రక్షణలోనే ఉన్నాడా? లేక మరెక్కడైనా దాక్కున్నాడా? అంతేకాదు ప్రతీకారం తప్పదన్న లేఖ అతనిదేనా? లేకపోతే ఉగ్ర గురువు పోవటంతో అతని తోకలెవరన్నా ఈ తోకాడిస్తున్నారా? అన్న డౌట్‌ కూడా ఉత్పన్నమవుతోంది. మరోవైపు మసూద్‌ అజహర్‌పై భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కథ మిగిలే ఉందంటూ ఆయన కామెంట్స్‌ చర్చనీయాంశమయ్యాయి.

Latest News

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News